గాయత్రీ దేవి |
24 Gods and Goddesses of Gayatri Mantra and their Conscious Powers | గాయత్రీ మంత్రంలోని 24 దేవతలు, వారి చైతన్య శక్తులు
గాయత్రీ మంత్రం:
ఓం భూర్బువస్సువః
తత్సవితుః వరేణియం
భర్గో దేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్ ||
ఇదే గాయత్రీ మూల మంత్రం. గాయత్రీని మించిన మంత్రం లేదు. ఈ తల్లిని మించిన దైవం లేదు.
గాయత్రీ మంత్రంలోని 24 దేవతలు, వారి చైతన్య శక్తులు:
01. వినాయకుడు:
సఫలత్వ శక్తికి అధిపతి. విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్దినీ, జ్ఞానాన్నీ ప్రసాదిస్తాడు.
02. నృసింహ స్వామి:
పరాక్రమ శక్తికి అధిపతి, పురుషార్థ, పరాక్రమ, వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయన.
03. విష్ణుమూర్తి:
పాలనాశక్తికి అధిష్టాత అయిన విష్టు సర్వజీవ రక్షకుడు.
04. ఈశ్వరుడు:
సకల జీవులకూ ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కల్యాణ శక్తులనూ ప్రసాదించే దయామయుడు.
05. శ్రీకృష్ణుడు:
యోగ శక్తికి అధిష్టాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్టలను, వైరాగ్య, జ్ఞాన, సాందర్యాదులును ప్రసాదిస్తాడు.
06. రాధాదేవి:
ఈమె ప్రేమ శక్తికి అధిష్టాత్రి, భక్తులకు నిజమైన _ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయద్వేష భావాలకు దూరం చేస్తుంది.
07. లక్ష్మిదేవి:
ధన వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికీ ఐశ్వర్యం, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది.
08. అగ్నిదేవుడు:
తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం, శక్తి తేజస్సు శక్తి సామార్ద్యాలను ప్రసాదిన్తాడు.
09. మహేంద్రుడు:
రక్షాశక్తికి అధిమాత, అనారోగ్యాలు, శతృభయాలు, భూత ప్రేతాదులునుండి రక్షిస్తాడు.
10. సరస్వతి:
విద్యా ప్రదాత. జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్దిని ప్రసాదిస్తుంది.
11 దుర్గాదేవి:
దమన శక్తికి అధిషాతైి. అన్ని బాధలనూ తొలగించి, శతువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.
12. ఆంజనేయుడు:
నిష్టాశక్తికి ఉపకారి హనుమంతుడు. తన భక్తులకు భక్తి నిష్ట, కర్తవ్య పరాయణ తత్వం, బ్రహ్మచర్య పాల నాశక్తి ప్రసాదిస్తాడు.
13. భూదేవి:
ధారణాశక్తికి అధినేతి. సకల ప్రాణకోటికి క్షమాశఖీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది.
14. సూర్యు భగవానుడు:
ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని,సుదీర్ష జీవనాన్ని, ప్రాణశక్తికి, వికాసాన్ని, తేజస్సును ప్రసాదిస్తాడు.
15. శ్రీరాముడు:
ధర్మం, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తికి అధినేత ఈయన.
16. సీతాదేవి:
తపశ్శక్తి అధిష్ఠాత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్టులుగా తయారుచేసి, అధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేదీమే.
17 చంద్రుడు:
శాంతి శక్తికి అధిష్ఠాత. చింత శోకం, క్రోధం, మోహం, లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు.
18. యముడు:
కాలశక్త్వాదిస్థాత. మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు.
19. బ్రహ్మ:
సకల సృష్టికి అధిమాత.
20. వరుణుడు:
భావకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాళుత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తాడు.
21. నారాయణుడు:
ఆదర్శ శక్తికి అధిష్టాత. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు.
22. హయగీవుడు:
సాహన శక్తికి అధిష్టాత, ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిన్తాడు.
23. హంస:
వివేక శక్తికి అధిష్ఠాత్రి. హంస క్షిరనీరవివేక జగత్ ప్రసిదమైంది.
24. తులసీ మాత:
సేవాశక్తికి అధిష్ఠాత్రి. ఆత్మశాంతి, దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది.
- రాజేష్ తోగర్ల (ఇక్ష్వాకు)