దొడ్డతిప్పరాయ స్వామి |
కుప్పం పట్టణం కొత్తపేటలో వెలిసిన శ్రీ దొడ్డతిప్పరాయ స్వామి మరియు శ్రీ తిమ్మరాయ స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుండి ప్రారంభం అయ్యిందని బుధవారం ఆలయ నిర్వాహకులు మునస్వామి, సంతోష్ కుమార్ లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఎక్కడ లేని విధంగా శివుడు విష్ణువు ఒకే గర్భగుడిలో దర్శనం ఇవ్వడం జరుగుతుందని అన్నారు.
కుప్పం పట్టణంలో అతి ప్రాచీనమైన దొడ్డ తిప్పరాయ స్వామి దేవాలయాన్ని పునర్నిర్మించి మొదటి సంవత్సరం బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా మహాశివుడు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఆలయాలు రెండు మాత్రమే ఉన్నాయని, అందులో ఒకటి కుప్పం ప్రాంతంలో వెలిసిన దొడ్డతిప్పరాయ స్వామి ఆలయం ముఖ్యమైనదని తెలిపారు. ఇంతటి మహోన్నతమైన దేవాలయంలో బ్రహ్మోత్సవాలు పూర్తయిన అనంతరం ప్రతి రోజు నిత్య దీప, దూప, నైవేద్యాలతో స్వామివారికి పూజలు జరుగుతాయని, కావున భక్తాదులందరూ స్వామివారిని దర్శించుకుని, స్వామి వారి కృపకు పాత్రులు కావాలని సూచించారు.
Courtesy : surya