జగన్మాత |
ప్రశ్న : ఈ సృష్టి ఎలా ఏర్పడింది? ఇది దేనినుండి వచ్చింది?
జవాబు : మనం ఒక మర్రిచెట్టును చూస్తాము. దానియందు కమ్మలు, రెమ్మలు, ఆకులు, పూలు, పండ్భు వివిధ రంగులలో కనిపిస్తాయి. అయితే అని అన్నీ ఒక అతిచిన్న విత్తనం నుండి వచ్చాయి. ఆ మర్రి విత్తనం ఒక చైతన్య కేంద్రం. దానిలో రంగులు, రుచులు, వాసనలు లేవు. అలాగే ఒక నిత్యము నిర్గుణము అయిన వైతన్యములో నుండి ఈ సృష్టి ఏర్పడుచున్నది.
ప్ర: ఆ చైతన్య శక్తియే సృష్టి కర్త అంటారు. మరి, సృష్టికీ సృష్టికర్తకూ నడుమ గల అంచెలు ఎలాంటివి? వివరిస్తారా?
జ : ఒక ఉదాహరణ చెప్పుకుందాము. మన నోట్లో నుండి ఒక వాక్యం వెలువడుతున్నది. ““నేను భోజనం చేస్తాను'' అనే మాట అన్నారు. ఈ వాక్యం వెలువడడం ఒక సృష్టి. ఈ సృష్టి ఎలా జరిగిందో, ప్రపంచ సృష్టి మానవ సృష్టి అలాగే జరిగాయి.
ప్ర : వాక్యం నోటితో ఉచ్చరిస్తే వెలువడిందిగదా?
జ : నోటితో ఉచ్చరించడం బయటికి కనిపించే ఫ్రితి. అది వ్యక్తమైన వాక్యం యొక్క. భౌతిక స్టితి. అది బయటకు రావడానికి లోపల యింకా మూడు స్థితులున్నాయి.
ప్ర : ఏమిటా స్థితులు?
జ : ''నేను భోజనం చేస్తాను” అనే వాక్కు మొదట మనసులో ఒక సంకల్పంగా ఆరంభమవుతుంది. దానినే వాంఛించడం అనవచ్చు. ఇది మొదటి స్థితి. ఆ వాంఛను ఆధారం చేసుకొని మనస్సులో ఒక భావన (outline) తయారవుతుంది. ఈ భావనకు భాష ఉండదు. ఇది రెండవ స్థితి.. పీదప ఆ భావానికి మనస్సులో కొన్ని సంకేతాలు ఏర్పడుతాయి. ఆ సంకేతాన్ని గురించిన పేర్లు మన మనస్సుకు తగులుతాయి. ఇది భాషతో గూడిన మానసిక చిత్రణ. ఇది మూడవ స్థితి... మనస్సులో ఏర్పడిన సంకేతాలు ఉచ్చారణ రూపంలోబయటికి వినిపిస్తాయి.
ఇది నాలుగవ స్టితి.
అందుచేత 1. సంకల్పము (will) 2. భావము (import) 3. సంకేతము (symbolic language) 4. ఉచ్చారణ (Utterance) అను నాలుగు స్థితులలో వాక్కు సృష్టి అవుతున్నది. ఇందులో ఉచ్చారణ మాత్రమే లోకానికి వినిపిస్తున్నది. మిగతా మూడు వినిపించకుండ లోపలే ఉండిపోతాయి. ఉచ్చరించేవాడు 'బ్రహ్మి' ఉచ్చరించేది సరస్వతి అని పురాణాలు సంకేతిస్తాయి.
ప్ర : ఇలాగే యావత్తు సృష్టి జరుగుచున్నదా?
జ : ఇలాగే సృష్టిలో గూడా నాలుగవ దశ మాత్రమే బయటికి కనిపిస్తుంది. మూడు దశలు బయటికి కనిపించవు.
ప్ర: దీనిని గురించి మన మహర్షులు ఏమైనా పేర్కొన్నారా?
జ : పురుష సూక్తంలో సృష్టి యొక్క మూడు భాగాలు లోపల జరుగుతాయని, ఒక భాగం మాత్రమే బహిర్గతమవుతుందనీ చెప్పబడింది.
