మీ రక్త సంబంధీకులను ఇలా గౌరవించండి |
ప్రతి సంవత్సరం రక్త సంబంధీకులలో ఒకరికైనా క్రింది తిథులలో పిలిచి భోజనం పెట్టటం వలన ఆరోగ్యము ,ఉల్లాసము,ఆనందము,శుభాలు కలుగుతాయి.
౧. అన్నాచెల్లెళ్ళు ,అక్కాతమ్ముల్లు కలవారు చేయవలసినది . ఆడవాళ్ళు తమ అన్నలను ,తమ్ముల్లను దీపావళి వెళ్ళిన రెండవరోజు అంటే కార్తీక విదియ రోజున తమ ఇంటికి పిలచి భోజనం పెట్టాలి .దీనినే భగినీ హస్తభోజనమనే పండుగగా జరుపుకుంటారు. దానివలన శుభాలు ప్రాప్తిస్తాయి . ముత్తైదువులైన తమ సోదరికి సోదరులు పసుపుకుంకుమ నూతన వస్త్రాలు కానుకగాఇవ్వాలి. భర్తలేని స్త్రీలకు చీర జాకెట్టు పండ్లుమాత్రమే ఇవ్వాలి. అయితే సోదరినుండి ఎదురు కానుకగా ఏదీ స్వీకరించకూడదు ఆరోజు .అలా తీసుకుంటే అన్నాదమ్ముల్లకు శుభాలు కనిపించవు.
ప్రతి సంవత్సరం మీ రక్త సంబంధీకులను ఇలా గౌరవించండి |
౨. వైశాఖ ద్వాదశి రోజున స్త్రీలు వారి మేనమామను పిలచి భోజనం పెట్టుట మంగళకరం గావుండును .మేనమామలు ఇచ్చే పసుపుకుంకాల ఫలితంగా వారి జీవితం లో సౌఖ్యాలు అనుభవిస్తారు. అయితే మేనమామ తిరిగి బట్టలు స్వీకరించరాదు.
౩. కార్తీక పౌర్ణమి రోజున చంద్రుని చూచి కుటుంబము లోనివారు వారి తల్లిదండ్రుల పాదాలుతాకి నమస్కరించుకోవాలి ..వారు స్వర్గస్తులైయుంటే వారి ఫోటోలకు నమస్కరించు కోవాలి.
౪. శ్రీరామ నవమి మరునాడు దశమి రోజున భర్తలు వారి భార్యలకు బంగారు ఆభరణం గాని ,వెండి ఆభరణం గానీ తప్పనిసరిగా ఇవ్వాలి.వారి శక్తి కొలది మెట్టెలు గాని ,లేక బంగారు రూపు [సూత్రం లోకి] .శక్తి వున్నవారు ఆభరణాలు చేపించవచ్చు. వెండి కుంకుమ భరిణలలాంటివైనా సరే ఇవ్వవచ్చు. సంవత్సరమంతా డబ్బుకు లోటుండదు.
౫. ఆషాఢ మాసం లో [ఈనెలలో] స్త్రీలు భర్తలకు ఏ బుధవారమైనా సరే తలస్నానం చేపించి ముందుగా తాము తయారు చేసిన తీపిని తినిపించాలి. ఆసంవత్సరమంతా శుభాలకు తిరుగులేదు.
౬. శ్రావణ మాసం లో స్త్రీలు మంగళవారం గాని ,శుక్రవారం గాని తమ అక్కచెళ్ళెల్లకు పసుపుకుంకాలు సమర్పించుకుంటే సౌభాగ్యవతిగా వర్ధిల్లగలరు.
౭. వినాయక చవితిమరుసటినాడు వచ్చే పంచమి రోజున బావమరుదులకు రెండు నాణెములు బంగారము ,లేదా వెండివి ఇస్తే ఆసంవత్సర కాలములో రెండు చిక్కు సమస్యలు తీరి పోతాయి.
౮. హనుమజ్జయంతి రోజున విద్యార్ధులు వారి ఉపాధ్యాయులకు పండ్లు సమర్పించి నమస్కరిస్తే ఆసంవత్సరం లో పరీక్షలలో విజయంలభిస్తుంది.
౯. స్త్రీలు జ్యేష్ట మాసం లో వేరే స్త్రీ [బంధువుకాదు] కి గురువారం రోజు పిలచి భోజనమిడితే ఆసంవత్సరములో శుభకార్యక్రమములు, దైవదర్శనములు గురు దర్శనములాంటి శుభాలు ప్రాప్తిస్తాయి.
౧౦. పాదరక్షలు గురువారం కొనటం చాలామంచిది అంటారు .