Amavasya |
Polala Amavasya | పొలాల అమావాస్య
ఊరి పొలిమేరలో కొలువై జీవకోటిని కాపాడే తల్లి పోలేరు అమ్మ. ఈ అమ్మకు ఏడాదికి ఒకసారి శ్రావణ బహుళ అమావాస్య నాడు పూజలు చేయడం ఆచారంగా వస్తుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలలో ఈ పండుగను విశేషంగా జరుపుకుంటారు.
ఈ పండుగకు కౌశ్య అమావాస్య, ఆలోక అమావాస్య, సప్తపురికా అమావాస్య, పోలాంబ వ్రతం అనే పేర్లు కూడా వున్నాయి. భారతదేశంలోని ప్రతి ప్రాంతంలోనూ గ్రామా దేవతలను ఆరాధించే ఆచారం కనిపిస్తుంది. గొప్ప తపస్సు చేసి బ్రహ్మ నుంచి వరాలు పొందిన అంధకాసురుడు అహంకారంతో విచక్షణ కోల్పోయి జగన్మాత అయిన పార్వతీదేవి కామించాడు. అప్పుడు దానవుడిని శివుడు సంహరిస్తాడు. ఆ సమయంలో తనకు సాయం చేసిన నందిని ఏదైనా వరం కోరుకోమన్నాడు శివుడు. వృషభ రూపం లభించిన తనకు శ్రావణ బహుళ అమావాస్యనాడు పూజ చేసిన వాళ్లకు విశేష పుణ్యఫలం లభించాలి అని నంది కోరుకున్నాడు.అందుకే ఈ రోజు ఎద్దులను పూజిస్తారు. సంతానం లేని వారికీ పోలేరుఅమ్మ సంతానం ఇస్తుంది, సంతానం కలిగిన వారికీ కడుపు చలవ చేస్తుంది అని స్త్రీలు విశ్వసిస్తారు. ఈ అమ్మవారిని విశేషంగా పూజిస్తారు, తోరాలని పిల్లల మెడలో కడుతారు.
మహారాష్ట్రలో ఈ అమావాస్యను పిథోరి అమావాస్యగా పిలుస్తారు.