Shanideva |
శనిగ్రహా దోషానివారణ
శని శ్రమకారకుడు. శనిగ్రహా దోష నివారణకు నిత్యం ఉదయాన్నే వాకింగ్ గాని,దేవాలయ ప్రదక్షణలు గాని చేసిన శనిగ్రహా భాదలనుండి కొంతవరకు విముక్తి కలుగుతుంది.. అలాగే గుర్రపు నాడ రింగును కుడి లేదా ఎడమ చేతి మద్యవ్రేలుకి ధరించి శని గ్రహా వ్రేలుకి శ్రమ కలిగి కొంతమేరకు శనిగ్రహా భాదలనుండి విముక్తి పొందవచ్చు.
ప్రతి వ్యక్తీ తన జీవితకాలంలో శని ప్రభావానికి లోనవుతాడు. శనివారం త్రయోదశి తిథి కలిసివస్తే ఆరోజుని శనిత్రయోదశి అంటారు. ఈరోజు శనికి అత్యంత ప్రీతికరమైనది. ఈయనకు తిల తైలాభిషేకం శ్రేష్టం. గోచారరీత్యా శని మేషాది రాశుల్లో సంచరిస్తాడు. అంటే 12 రాశుల్లో సంచారం పూర్తిచేయడానికి మొత్తం 30 సంవత్సరాల సమయం పడుతుంది. 30 ఏళ్ళకు ఒకసారి ప్రతిఒక్కరిపై ఏల్నాటి శని ప్రభావం ఉంటుంది.
జాతకునికి గోచారరీత్యా తన జన్మరాశి (జన్మ నక్షత్రాన్ని బట్టి చూసుకోవాలి) నుంచి 12,1,2 స్థానాల్లో శని సంచరించే కాలాన్ని ఏల్నాటి శని అంటారు. ఈ మూడు రాశుల్లో మొత్తం ఏడున్నర సంవత్సరాలు సంచరించడం వల్ల దీనిని ఏలినాటి శని అని వ్యవహరించడం జరుగుతోంది. 12 రాశుల్లో సంచరిస్తున్నప్పుడు వ్యవహారాల్లో చిక్కులు, వ్యాపారాల్లో ఒడిదుడుకులు, ఊహించని మార్పులు, అనారోగ్యం, ఔషధ సేవనం, తరచూ ప్రయాణాలు.జన్మరాశిలో సంచరిస్తున్నప్పుడు ఆరోగ్యభంగం, నీలపనిందలు, భాగస్వాములతో వైరం, మనశ్శాంతి లోపం, ధనవ్యయం. రుణబాధలు,వృత్తి, వ్యాపారాల్లో చికాకులు. స్థానచలనం సూచనలు.
రెండవ రాశిలో సంచరిస్తున్నప్పుడు ఆశలు కల్పించి నిరాశ కల్పిస్తాడు. రుణబాధలు, అనారోగ్యం, మానసిక ఆందోళన వంటి ఫలితాలు ఉంటాయి. జీవితంలో మొదటిసారి వచ్చే ఏల్నాటి శనిని మంగు శని అంటారు.
రెండవ పర్యాయము (30 సంవత్సరాల అనంతరం) వచ్చే ఏల్నాటి శనిని పొంగుశని అని అంటారు. ఈ కాలంలో అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఆర్ధిక, ఆస్తిలాభాలు, గృహయోగాలు, ఉద్యోగయోగం వంటి ఫలితాలు కలుగుతాయి.
మూడవ పర్యాయం వచ్చిన శనిని మృత్యుశని అంటారు. ఈ కాలంలో ఆరోగ్య సమస్యలు, అపమృత్యుభయం వంటి చికాకులు ఎదుర్కొంటారు. అలాగే జన్మరాశికి 4,8,10 స్థానాల్లో శని సంచరిస్తున్నప్పుడు అర్ధాష్టమ, అష్టమ, దశమ శని సంచారం అంటారు. ఇవి కూడా దోషకారకమే.
