Amavasya |
మౌని అమావాస్య
పుష్యమాసంలో అమావాస్యను మౌని అమావాస్యగా జరుపుకుంటారు. ఇది జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో వస్తుంది. మౌని అమావాస్యను చాలా పవిత్రమైన పర్వదినంగా భావిస్తారు మరియు నదుల్లో పవిత్రస్నానాలు ఆచరిస్తారు. స్నానం యొక్క పవిత్రత రెండు లేదా ఎక్కువ నదులు కలిసేచోట చేస్తే పెరుగుతుంది. మరో ముఖ్య విషయం మౌని అమావాస్య సాధారణంగా కొత్త సంవత్సరపు మొదటి అమావాస్యగా మరియు మహాశివరాత్రి ముందు ఆఖరి అమావాస్యగా వస్తుంది.
మౌని అమావాస్య ప్రాముఖ్యత:
- మౌని అమావాస్యను మౌనంగా ఉండే అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు , సాధువులు మౌనంగా ఉంటారు. దీన్ని జ్ఞానంను నిద్రలేపే చర్యగా భావించి , దానికోసం మాటలు అవసరం లేదని భావిస్తారు. ఏమీ చెప్పవలసిన అవసరం కానీ , చెప్పగలిగేందుకు కూడా ఏమీ ఉండదని నమ్ముతారు.
- గంగానది నీరు మౌని అమావాస్య నాడు అమృతంగా మారుతుందని నమ్ముతారు. దీనివల్ల ఆరోజు స్నానం చేయటానికి గంగానది ముఖ్యమైన నదిగా మారింది.
- గంగానదిలో స్నానం చేయటానికి కూడా మౌని అమావాస్య కూడా మేటి రోజు. కొంతమంది భక్తులు మాఘమాసం మొత్తం గంగానదిలో స్నానం చేయాలని వ్రతం చేపడతారు. వారు పుష్య పూర్ణిమ నాడు మొదలుపెట్టి , మాఘ పూర్ణిమ నాడు వ్రతాన్ని పూర్తి చేస్తారు. ఈ రోజు ఎంత ముఖ్యమైనదంటే 2017 సంవత్సరంలో , 5 కోట్ల కన్నా ఎక్కువ మంది భక్తులు అలహాబాద్ సంగమ్ ఘాట్ల దగ్గర చేరి పవిత్రస్నానం ఆచరించారు.
- మౌని అమావాస్య రోజును మాఘి అమావాస్య అని కూడా అంటారు. ఇది ఉత్తరభారతం వారు పాటించే క్యాలెండర్ లో మాఘమాసంలో వస్తుంది
మౌని అమావాస్య ఆధ్యాత్మిక విశిష్టత:
- మౌని అమావాస్య పదాల్లో ఉన్న ఆధ్యాత్మిక తత్వం చాలా గొప్పది. మౌని అమావాస్య పదాలను మౌని , అమ మరియు వాస్యగా విడగొట్టవచ్చు.
- మౌనికి అనువాదం - మాట్లాడకుండా మౌనంగా ఉండటం , అమ - చీకటి మరియు వస్య - కామం. అమావాస్యకి మరో అర్థం కలిసి వెతకడం. దీని అర్థం పగటిపూట మౌనంగా ఉండి చీకటిని , కామాన్ని తొలగించుకోవాలని.
- చంద్ర దేవుడు లేదా చందమామ మన మనస్సులను నియంత్రించే గ్రహమని నమ్ముతారు. మౌని అమావాస్య నాడు చంద్రుడు ఉండడు. ఈ రోజు మాట్లాడే మాటలు లేదా నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వవు.
- భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు - *'మన మనస్సే మనకి గొప్ప స్నేహితుడు , అందుకని దానికి సరిగ్గా శిక్షణనిస్తే నియంత్రణలో ఉంటుంది. దానికి మీమీద నియంత్రణనిస్తే అదే గొప్ప శత్రువుగా మారవచ్చు.'
- శరీరాన్ని , మనస్సును , ఆత్మను శుద్ధిచేసుకునే పవిత్రనదుల్లో స్నానం మరియు మౌనంగా ఉండే సంప్రదాయానికి కూడా కారణం ఇదే కావచ్చు.
మౌని అమావాస్యను ఎలా జరుపుకోవాలి?
సాంప్రదాయంగా , భక్తులు మౌని అమావాస్య రోజు ఉపవాసం ఉంటారు. మౌనవ్రతం చేస్తారు మరియు ఒక్క మాట కూడా మాట్లాడకుండా జాగ్రత్తపడతారు. గంగానదిలో స్నానం కూడా తప్పనిసరిగా భావిస్తారు. మీరు సాంప్రదాయకంగా మౌని అమావాస్యను జరుపుకోలేకపోతే , మీరు అదే ఫలితం కోసం ఈ కింది ఆచారాలను పాటించవచ్చు.
మీరు గంగానదిలో స్నానం చేయలేకపోతే, మీ ఇంట్లో గంగానది నీళ్ళు కొంచెం ఉన్నట్లయితే , అందులో కొన్ని చుక్కలను స్నానం చేసే నీళ్ళకి జతచేయండి. మీరు స్నానం చేసే ముందు ఈ మంత్రాన్ని చదవవచ్చు.
'గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి ,
నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధుం కురు'
పై మంత్రం భారత ఉపఖంఢంలోని అన్ని పవిత్రనదుల ఆశీర్వాదాన్ని మరియు తమ అంశలను మీ స్నానం చేసే నీటిలో చేరేలా చేస్తుంది.
పితృపూజ:
పితృపూజ చేయటానికి మౌని అమావాస్య మంచిరోజు. ఈ సందర్భంలో మీరు మీ పూర్వీకులను గుర్తు చేసుకుని , వారి జ్ఞాపకాలను గౌరవిస్తూ , వారి ఆశీస్సులు కూడా కోరవచ్చు.
ధ్యానం:
ధ్యానం చేయండి మరియు మంత్రాల ఉఛ్చారణలు మరియు సంగీతం కూడా ఉదయం వినండి. ఇది మిమ్మల్ని శాంతపరిచి మనస్సును నియంత్రిస్తుంది.
రుద్రాక్షలు:
చంద్రుడితో సంబంధం ఉన్నందున రుద్రాక్షమాలను ఈరోజు మీరు ధరించవచ్చు. కాకపోతే రుద్రాక్షలు ద్విముఖి లేదా పదహారు ముఖి అయివుండాలి. ఇవి వేసుకున్నవారికి ఆందోళన తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది.
శనీశ్వరుడు:
మౌని అమావాస్య నాడు శనేశ్వరుడిని కూడా పూజిస్తారు. ప్రజలు నువ్వులు లేదా తిల్ నూనెతో ఈ రోజు శనేశ్వరుడికి అభిషేకం చేస్తారు.
దానాలు:
ఈరోజు కొంత డబ్బును మీరు పేదలకు మరియు అవసరమైనవారికి దానం చేయాలి. జీవనానికి అవసరమైన వస్తువులు లేదా ఆహారం , బట్టలు ఇవ్వవచ్చు.