ప్ర: ఏమిటి నాలుగు భాగాలు?
జ : ఇపుడు మనం చెప్పుకున్నదే. ఇందు ప్రతి దశకూ అధిష్టాన దేవతలున్నారు.
1. సంకల్పము... అధిష్టాన దేవత - ఈశ్వరుడు
2. భావము... అధిష్టాన దేవతలు - 12 మంది ఆదిత్యులు
3. స్పందన (లేక శక్తి)... అధిష్టాన దేవతలు - 11 మంది రుద్రులు
4. ద్రవ్యాత్మకం ... అధిష్టాన దేవతలు - 8 మంది వసువులు
ప్ర : బాగున్నది. ఈ సృష్టి విధానం మానవ సృష్టి పరంగా చెప్పుండి?
జ : అదే చెప్పబోతున్నాను. ఒక ప్రాణి జన్మించాలంటే సంకల్పం ఒక వుంటుంది. అది తలిదండ్రుల మనస్సులలో వాంఛగా బయలుదేరుతుంది. అది మొదటి అంచె... తాను సృష్టిగా మారాలనే కోరిక కలిగిన భగవంతుని సేరు 'మహా కామేశ్వరుడు”*. ఆ కోరిక, '“మహాకామం'” వెలువడిన సృష్టి స్వరూపిణి 'మనో కామేళ్వరి'.
ఈ వాంఛ వలన శుక్ల శోణితములు కలిసినప్పుడు ఒక భావమయాత్మకమైన సృష్టి జరుగుతుంది. దీనితో ఏక కణముగా ఆరంభమైనది మానవకణముగా మార్పు చెందుతుంది. ఇది (Cosomgenisis) రెండవ అంచి.
మూడవ స్టాయిలో మానవకణము పూర్తి మానవ రూసము తీసుకుంటుంది. దీనిని (Anthropogenesis) ) అంటారు. ఇది పైన చెప్పిన సంకేతస్టాయితో సమన్వయ పరచవచ్చును. నాలుగవ స్టాయిలో అట్టి శిశువు బయటికి 'ప్రసవించబడుతుంది. దీనిని వాక్కు యొక్క ఉచ్చారణ స్టాయితో సమన్వయ పరచవచ్చును.
ప్ర: భాగవతంలో దీని ప్రసక్తి ఉందా?
జ ;" అసలు భాగవతం 12 స్కంధాళ్లోను మొదటి 9 స్కంధాలలో మొదట 9 స్కంధాలలో అంటే 3 పాళ్లు జీవి తయారవడంలో గర్భంలోపల జరిగే కథలుందాయి. దశమ స్కంధంలో జీవి (అనగా కృష్ణుడు) ప్రసవించబడి, 10,11,12 స్కంధాల్లో ఆయన బాహ్యకథ వుంటుంది. అంటే నాలుగోవంతు బాహ్యకథ అన్నమాట.
ప్ర : దీనిని గురించి పురష సూక్తంలో ఏమైనా ప్రస్తావించారా?
జ : ''పాదో౭స్య విశ్యాభూతాని
"త్రిపాదస్యాః. మృతందిని'” అన్నారు పురుష సూక్తంలో. విశ్వములో కనబడు భౌతిక సృష్టి అంతయు నాలుగవ వంతు మాత్రమే. మిగిలిన మూడు భాగములు లోపలనే ఇమిడి యున్నవని చెప్పారు.
ప్ర: వాక్కు యొక్క నాలుగు స్టాయిల గురించి మహర్షులేమైనా చెప్పినారా?
జ : బుగ్వేదంలోని సరస్వతీ సూక్తంలో దీనిని గురించి చెప్పారు. వాక్కుకు నాలుగు స్థాయిలుంటాయని, అందు మొదటి మూడును గుహలో ఇమిడియుండి బయటికిరావనీ, నాలుగవ స్టాయిలోని వాక్కును మాత్రమే మనుష్యులు పలుకుచున్నారని, సరస్వతీ సూక్తంలో ఈ, క్రింది మంత్రములో చెప్పారు.
