శ్రీ సరస్వతీ దేవి
రంగు: తెలుపు
పుష్పం: మారేడు దళాలు
ప్రసాదం: కట్టుపొంగలి
దసరా నవరాత్రులలో ఏడవ రోజు అమ్మను శ్రీ సరస్వతీ దేవి గా అలంకరిస్తారు.
శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉన్నది. చదువుల తల్లి సరస్వతీదేవి రూపములో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీ దేవిని పురాణములు వర్ణిస్తున్నాయి. శ్వేత పద్మాన్ని ఆసనముగా అధీష్ఠించి వీణ, దండ, కమండలము, అక్షమాల ధరించి అభయ ముద్రతో భక్తుల అఙ్ఞాన తిమిరాలను ఈ దేవి సంహరిస్తుంది. వ్యాసభగవానుడు, వాల్మీకిమహర్షి, కాళిదాసు మున్నగు లోకోత్తర కవులకు, పురాణ పురుషులకు అమ్మ వాగ్వైభవమును వరముగా అందచేసింది. అమ్మను కొలిస్తే విద్యార్ధులకు చక్కని బుధ్ధిని వికాసము కలుగుతుంది. త్రిశక్తి స్వరూపములలో సరస్వతీదేవి మూడొవ శక్తిరూపము. సంగీత సాహిత్యములకు అమ్మ అథిష్టాన దేవత. సకల జీవుల జిహ్మాగ్రముపై అమ్మ నివాసము ఉంటుంది.
Sadapalaya Sarasakhi || Navaratri Series || Day 7 || Srilalitha Singer
నవరాత్రులు:
- మొదటి రోజు: శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి
- రెండొవ రోజు: శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి
- మూడొవ రోజు: శ్రీ గాయత్రీ దేవి
- నాల్గొవ రోజు: శ్రీ అన్నపూర్ణా దేవి
- ఐదొవ రోజు: శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి
- ఆరొవ రోజు: శ్రీ మహాలక్ష్మీ దేవి
- ఏడొవ రోజు: శ్రీ సరస్వతీ దేవి
- ఎనిమిదొవ రోజు: శ్రీ దుర్గా దేవి ( దుర్గాష్టమి )
- తొమ్మిదొవ రోజు: శ్రీ మహిషాసుర మర్దినీ దేవి ( మహర్నవమి )
- పదొవ రోజు: శ్రీ రాజ రాజేశ్వరీ దేవి ( విజయదశమి )