హిందూ జనజాగృతి సమితి |
కర్ణాటకలో హిందూ సంస్థలు మరో సారి హలాల్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాయి. ఈ పండగల సమయంలో హలాల్ మాంసాన్ని ఉపయోగించకూడదని రాష్ట్ర ప్రజలను కోరాయి.
కర్ణాటకలో హలాల్ మాంసానికి వ్యతిరేకంగా హిందూ సంస్థలు మళ్లీ ఉద్యమాన్ని ప్రారంభించాయి. పండుగ సీజన్ కు ముందు అనేక హిందూ గ్రూపులు హలాల్ మాంసం ఉత్పత్తులను బహిష్కరించాలని ప్రజలను కోరుతూ ఒక ప్రచారాన్ని మొదలుపెట్టాయి. దీపావళి, ఇతర పండుగలలో హలాల్ కు వ్యతిరేకంగా ప్రచారం కొనసాగుతుందని హిందూ జన జాగృతి కమిటీ అధికార ప్రతినిధి మోహన్ గౌడ ప్రకటించారు.