దుర్గా దేవి |
శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవి
రంగు: స్వర్ణ కవచం
పుష్పం: అన్ని రకాలు
ప్రసాదం: పులగం
అశ్వనీ నక్షత్రంతో కూడిన పౌర్ణమి కల మాసం ఆశ్వీయుజ మాసం, శరదృతువు ఈ నెలతో ప్రారంభం అవుతుంది. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు ఈ దసరా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలు దేశమంతటా భిన్నభిన్న పద్ధతుల్లో జరుగుతాయి. తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలలో దేవిని పూజిస్తారు. అందువల్ల ఇది దేవీ నవరాత్రులుగా వ్యవహారంలోకి వచ్చింది. అలాగే శరదృతువులో జరుపుకుంటారు కనుక శరన్నవరాత్రులని కూడా అంటారు.
విజయవాడ కనకదుర్గ అలంకారాలే రాష్ట్రములోని మిగతా ప్రాంతాలలో కూడా అనుసరిస్తారు. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు దుర్గమ్మ స్వర్ణ కవచలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు అమ్మవారికి కేసరి నైవేద్యం చెయ్యాలి.
మొదటి రోజు: శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి
శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి
శరన్నవరాత్రులలోని మొదటి రోజు దేవిని పసుపు రంగు దుస్తులతో అలంకరిస్తారు. నవరాత్రి అలంకారాలలో తొలి రోజునే కనకదుర్గా దేవిని దర్శించుకున్నవారికి దారిద్ర్య బాధలు మటుమాయము అవుతాయని భక్తుల నమ్మకము.
అమ్మలఁ గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మ కడు పాఱడిపుచ్చి నయమ్మ తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధి యీపుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్.
అశ్వనీ నక్షత్రంతో కూడిన పౌర్ణమి కల మాసం ఆశ్వీయుజ మాసం, శరదృతువు ఈ నెలతో ప్రారంభం అవుతుంది. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు ఈ దసరా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలు దేశమంతటా భిన్నభిన్న పద్ధతుల్లో జరుగుతాయి. తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలలో దేవిని పూజిస్తారు. అందువల్ల ఇది దేవీ నవరాత్రులుగా వ్యవహారంలోకి వచ్చింది. అలాగే శరదృతువులో జరుపుకుంటారు కనుక శరన్నవరాత్రులని కూడా అంటారు. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు దుర్గమ్మ స్వర్ణ కవచలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు అమ్మవారికి కేసరి నైవేద్యం చెయ్యాలి.
విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగలలో దేవీ నవరాత్రులు అత్యంత ప్రధానమైనవి. శరదృతువులో ఆశ్వియుజ శుధ్ధ పాడ్యమి నుండి నవమి వరకు ఈ వేడుకలు జరుగుతాయి. దేవి అంటే త్రిమూర్తుల తేజం కలగలిసిన మహాశక్తి. విజయవాడ కనకదుర్గ అలంకారాలే రాష్ట్రములోని మిగతా ప్రాంతాలలో కూడా అనుసరిస్తారు.
ఎన్ని కథలున్నా కనకదుర్గగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దేవికి శరన్నవరాత్రుల పేరిట దసరా తొమ్మిది రోజులు ఉత్సవములు నిర్వహించడము అనాదిగా వస్తున్న ఆచారము. ఈ తొమ్మిది రోజులు దేవి ఒక్కో అలంకారముతో భక్తులకు దర్శనమిస్తింది.