అర్ధాష్టమ శని:- జన్మరాశి నుంచి నాల్గవ రాశిలో శని సంచరిస్తే అర్ధాష్టమ శని అంటారు. రాజకీయ, స్థిరాస్తి,వ్యాపారాల్లో చిక్కులు, కుటుంబసమస్యలు, అశాంతి, ఆకస్మిక బదిలీలు. స్థానచలనం ,వ్యాపార, ఉద్యోగాల్లో మార్పులు వంటి ఫలితాలు ఉంటాయి.
అష్టమ శని: జన్మరాశి నుంచి 8వ స్థానంలో శని సంచరించడాన్ని అష్టమ శని అంటారు. ఈ కాలంలో ఉద్యోగాల్లో ఆటంకాలు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఆలోచనలు స్థిరంగా ఉండకపోవడం, అశాంతి, అనారోగ్య సమస్యలు వంటి ఫలితాలు ఉంటాయి.
దశమ శని: జన్మరాశి నుంచి 10వ స్థానంలో శని సంచరిస్తున్నప్పుడు కంటక శని అంటారు. దీనివల్ల కోర్టు కేసులు, సాంఘిక, రాజకీయంగా అపవాదులు, అధికారులతో విభేదాలు, ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు వంటి ఫలితాలు ఉంటాయి.
అయితే జాతకచక్రంలో శని మంచి స్థితిలో ఉన్నప్పుడు, గోచారంలో గురు బలం ఉన్నప్పుడు ఏల్నాటి శని అంతగా బాధించడు. ఈ దోషాలు ఉన్న వారు శనికి తైలాభిషేకాలు, జపాదులు చేయించుకుంటే కొంత ఉపశమనం కలుగుతుంది.
జాతకచక్రంలో శనిగ్రహ దోష నివారణకు “Evil Eye”బాగా ఉపయోగపడుతుంది. “Evil Eye” నరఘోష నివారణకు ఇంటికి గాని,వ్యాపార సంస్ధలలో గాని,ఆపీసులకు గాని బయటపక్కన తగిలిస్తే ఎటువంటి నరదృష్టి ప్రభావాలు ఉండవు.జాతకంలో నీచశని,జన్మ శని,ఎల్నాటిశని,అష్టమ శని,అర్ధాష్టమ శని,శని దశలు నడిచే వారు “Evil Eye”ఇంటికి గాని,గదికి గాని పశ్చిమ దిక్కు ఉంచి ప్రతిశనివారం ధూపం వేసిన శనిగ్రహ భాదల నుండి విముక్తి కలుగుతుంది. శని వాయు తత్త్వము కలిగి పడమర దిక్కును సూచించును.
శనిగ్రహ దోష ప్రభావం ఎక్కువగా ఉన్నవారికి దీర్ఘకాల అనారోగ్యాలు,సరియైన నిద్ర,ఆకలి లేకపోవటం,చేస్తున్న పనిలో ఆటంకాలు ఎదుర్కోవటం,అవమానాలు ఉన్నవారు “Evil Eye”ఇంటిలో పశ్చిమ దిక్కున ఉంచిన శనిగ్రహ భాదల నుండి విముక్తి కలుగుతుంది.చదువుపై శ్రద్ధ లేని పిల్లల రూంలో “Evil Eye”ని ఉంచిన చదువుపై శ్రద్ధ కలుగుతుంది.అనారోగ్య భాదలు ఉన్న రోగి గదిలో “Evil Eye”కట్టిన రోగ నిరోదక శక్తి పెరిగి రోగం తొందరగా నయం అయ్యే అవకాశం ఉంది.
