Devaragattu stick |
దేవరగట్టు చుట్టూ దాదాపు 50 గ్రాములు ఉన్నాయి. అందులో నేరనికి, నెరనికి తండా, కొత్తపేట గ్రామస్తులు ప్రత్యేకత చాటుకుంటారు ఉత్సవాలకు ముందు వచ్చే అమావాస్య నుంచి దీక్ష చేపట్టి కంకణ ధారణ మొదలు బన్నీ ఉత్సవాలు ముగిసేంతవరకు చాలా నిష్టతో ఉంటారు.
కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరానికి సర్వం సిద్ధమైంది. దేవరగట్టు కొండ ప్రాంతంలో వెలసిన మాల మల్లేశ్వరస్వామి చెంత జరుగుతున్న బన్ని ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దసరా సందర్భంగా స్వామివారికి రథోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నిర్వహించే బన్నీ ఉత్సవాన్నే కర్రల సమరంగా పేర్కొంటారు. ఈ కర్రల సమరంలో 11 గ్రామాల ప్రజలు రెండు వర్గాలుగా విడిపోతారు. స్వామి వారి విగ్రహాన్ని దక్కించుకునేందుకు ఇరువర్గాల వారు కర్రలతో దాడులు చేసుకుంటారు. ఆలూరు సమీపంలోని మాల మల్లేశ్వరుల విగ్రహాల కోసం తలపడతారు.
ఈ బన్ని ఉత్సవాన్నీ చూడడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి భారీగా జనం హాజరవుతారు.
దేవరగట్టు చుట్టూ దాదాపు 50 గ్రాములు ఉన్నాయి. అందులో నేరనికి, నెరనికి తండా, కొత్తపేట గ్రామస్తులు ప్రత్యేకత చాటుకుంటారు ఉత్సవాలకు ముందు వచ్చే అమావాస్య నుంచి దీక్ష చేపట్టి కంకణ ధారణ మొదలు బన్నీ ఉత్సవాలు ముగిసేంతవరకు చాలా నిష్టతో ఉంటారు. కొండపై నుంచి విగ్రహాలు తిరిగి నెరనికి గ్రామానికి చేరేవరకు కట్టుబాట్లు పాటిస్తారు. 12 రోజులపాటు కనీసం కాళ్లకు చెప్పులు వేసుకోకుండా మద్యం మాంసం ముట్టకుండా పూర్తిగా బ్రహ్మచర్యం పాటిస్తారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..