Rudra |
రుద్రాభిషేక విధానం
ఈ రుద్రాభిషేకం చేసేటప్పడు లింగముపైన మారేడు దళములుంచి ఒక్కొక్క కలశంలోని నీళ్ళతో కలశపూజ చేసి, ప్రతి కలశమునందు శివపంచాక్షరితో మరియు మృత్యుంజయ మంత్రముతో అభిమంత్రించి, సిద్ధం చేసుకొని అప్పడు రుద్రాభిషేకము ప్రారంభించాలి. అభిషేకం పూర్తయ్యేసరికి కలశములలో అభిమంత్రించిన జలము సరిగ్గా సరిపోవునట్లు చేసుకోవాలి. అలా చేస్తేనే రుద్రాభిషేక ఫలితము పూర్తిగా కలుగుతుంది.
చాలామంది బిందెలో నీళ్ళు నింపుకొని అవే నీటితో అభిషేకం చేస్తారు. దీనివల్ల ప్రయోజనము శూన్యము. ఈ విషయమే చాల మంది పురోహితులకు కూడా తెలియదు. కాబట్టి అభిషేక జలానికి “గరుడ ముద్రను” చేతితో నీటిపై చూపించి మృత్యుంజయ మంత్రముతో అభిమంత్రించి ఆ జలాన్ని అమ్రుతీకరణము చేయాల్సివుంటుంది. ఇదియే శాస్త్ర విహితమైనది. ఆవిధంగా రుద్రాభిషేకం చేయువారి హస్తం అమ్రుతీకరణం అవుతుంది. అతడు ముట్టుకున్నచో ఆవిధంగా రుద్రాభిషేకం చేయువారి హస్తం అమ్రుతీకరణం అవుతుంది. అతడు ముట్టుకున్నచో అమృతత్వం కలుగుతుంది. దీనికి రుద్రాభిషక మంత్రములోనే “శివా విశ్వాయ భేషజీ”. (విశ్వములోని అన్ని రోగములకూ శివుడే వైద్యము) కావున అమ్రుతీకరణము చేయని జలముతో శివాభిషేకము ఫలితమివ్వదు. ఈ రహస్యము తెలిసి శివ పూజలు చేసిన అపమృత్యు బాధలను జయించవచ్చు. మఖ్యముగా నేటికాలంలోని వైద్యులు అందరూ ఈ విధమైన అభిషేకం చేయడం ద్వారా వారి హస్తము అమృతత్వం పొందుతుంది. వారిచ్చే జెషధము కూడా దివ్యముగా పనిచేసి రోగులు శీఘ్రంగా ఆరోగ్యవంతులు అవుతారు. దీన్నే “హస్త వాసి” అని మన పెద్దలు అంటారు. ఈ క్రతువు నిష్ణాతులైన వారిచే జరిపించడము శ్రేయస్కరము.