శ్రీ దుర్గాష్టకమ్
ఉద్వపయతునశ్శాక్తి మాదిశక్తే ద్దరస్మితమ్
తత్త్వం యస్యమహత్సూక్ష్మం మానన్దోవేతి సంశయః
ఙ్ఞాతుర్ఞానం స్వరూపం స్యాన్నగుణోనాపి చక్రియా
యదిస్వ స్య స్వరూపేణ వైశిష్ట్యమనవస్ధీతిః
దుర్గే భర్గ సంసర్గే సర్వభూతాత్మవర్తనే
నిర్మమేనిర్మలేనిత్యే నిత్యానందపదేశివా
శివా భవాని రుద్రాణి జీవాత్మపరిశోధినీ
అమ్బా అమ్బిక మాతంగీ పాహిమాం పాహిమాం శివా
దృశ్యతేవిషయాకారా గేహణే స్మరణే చధీః
ప్రఙ్ఞావిషయ తాదాత్మ్య మేవం సాక్షాత్ ప్రదృశ్యతే
పరిణామో యథా స్వప్నః సూక్ష్మస్యస్థూలరూపతః
జాగ్రత్ ప్రపఞ్చ ఏషస్యా త్తథేశ్వర మహాచితః
వికృతి స్సర్వ భూతాని ప్రకృతిర్దుర్గదేవతా
సతః పాదస్తయోరాద్యా త్రిపాదీణీయతేపరా
భూతానామాత్మనస్సర్గే సంహృతౌచతథాత్మని
ప్రభవే ద్దేవతా శ్రేష్ఠా సఙ్కల్పానారా యథామతిః
ఫలశృతిః
యశ్చాష్టక మిదం పుణ్యం పాత్రరుథాయ మానవః
పఠేదనన్యయా భక్త్యా సర్వాన్కామానవాప్నుయాత్
Sakalaloka Nayike || Navaratri Series || Day 1 || Srilalitha Singer
శ్రీ దుర్గాష్టోత్తర శతనామ పూజ
- ఓం దుర్గాయై నమః
- ఓం శివాయై నమః
- ఓం మహాలక్ష్మ్యై నమః
- ఓం మహా గౌర్యై నమః
- ఓం చండికాయై నమః
- ఓం సర్వజ్జాయై నమః
- ఓం సర్వలోకోశ్యై నమః
- ఓం సర్వ కర్మ ఫల ప్రదాయై నమః
- ఓం సర్వ తీర్థమయాయై నమః
- ఓం పుణ్యాయైనమః
- ఓం దేవయోనయే నమః
- ఓం అయోనిజాయై నమః
- ఓం భూమిజాయై నమః
- ఓం నిర్గుణాయై నమః
- ఓం ఆధార శక్త్యై నమః
- ఓం అనీశ్వర్యై నమః
- ఓం నిర్గుణాయై నమః
- ఓం నిరహంకారాయై నమః
- ఓం సర్వ గర్వ విమర్దిన్యై నమః
- ఓం సర్వలోక ప్రియాయై నమః
- ఓం వాణ్యై నమః
- ఓం సర్వ విద్యాధిదేవతాయై నమః
- ఓం పార్వత్యై నమః
- ఓం దేవమాత్రే నమః
- ఓం వనీశ్యై నమః
- ఓం వింద్య వాసిన్యై నమః
- ఓం తేజోవత్యై నమః
- ఓం మాహా మాత్రే నమః
- ఓం కోటి సూర్య సమ ప్రభాయై నమః
- ఓం దేవతాయై నమః
- ఓం వహ్ని రూపాయై నమః
- ఓం సతేజసే నమః
- ఓం వర్ణ రూపిణ్యై నమః
- ఓం గణాశ్రయాయై నమః
- ఓం గుణమద్యాయై నమః
- ఓం గుణ త్రయ వివర్జితాయై నమః
- ఓం కర్మజ్జాన ప్రదాయై నమః
- ఓం కాంతాయై నమః
- ఓం సర్వ సంహార కారిణ్యై నమః
- ఓం ధర్మజ్జానాయై నమః
- ఓం ధర్మ నిష్ఠాయై నమః
- ఓం సర్వ కర్మ వివర్జితాయై నమః
- ఓం కామాక్ష్యై నమః
- ఓం కామ సంహత్ర్యై నమః
- ఓం కామ క్రోధ వివర్జితాయై నమః
