Shivaratri |
శివరాత్రి వ్రతము
త్రయోదశియందు ఏకభుక్తము చేసి, చతుర్దశియందు నిత్యకర్మను ఆచరించి, ప్రాత: కాలమున మంత్ర పూర్వకముగా సంకల్పించాలి.
శ్లో “శివరాత్రి వ్రతంహ్యేతత్ కరిష్యేహం మహాఫలం |
నిర్విఘ్నం కురుమే దేవా త్వత్ ప్రసాదాత్ జగత్పతే ||
చతుర్దష్యాం నిరాహారో భూత్వా శంభో పరేహని।
భోక్ష్యేహం భుక్తి ముక్త్యర్థం శరణం మే భవేశ్వర॥
మహాఫలమునిచ్చు నీ శివరాత్రి వ్రతము చేసెదను. నీ ప్రసాదము వలన పరదినమందు పారణ, భుక్తి ముక్తులు కలుగజేయుము, నాకు రక్షకుడవుకమ్ము అని అర్దము.
“శివ ప్రీత్యర్థం శివరాత్రౌ శివ పూజాం కరిష్యే" అని సంకల్పించి పూజింపవలెను. శ్రద్ధాసక్తులు ఉన్నవారు శివరాత్రి వ్రతాన్ని నాలుగు యామములందు ప్రాతఃకాలము, అపరాహ్ణ కాలము ప్రదోషకాలము, రాత్రి కాలంలో) రుద్రాభిషకమును ఆచరించవలెనని ధర్మసింధువునందు చెప్పబడియున్నది.
రుద్రుడిని ధ్యానించి, ప్రాణప్రతిష్ట చేసి, లింగము స్థాపించి స్క్ఫుశింపుచూ.....
ఓం భూః పురుషం సాంబ సదాశివం ఆవాహయామి
ఓంభువః పురుషం సాంబ సదాశివం ఆవాహయామి
ఓం సువః పురుషం సాంబ సదాశివం ఆవాహయామి
ఓం భూర్జువస్సువః పురుషం సాంబ సదాశివం ఆవాహయామి అని ఆవాహనం చేసి మిగతా
ఉపచారాలను చయాలి.