Diabetes Symptoms, Causes |
మధుమేహ లక్షణాలు ఎలా ఉంటాయి, దానికి గల కారణాలు ?
తరచుగా ముత్ర విసర్జన చేయాల్సి రావటం:
శరీరంలో చక్కెర మోతాదు పెరిగిపోయినప్పుడు శరీరం కిడ్నీల ద్వారా దానిని బైటకు పంపే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది.
అతిగా దాహం వేయటం:
శరీరం నుంచీ నీరు ఎక్కువగా విసర్జితమైనప్పుడు, దానిని సరిదిద్దుకోడానికి మెదడు శరీరానికి సంకేతాలు పంపుతుంది. ఫలితంగా నోరు తడారి పోవటం, దాహం వేయటం జరుగుతాయి.
చర్మ పొడారి పోయి దురదలు పెట్టడం:
ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయాల్సి రావటం వల్ల శరీరం నిర్జలీయంగా మారి (డీహైడ్రేషన్)
చర్మం పొడారి పోతుంది. స్నిగ్ధత కోల్పోవటం వల్ల దురదలు ఉత్పన్నమవుతాయి. అలాగే రక్తంలో చక్కెర నిల్వలు ఎక్కువగా ఉండటం వల్ల వ్వాధి రక్షణ శక్తి తగ్గటంతో పాటు బ్యాక్టీరియా వంటి సూక్ష్మ క్రిములు పెరిగి ఇన్ఫెక్షన్లకు ఆస్కారం ఏర్పడుతుంది.
చర్మం పొడారి పోతుంది. స్నిగ్ధత కోల్పోవటం వల్ల దురదలు ఉత్పన్నమవుతాయి. అలాగే రక్తంలో చక్కెర నిల్వలు ఎక్కువగా ఉండటం వల్ల వ్వాధి రక్షణ శక్తి తగ్గటంతో పాటు బ్యాక్టీరియా వంటి సూక్ష్మ క్రిములు పెరిగి ఇన్ఫెక్షన్లకు ఆస్కారం ఏర్పడుతుంది.
గాయాలు త్వరగా మానకపోవటం:
రక్తం ద్వారా నిర్దేసిత ప్రాంతాలకు పోషక తత్వాలు, ప్రాణవాయువు అందుతుంటాయన్న సంగతి తెలిసిందే. మధుమేహంలో రక్తనాళాలు పూడుకుపోయేందుకు అవకాశం వుంది. గాయమైన చోటుకు రక్తసరఫరా సరిగా జరుగనందున గాయం మానడానికి చాలాకాలం పడుతుంది.
చూపు మసకబారటం:
మధుమేహం వల్ల శరీరంలో జలీయాంశం తగ్గినప్పుడు కంటి కటకంలోని చక్కెరశాతంలోను, నీటిశాతంలోనూ మార్పులు సంభవించి చూపు దెబ్బతినడం జరుగుతుంది.
ఎక్కువగా అకలి వేస్తుండటం:
మధుమేహం మూలంగా శరీరంలో ఇన్సులిన్ మోతాదు తగ్గినప్పుడు రక్తంలోని చక్కెర రూపంలో వున్న ఆహార తత్వాలను కణజాలాలు గ్రహించలేవు. (ఆహారం తీసుకున్నప్పటికీ) దీనితో ఈ కణజాలాలు పోషకతత్వాల కోసం మెదడును చైతన్య పరిచి ఆకలి పెరిగేలా చేస్తాయి.
బరువు కోల్పోవటం:
ఆహారం సరిగా తీసుకుంటున్నప్పటకీ బరువు కోల్పోవటానికి కారణం, ఇన్సులిన్ లోపం వల్ల శారీరక కణజాలాలు ఆహార తత్వాలను గ్రహించ లేక పోవటమే. పోషక తత్వాలు పరిపూర్ణంగా అందకపోవటంతో శరీరం శక్తికోసం కొవ్వు నిల్వలను వినియోగించుకుంటుంది. దీనితో, శరీరంలో కొవ్వు నిల్వలు తగ్గి సన్నబడిపోతారు.
కాళ్లు చేతల్లో తిమ్మిర్లు పట్టినట్లు, సూదులతో గుచ్చినట్లు అనిపించడం:
మధుమేహం దీర్జకాలం నుంచీ ఉన్నప్పుడు నరాలు దెబ్బతిని తిమ్మిర్లు, మంటలు అనిపిస్తాయి.
- డా. చిరుమామిళ్ల మురళి మనోహర్ ఎం.డి (ఆయుర్వేద)
ఫోన్ - (040) 23742146, 9246575510.