శని పేరు చెప్పగానే ప్రజల మనస్సులలో ఒక విధమైన భయం .కానీ శని న్యాయమూర్తిలా వ్యవహరించి చెడు మార్గాన వెళ్ళే వ్యక్తిని దండించి సరియైన పంధాన నడిచే దారి చూపిస్తాడు సరియైన సమయంలో మంచి దెబ్బ కొట్టి వారిని చైతన్యవంతులను జేసి తిరిగి తప్పులు చేయకుండా ప్రత్యక్షంగా హెచ్చరిస్తాడు. శని వేసే శిక్షల వల్ల గాయం పైకి కనిపించిన ఆ వ్యక్తిలో మార్పు స్పష్టంగా దర్శనమిస్తుంది.
శని గోచారక్రమంలో రాశిచక్రాన్ని చుట్టి వచ్చుటకు ముప్పై సంవత్సరములు పడుతుంది . శని గ్రహము తనకక్ష్యలో పరి భ్రమణము చేస్తూన్నప్పుడు ఒక్కొక్క రాశిలో రెండున్నరసంవత్సరముల చొప్పున పన్నెండు రాశులలో ౩౦ సంవత్సరములు పడుతుంది.
ఆకారంలో శనిగ్రహం గురుగ్రహం కంటే చిన్నగ్రహం.శని సంచారం గోచారంలో చాలా నెమ్మదిగా ఉంటుంది.మిగతా గ్రహాలకంటే ఎక్కువ కాలం రాశిలో సంచరిస్తాడు కాబట్టి మానవుని జీవితంపై శనిప్రభావం అత్యధికంగా కనిపిస్తుంది.శని సుమారు 135 రోజుల వరకు సామాన్యవేగంతో సంచరించిన తరువాత 105 రోజుల వరకు వక్రమార్గంలో పయనించి ప్రభావితం చేస్తాడు.శని దృష్టి పశ్చిమంపై ఉండి అక్కడే అస్తమించడం వల్ల పడమర దిక్కుని శని దిక్కుగా చెప్తారు.శాంతి ప్రక్రియలు చేపట్టిన దోష ప్రభావం తగ్గి మేలు కలుగుతుంది.
శనివారం ఉదయం నువ్వులనూనెతో శరీరానికి మర్దన చేసుకొని స్నానం చేసి నువ్వులనూనెతో గాని,ఆముదం నూనెతో గాని తెలుపు లేదా నలుపు వత్తులను పడమర దిక్కున ఇనుప గరిటెలో శని దీపాన్ని పెట్టి దానికి నువ్వులు బెల్లం కలిపిన చిమ్మిళిని నైవేద్యం పెట్టాలి.తరువాత ఈ క్రింది శ్లోకం చదవాలి.
శని బాధా వినాశాయ ఘోర సంతాప హారిణే |
కనకాలయ వాసాయ భూతనాధాయతే నమః ||
దారిద్ర్యజాతాన్ రోగాదీన్ బుద్ధిమాంద్యాది సంకటాన్ |
క్షిప్రం నాశయ హే దేవ!శని బాధా వినాశక ||
భూత బాధా మహాదుఃఖ మధ్యవర్తిన మీశమాం |
పాలయ త్వం మహాబాహో సర్వదుఃఖ వినాశక ||
అవాచ్యాని మహాదుఃఖ న్యమేయాని నిరంతరం |
సంభవంతి దురంతాని తాని నాశయమే ప్రభో ||
మాయా మోహన్యానంతాని సర్వాణి కరుణాకర |
దూరి కురు సదాభక్త హృదయానందదాయక ||
అనేక జన్మ సంభూతాన్ తాప పాపాన్ గుహేశ్వర |
చూర్ణీకురు కృపాసింధో సింధుజాకాంత నందతే ||
ఉన్మాదోధ్భూత సంతాపా గాధకూపాద్మహేశ్వర |
హస్తావలంబం దత్వా మాం రక్షరక్ష శనైశ్చర ||
దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య యౌవనం |
దేహిమే పరమానందం దేవదేవ జగత్పతే ||
ఈ శ్లోకాన్ని ప్రతిరోజు ఉదయాన్నే పఠించిన శనిదోషం తొలగిపోవును.