చత్వారి వాక్పరిమితా పదాని
తాని విదుర్భ్రాహ్మణా యే మనీషిణః
గుహాత్రీణి నిహితా నేంగయంతి
తురీయం వాచో మనుష్యావదంతిః ||
ప్ర : బాగున్నది. మరి ఈ నాలుగు స్టాయిలకు పేర్లేమిటి?
జ : ఈ నాలుగు స్థాయిలపేర్లు : పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరీ. ఈ పేర్టు లలితా సహస్రనామంలో ఈ క్రింది శ్చోకంలో చెప్పబడినది.
పరా ప్రత్యక్చితీ రూపా పశ్యంతీ పరదేవతా
మధ్యమావైఖరీ రూపా భక్తమానస హంసికా!!
ప్ర : మంచి విషయం చెప్పారు. అయితే నురొక సందేహం. ఇందాక మీరు సృష్టి యొక్క నాలుగు స్ధితులకూ అధిస్టాన దేవతలను పేర్కొన్నారు గదా, ఎవరు వారు? వారి అవసరమేమిటి?
జ : మంచి ప్రశ్న అడిగారు. సావధానంగా వినండి. ఏపని జరగాలన్నా దానికి తగిన సిబ్బంది కావాలి. సృష్టి కార్యం జరగడానికి ఆ సిబ్బంది 33 మంది వున్నారు. ఈ విషయం ఈ క్రింది శ్లోకంలో చెప్పారు.
త్రయత్రింశత్ సహస్రాణి
త్రయ త్రింశత్ శతానిచ
త్రయ త్రింశత్చ దేవానామ్
సృష్టి స్సంక్షేప లక్షణా!
సృష్టి జరగడానికి 33 చొప్పున దేవతల వర్గము అవసరమగునని పై శ్లోకము చెపుతున్నది.
ప్ర : ఎవరా 33 మంది దేవతలు?
జ : వీరిలో 12 మంది ఆదిత్యులున్నారు. వీరిని ప్రజ్ఞామయ (consciousness) లేక దేవలోకము (light)నకు సంబంధించిన దేవతలు. వీరిని Lords of the plane of Radiation అంటారు.
పిదప 11 మంది రుద్రులున్నారు. వీరు స్పందనాత్మక లేక శక్త్యాత్మక (Force) లోకమునకు అధిపతులు. వీరిని Lords of the plane of Materialism or Precipitation అంటారు.
ప్ర : వీరంతా కలసి ౩1 మంది అయినారు. మిగతా ఇద్దరెవరు?
జ : అదే చెప్పబోతున్నాను. మొత్తము సృష్టి యొక్క ప్రారంంభమునకు
సంబంధించిన దేవత Lord of the inauguration of creation ఒకరున్నారు. సృష్టి అంతమునకు సంబంధించిన దేవత మరొకరున్నారు. అనగా జననము, మరణములకు వీరు అధిదేవతలు. వీరికి అశ్వినీ దేవతలనిపేరు, వీరి పేర్లు నాసక్యుడు, ద్రస్త్యుడు. వీరిని కలుపుకుంటే 33 మంది దేవతలు. వీరినే మననాళ్ళు 33 కోట్టదేవతలన్నారు.
ప్ర : వీరు ఒక్కొక్కరేగదా. కోటి ఎలా అవుతారు?
జ :.కోటి అంటే ఇక్కడ అర్ధం నూరు లక్షలు అని కాదు. కోటి అనగా సమూహమని అర్ధం. ఒక్కక్క దేవత ఒక్కొక్క సమూహానికి సూచనగా చెప్ప బడినది. (కోటి అంటే అంచు, వర్గము, నూరులక్షలు - ఇలా చాలా అర్జాలున్నాయి. కామకోటి అంటే కామానికి పై అంచులో వున్నది. అంటే మోక్షం అని
అర్ధం. అంతేగాని కోటిరెట్టు కామం అని అర్దం కాదు. 'శిష్యకోటి' అంటే శిష్యవర్గము అనే అర్దం చేసుకుంటాంగదా!)
-- డా. జి ఎల్ ఎన్ శాస్త్రి , ఎం.ఎస్.సి