Muktabai |
అనుంగు సోదరి
మహారాష్ట్రలో వరాకరీ సంప్రదాయానికి చెందిన అగ్రశ్రేణి వ్యక్తులలో ప్రముఖురాలు ముక్తాబాయి (క్రీ.శ. 1279-1297). మహారాష్ట్రకు. చెందిన. ప్రముఖ యోగి, సంకీర్తనాచార్యుడు జ్ఞానదేవ్కు స్వయానా సోదరి ముక్తాబాయి.
గోదావరి నదీతీరంలో ఆపేగాంవ్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి చెందిన విఠల్పంత్ కులకర్ణికి, రుక్కాబాయితో వివాహం జరిగింది. ఆ దంపతులకు చాలాకాలం పాటు సంతానం కలుగలేదు.
కొద్ది కాలం తరువాత విఠల్ పంత్కు ఈ ప్రాపంచిక జీవితం పట్ల నిరాసక్తత ఏర్పడింది. అప్పుడు ఆయన వారణాసికి చెందిన రామానంద అనే. సాధువును ఆశ్రయించాడు. సన్వ్యాసం స్వీకరించాలనే తన అభిలాషను వ్యక్తంచేశాడు. నిజానికి, గృహస్థు గనక సన్వ్యాసాశ్రమం స్వీకరించాలంటే, అందుకు అతని భార్య అంగీకరించి, అనుమతినివ్వాల్సి ఉంటుంది. అయితే, తనకు పెళ్ళే కాలేదంటూ విఠల్ పంత్ ఆ సాధువు దగ్గర అబద్ధమాడాడు. ఆ మాటలు నమ్మిన రామానందుల వారు విఠల్ పంత్కు సన్వ్యాస దీక్ష ప్రసాదించారు. చైతన్యానంద అనే సన్వ్యాస నామం ఇచ్చారు.
కాగా, వారణాసిలో జరిగిన ఈ పరిణామాలేవీ రుక్కాబాయికి తెలియదు. భర్త క్షేమంగా తిరిగి రావాలని ఆమె దైవ ప్రార్ధనలు చేస్తూ గడపసాగింది. ఒకసారి రామానందుల వారు రామేశ్వరం వెళుతూ, మార్గమధ్యంలో అనుకోకుండా రుక్కాబాయిని కలిశారు. మూటల సందర్భంలో, ఆమె భర్తే విఠల్ పంత్ అనే విషయం తెలిసింది. జరిగిన పొరపాటు గ్రహించిన ఆయన ఆ సాధ్వి బాధను
గమనించి, సత్సంతానానికి జన్మనిస్తావంటూ ఆశీర్వదించారు. వారణాసికి తిరిగి వచ్చిన తరువాత రామానందుల వారు విఠల్ పంత్ (వైతన్యానంద)ను అపేగాంవ్ తిరిగి వెళ్ళాల్సిందిగా
ఆజ్ఞాపించారు. మునుపటిలా యథావిధిగా గృహస్థాశ్రమ జీవితం గడపాల్సిందిగా ఆదేశించారు. గురువుగారి ఆజ్ఞను విఠల్పంత్ శిరసావహించక తప్పలేదు.
కాలక్రమంలో విఠల్ పంత్, రుక్కాబాయి దంపతులకు నలుగురు సంతానం కలిగారు. వారిలో మొదటి ముగ్గురూ మగ పిల్లలు కాగా, నాలుగో సంతానం కుమార్తె ఆ ముగ్గురు కుమారులకూ వరుసగా నివృత్తి జ్ఞానదేవ్, సోపాన్ అని పేర్లు పెట్టారు. కుమార్తెకు ముక్తి అని నామకరణం చేశారు. విఠల్ పంత్ కుటుంబాన్ని ఊళ్ళోని అగ్రవర్జ్ధాల వారంతా అంటరానివారిగా చూసేవారు. అదేమంటే, ఒకసారి సన్వ్వాసం తీసుకున్న వ్యక్తి మళ్ళీ గృహస్థు కావడానికి వీల్లేదని వాదించేవారు. ప్రాణత్యాగమొక్కటే దీనికి ప్రాయశ్చిత్తమని పేర్కొనేవారు. చివరకు విఠల్ పంత్, రుక్కాబాయిలు తమ పిల్లల్ని అనాథల్నిచేసి, తాము గంగానదిలో దూకి ప్రాణత్యాగం చేసుకున్నారు.