శ్రీ విగ్నేశ్వర |
శ్రీ విగ్నేశ్వర నమస్కార స్తోత్రమ్
జయ విఘ్నేశ్వర ! నమో నమో, జగద్రక్షక్రా! నమో నమో
జయకర! శుభకర! సర్వపరాత్పర! జగదుద్దారా! నమో నమో
మూషిక వాహన ! నమో నమో, మునిజనవందిత! నమో నమో
మాయారాక్షసమదాపహరణా! మన్మథారిసుత! నమో నమో
విద్యాదాయక! నమో నమో, విఘ్నవిదారక నమో నమో,
విశ్వసృష్టిలయకారణ! శంభో! విమలచరిత్రా! నమో నమో
గౌరీ ప్రియసుత నమో నమో, గంగానందన! నమో నమో
గంధర్వాద్భుతగానవినోదా! గణపతిదేవా! నమో నమో
నిత్యానందా! నమో నమో, నిజఫలదాయక నమో నమో
నిర్మలపురవర! నిత్యమహోత్సవ! రామనాథ నుత నమో నమో