శివపార్వతీ తనయ 'గణేశా' |
2. శ్రీ గణేశ ప్రార్ధన
తొండము నేకదంతమును దోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మైయు గజ్జలును మెల్లని చూపులు మందహాసమున్
కొండొక గుజ్జురూమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీతనయ యోయి గణాధిప నీకు మొక్కెదన్
తొలుతన విఘ్నమస్తనుచు ధూర్జటి నీకు మోక్కెదన్
ఫలితము సేయుమయ్య నిను ప్రార్ధన చేసెద నేకదంత మా
వలపటి చేతి ఘంటమున నాక్కున నెప్పుడు బాయకుండుమీ
తలపున నిన్ను వేడెదను దైవగాణాధిప లోకనాయకా!
తలచితినే గణనాధుని! తలచితినే విఘ్నపతిని దలచిన పనిగా
దలచితినే హేరంబుని! దలచిన నావిఘ్నములను తొలగుట కొరకున్
అటుకులు కొబ్బరి పలుకులు! చిట్టిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్
నిటాలాక్షు నగ్రసుతునకు! పటుతరముగ విందు చేతు ప్రార్ధింతు మదిన్
పేజీ నెం - 3