మధుమేహం |
మధుమేహంలో ప్రధాన భేదాలు
మధుమేహం ప్రధానంగా రెండు రకాలు: టైప్1 డయాబెటిస్, ట్రైెప్2 డయాబెటిస్. వీటి గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం.
టైప్ 1 డయాబెటిస్ : ఇన్సులిన్ ఆధారిత మధుమేహం ఇది. ఈ రకం మధుమేహం హఠాత్తుగా మొదలై వేగంగా పురోగమిస్తుంది. సాధారణంగా చిన్నతనంలోనే మొదలవుతుంది. ప్యాంక్రియాస్ గ్రంథి ఇన్సులిన్ని పూర్తిగా తయారుచేయలేకపోవటం వల్లగాని లేదా బాగా అల్ప్బమొత్తాల్లో తయారుచేయడం వల్లగాని ఈ స్థితి ప్రాప్తిస్తుంది. ఈ వ్యాధి స్థితి ప్రాప్తించిన వారు రోజువారీగా ఇన్సులిన్ని ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటూ ఆహారాన్ని నిర్దేసిత రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్సులిన్ లేని రోజుల్లో అంటే, 1921వ సంవత్సరం కంటే ముందు ఈ వ్యాధి వచ్చినవారు ఎక్కువకాలం జీవించగలిగేవారు కాదు. అయితే, ఇప్పుడా పరిస్థితి లేదు. తరచుగా “ మూత్రవిసర్జన చేయాల్సిరావటం, పిల్లలైతే మూత్రవిసర్దనమీద నియంత్రణ వచ్చిన తరువాత కూడా పక్క తదపటం, ఎక్కువగా దప్పికవేయటం, ఆకలి విపరీతంగా వేయటం, ఉన్నట్లుండి బరువుతగ్గిపోవటం, నిస్రాణ, బలహీనత, చిరాకు, వాంతులు, వికారం వంటివి ఈ రకం మధుమేహంలో ప్రధాన లక్షణాలు.
మధుమేహాన్ని నియంత్రించే ప్యాంక్రియాస్ ! |
టైప్ 2 డయాబెటిస్ : దీనిలో వెలుపలనుంచి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దీని ప్రాదుబ్భావం నెమ్మదిగా జరుగుతుంది. శరీరం సరైన రీతిలో ఇన్సులిన్ని వినియోగించుకోలేనప్పుడు ప్రాప్తించే వ్యాధి స్థితి ఇది. సాధారణంగా ఈ రకం మధుమేహం ఆహార నియంత్రణతోనూ, సరైన వ్యాయామం తోనూ నియంత్రణలో ఉంటుంది. కొంత మందికి మాత్రం రక్తంలోని చక్కెరను స్థిరపచడానికి మౌభికంగాగాని లేదా ఇంజెక్షన్ రూపంలోగాని ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరముంటుంది. ఇలాంటి స్థితుల్లో ఆయుర్వేదం ఉపయోగపడుతుంది. ఎత్తుకు ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరముంటుంది. ఇలాంటి స్థితుల్లో ఆయుర్వేదం ఉపయోగపడుతుంది. ఎత్తుకు తగిన బరువును కలిగి ఉండటం, శారీరకంగా చైతన్యవంతంగా ఉండటం, మానసిక జఒత్తిళ్లనుంచి దూరంగా ఉండటం వంటివాటి ద్వారా ఈ తరవో మధుమేవిన్ని సమర్థవంతంగా మాలా. నియంత్రించుకోవచ్చు. ఇది సాధారణంగా పెద్దల్లో కనిపించేదైనప్పటికీ, ఇటీవల కాలంలో యువకుల్లో సైతం కనిపిస్తోంది. ఈ రకం మధుమేహంలో టైప్ 1 మధుమేహంలో చెప్పుకున్న లక్షణాలతో పాటు అదనంగా కళ్లు మసకబారటం, చూపు తగ్గిపోవటం, కాళ్లూ పాదాలూ వేళ్లలో తిమ్మిర్లుగా మొద్దుబారినట్లు అనిపించటం, హస్తపాదాలో సూదులు గుచ్చినట్లు చిటవటగా అనిపించటం, కాళ్లమీద గాయమైనప్పుడు త్వరగా మానకపోవటం, తరచుగా చర్మసంబంధమైన ఇన్ఫెక్షన్లు వస్తుండటం, చర్మం మీద దురదగా అనిపించటం, మగతగా అనిపించటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
గర్భిణీల్లో వచ్చే జెస్టేషనల్ డయాబిటిస్ : హార్మోన్లలో సంభవించే తేడాలవల్ల గర్భధారణ సమయంలో కొంతమందిలో ఈ రకం మధుమేహం ప్రాప్తిస్తుంది. సాధారణంగా ప్రసవానంతరం ఈ రకం మధుమేహం తగ్గిపోతుంది. అయితే ఇలా గర్భధారణ సమయంలో మధుమేహం వచ్చిన వారిలో సగానికి సగం మందిలో తరువాత వయసులో టైప్ 2 మధుమేహం ప్రాప్తించే అవకాశం ఉంటుంది. కనుక ఇలాంటి వారు ఆహార వ్యాయామాదుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
పరతంత్ర కారణాల వల్ల వచ్చే సెకండరీ డయాబెటిస్ : స్టీరాయిడ్స్ వంటి కొన్ని రకాల మందులను వినియోగించటం, రసాయనాలకు గురికావటం వంటి కారణాల వల్ల ప్యాంక్రియాస్ దెబ్బతిని మధుమేహం ప్రాప్తించే అవకాశం ఉంది.
ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదా ఇంపెయిర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ : ఈ రకం స్థితిలో మధుమేహానికి ముందు స్థితి నెలకొంటుంది. దీనిని పూర్వం రోజుల్లో లేటెంట్ డయాబెటిస్ అని పిలిచేవారు. దీనిలో రక్తంలోని బ్లడ్ షుగర్ సాధారణ స్థాయికంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయితే మధుమేహ వ్యాధిని కలిగించగలిగినంత ఎక్కువగా ఉండదు. ఈ రకం వ్యాధి స్థితిని ఆహార వ్యాయామాదులతో అదుపులో ఉంచుకోవచ్చు. మొదటి రకం మధుమేహం శరీరంలో ఇన్సులిన్ తయారుకానప్పుడు వస్తుంది. ఎక్కువగా పిల్లల్లోను, యువకుల్లోను కనిపిస్తుంటుంది. రెండవ రకం మధుమేహం శరీరంలో తయారైన ఇన్సులిన్‌ను శరీరం సరిగా వినియోగించుకోలేనప్పుడు వస్తుంది. ఇది సాధారణంగా పెద్దల్లో కనిపించేదైనప్పటికీ, ఇటీవల కాలంలో యువకుల్లో సైతం కనిపిస్తోంది.
- డా. చిరుమామిళ్ల మురళి మనోహర్ ఎం.డి (ఆయుర్వేద)
ఫోన్ - (040) 23742146, 9246575510.