Navagrahamulu |
నవగ్రహ దోషములు-స్నానౌషధములు
నవగ్రహ దోషములు-స్నానౌషధములు సిద్ధౌషధ సేవలవలన రోగములు,మంత్ర జపమువలన సకల భయము తీరునట్లుగా ఔషధస్నాన విధానమువలన గ్రహదోషములు నశించును.
- సూర్య గ్రహ దోషము తొలగుటకు: మణిశిల, ఏలుకలు, దేవదారు, కుంకుమ పువ్వు,వట్టివేళ్ళు, యష్టిమధుకము, ఎర్రపుష్పాలు, ఎర్రగన్నేరు పువ్వులు ఈ వస్తువులను నీళ్ళూ వేసి కాచి,ఈ నీటితో స్నానము చేయవలెను.
- చంద్ర గ్రహ దోషము తొలగుటకు: గో మూత్రము,ఆవు పాలు,ఆవు పెరుగు,ఆవు పేడ,ఆవు నెయ్యి,శంఖములు,మంచిగంధములు,స్పటికము ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానము చేయవలెను.
- కుజ గ్రహ దోషము: మారేడు పట్టూ, ఎర్రచందనము, ఎర్రపువ్వులు, ఇంగిలీకము, మాల్కంగినీ, సమూలంగా పొగడ పువ్వులు ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానము చేయవలయును.
- బుధ గ్రహ దోషము: ఆవుపేడ,తక్కువ పరిమాణములో పండ్లు, గోరోచనము, తేనే, ముత్యములు బంగారము ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి,ఆ నీటితో స్నానము చేయవలయును.
- గురు గ్రహదోషమునకు: మాలతీపువ్వులు, తెల్ల ఆవాలు, యష్టి మధుకం, తేనే వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానము చేయవలయును.
- శుక్ర గ్రహదోషము: యాలుకలు, మణిశిల, శౌవర్చ లవణము, కుంకుమ పువ్వు ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి,ఆ నీటితో స్నానము చేయవలయును.
- శని గ్రహ దోషము: నల్ల నువ్వులు, సుర్మరాయి, సాంబ్రాణి, సోపు, వస్తువులను నీళ్ళలో వేసి కాచి,ఆ నీటితో స్నానము చేయవలయును.
- రాహు గ్రహ దోషము: సాంబ్రాణి, నువ్వు చెట్టు ఆకులు, కస్తూరి, ఏనుగు దంతము (ఏనుగు దంతము లేకపొయినను తతిమ్మా వాటితో) ఈ వస్తువులను నీళ్ళలో వేసి ఆ నీటితో స్నానము చేయవలయును.
- కేతు గ్రహ దోషము: సాంబ్రాణి, నువ్వుచెట్టు ఆకులు, ఏనుగు దంతం, మేజ మూత్రం, మారేడు పట్ట ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానం చేయవలెను.