శివభగవానుడు ! |
కార్తీక మాసంలో వైజ్ఞానిక విశేషాలు
Science Behind Kartika Masam
కార్తీకంతో సమానమైన మాసమూ, వేదంతో సమానమైన శాస్త్రమూ లేవని రుషివచనం. జ్యోతిష్యశాస్త్ర రీత్యా చంద్రుడు మనః కారకుడు, పౌర్ణమి తిథికి అధిపతి. చంద్రుడికి ప్రాధాన్యం కలగిన ఈ కార్తీక పౌర్ణమినాడు ఆరాధన చేస్తే మానసిక ప్రశాంతత, ఆనందం లభిస్తాయంటారు. కార్తీక దీపాలను చూసిన చెట్లు, జంతువులు, కీటకాలకు కూడా పునర్జన్మ ఉండదంటే ఇక వాటిని వెలిగించిన వారికి దక్కే పుణ్యం ఎంతో మీరో ఊహించుకోండి.
- కార్తిక మాసంలో చలి పెరుగుతుంది. దీనివల్ల రక్తనాళాలు సంకోచించి రక్తంలో ఉండే కొవ్వు మెదడు, గుండె వంటి ప్రధాన భాగాల్లో పేరుకుపోతుంది. అది బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వంటి ప్రమాదాలకు దారి తీస్తుంది. ఇప్పుడు వాడుతున్న విద్యుత్ దీపాల వల్ల కాంతి తప్ప వేడి రాదు. కానీ దీపం వెలిగిస్తే కాంతితో పాటు వేడి కూడా పుడుతుంది. కార్తిక మాసంలో పెద్ద ఎత్తున దీపాలు వెలిగించడం వల్ల జనావాసాలుండే వాతావరణం వేడెక్కి ఇలాంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవు.
- కార్తీక పౌర్ణమి రోజున రాత్రి పండు వెన్నెల ఉంటుంది. ఈ వెన్నెలలో పాలు కాస్తే ఆ పాలు పున్నమి చంద్రునిలో ఉండే అమృతంతో నిండి అమృత తుల్యం అవుతా యని ఒక నమ్మకం. ఆ పాలు త్రాగితే మనం కూడా అమృతం త్రాగిన దేవతల వలె యవ్వనవంతులై ఉంటామని, నిండు నూరేళ్లు ఆరోగ్యంగా వర్థిల్లుతామని కూడా ఒక నమ్మకం. అందుకని పూర్వకాలంలో మన పెద్దలు కార్తీక పౌర్ణమి వెలుగులో పొయ్యి వెలిగించి పాలను మిరియాలతో పాటుగా కాచి త్రాగేవారు.కార్తీక పౌర్ణమి రోజున ఆకాశంలో చంద్రుడి నిండైన రూపంతో పాటు దానికి అతి చేరువలోనే గురువైన బృహస్పతి అదే గురు గ్రహం కూడా మనకి సాక్షాత్కరించడం. గురుశిష్యూలకి భక్తితో నమస్కరిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
- ‘న కార్తీక సమోమాసం’ అని అగస్త్యుడు అభివర్ణించినట్లు కార్తీక మాసంలోని దినాలన్నీ పరమపావ నమైనవే. ఈ రోజున ప్రాతకాలాన దంపతులు సరిగంగ స్నానాలు చేయడం విష్ణూవుకెంతో ప్రీతకరం.
- వేదాలను అప హరించి సముద్రంలో దాక్కున్న సోమకుడనే రాక్షసుణ్ని సంహరిం చేందుకు శ్రీహరి మత్య్సావతారం ధరించినదీ ఈ పూర్ణిమనాడే. దత్తాత్రేయ జన్మదినం ఇదే. ఈ పూర్ణిమను త్రిపురి పూర్ణిమ అనీ, దేవదీపావళి అనీ, కుమార దర్శనమనీ పిలుస్తారు. ఈ శరదృపూర్ణిమనాడే ‘రాసలీలా మహోత్సవం’ జరిగింది. యోగసిద్ధులైన గోపికలను శ్రీకృష్ణపరమాత్మ అనుగ్రహించిన శుభదినమూ ఇదే.
- ఈ పౌర్ణమినాడు ‘వృషోత్సర్జనం’ అనే ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఒక కోడెదూడను ఆబోతుగా స్వేచ్ఛగా కీర్తిశేషూలైన పితృదేవతల ప్రీత్యర్థం వదులుతారు. ఇలా చేయడం వల్ల గయలో వారి ఆత్మశాంతికోసం కోటిసార్లు శ్రాద్ధం జరిపిన పుణ్యఫలం ప్రాప్తిస్తుదంటారు.
- ప్రమిదలు, వరి, గోధుమపిండి లేదా మట్టి ప్రమిదలలో ఆవునెయ్యిపోసి పైడి వత్తులలతో అసంఖ్యాకంగా దీపాలు వెలిగిస్తారు. అరిటిదొప్పల్లో దీపాలు వెలిగించి, నదులపైన వదిలే ఈ దీపాలను కార్తీక దీపాలుగా పిలుస్తారు. ఈ రోజున దానాలలో ఏదో ఒకటి చేయడం అవశ్యకం.
- కార్తీక దీపాలు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి అన్ని పౌర్ణముల కన్నా అధిక ప్రాముఖ్యం ఉంది. ఈ రోజు ప్రతి ఇంట్లోనూ మహిళలు పూజలలో మునిగి ఉంటారు. ఉదయం నదీ, సముద్ర స్నానాలు చేసి వస్తారు. సాయంత్రం చీకటి పడ్డాక దేవాలయంలోనూ, ఇంట్లోనూ దీపాలు వెలిగించి వెలుగులు నింపుతారు. దీపం అంటే మన సంస్కృతిలో జ్ఞానం అని అర్థం. దీపం వెలిగించడమంటే జ్ఞానాన్ని నెలిగించడం అంటే, మన మాతృమూర్తులు దీపాలు వెలిగించి మన సమాజంలో జ్ఞానాన్ని నింపుతున్నారు. కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగిస్తే సంవత్సరం అంతా దీపం వెలిగించినట్లుగా ఉంటుందని మన సంస్కృతిలో ఒక నమ్మ కం.
- ఆ నమ్మకాన్ని ఇప్పటికీ మన మాతృమూర్తులు పాటిస్తూ సమాజంలో జ్ఞానమమే వెలుగులు నింపుతూనే ఉన్నారు. దీపారాధనకు మట్టి ప్రమిదలు, 1008 వత్తులు, నక్షత్రహారతికి ఆవునేతిని, దీపారాధనకు నువ్వుల నూనె వాడతారు.
- ఈరోజున దీపదానం చేస్తే కైవల్యం ప్రాప్తిస్తుందని పురాణ ఇతిహాసాల్లో తెలిపారు. వరిపిండి ప్రమిదగాని, వెండి ప్రమిదలు గానీ దానమియ్యాలి.
- ఈ రోజున నమక, చమక మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు కోరిన కోరికలు నెరవేరుస్తాడని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమి రోజు తులసికోటలో ఉసిరికొమ్మ (కాయలతో) పెట్టి తులసి చెట్టు పక్కన రాధాకృష్ణూని విగ్రహాన్ని ఉంచి పూజిస్తే యువతులు కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని ప్రతీతి.
- ఈ రోజున ఉసిరక దానం చేయడం వల్ల దారిద్య్రం తొలిగిపోతుంది