- ఓం శాంకర్యై నమః
- ఓం శాంభవ్యై నమః
- ఓం శాంతాయై నమః
- ఓం చంద్ర సూర్య లోచనాయై నమః
- ఓం సుజయాయై నమః
- ఓం జయాయై నమః
- ఓం భూమిష్థాయై నమః
- ఓం జాహ్నవ్యై నమః
- ఓం జన పూజితాయై నమః
- ఓం శాస్త్ర్ర్రాయై నమః:
- ఓం శాస్త్ర మయాయై నమః
- ఓం నిత్యాయై నమః
- ఓం శుభాయై నమః
- ఓం శుభ ప్రధాయై
- ఓం చంద్రార్ధ మస్తకాయై నమః
- ఓం భారత్యై నమః
- ఓం భ్రామర్యై నమః
- ఓం కల్పాయై నమః
- ఓం కరాళ్యై నమః
- ఓం కృష్ఠ పింగళాయై నమః
- ఓం బ్రాహ్మే నమః
- ఓం నారాయణ్యై నమః
- ఓం రౌద్ర్ర్యై నమః
- ఓం చంద్రామృత పరివృతాయై నమః
- ఓం జేష్ఠాయై నమః
- ఓం ఇందిరాయై నమః
- ఓం మహా మాయాయై నమః
- ఓం జగత్వృష్థాధి కారిణ్యై నమః
- ఓం బ్రహ్మాండ కోటి సంస్థానాయై నమః
- ఓం కామిన్యై నమః
- ఓం కమలాయై నమః
- ఓం కాత్యాయన్యై నమః
- ఓం కలాతీతాయై నమః
- ఓం కాల సంహార కారిణ్యై నమః
- ఓం యోగ నిష్ఠాయై నమః
- ఓం యోగి గమ్యాయై నమః
- ఓం తపస్విన్యై నమః
- ఓం జ్జాన రూపాయై నమః
- ఓం నిరాకారాయై నమః
- ఓం భక్తాభీష్ఠ ఫల ప్రదాయై నమః
- ఓం భూతాత్మికాయై నమః
- ఓం భూత మాత్రే నమః
- ఓం భూతేశాయై నమః
- ఓం భూత ధారిణ్యై నమః
- ఓం స్వదానారీ మద్యగతాయై నమః
- ఓం షడాధారాది వర్ధిన్యై నమః
- ఓం మోహితాయై నమః
- ఓం శుభ్రాయై నమః
- ఓం సూక్ష్మాయై నమః
- ఓం మాత్రాయై నమః
- ఓం నిరాలసాయై నమః
- ఓం నిమగ్నాయై నమః
- ఓం నీల సంకాశాయై నమః
- ఓం నిత్యానందాయై నమః
- ఓం హరాయై నమః
- ఓం పరాయై నమః
- ఓం సర్వ జ్జాన ప్రదాయై నమః
- ఓం ఆనందాయై నమః
- ఓం సత్యాయై నమః
- ఓం దుర్లభ రూపిణ్యై నమః
- ఓం సరస్వత్యై నమః
- ఓం సర్వ గతాయై నమః
- ఓం సర్వాభీష్ఠ ప్రదాయిన్యై నమః
నవరాత్రులు:
- మొదటి రోజు: శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి
- రెండొవ రోజు: శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి
- మూడొవ రోజు: శ్రీ గాయత్రీ దేవి
- నాల్గొవ రోజు: శ్రీ అన్నపూర్ణా దేవి
- ఐదొవ రోజు: శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి
- ఆరొవ రోజు: శ్రీ మహాలక్ష్మీ దేవి
- ఏడొవ రోజు: శ్రీ సరస్వతీ దేవి
- ఎనిమిదొవ రోజు: శ్రీ దుర్గా దేవి ( దుర్గాష్టమి )
- తొమ్మిదొవ రోజు: శ్రీ మహిషాసుర మర్దినీ దేవి ( మహర్నవమి )
- పదొవ రోజు: శ్రీ రాజ రాజేశ్వరీ దేవి ( విజయదశమి )