Diabetes |
మధుమేహం, విధివిధానం
మధుమేహం ప్రధానంగా ఇన్సులిన్ హార్మోన్ పనితీరు దెబ్బతిన్నప్పుడు వస్తుంది. ఆరోగ్యవంతుల్లో ప్యాంక్రియాస్ గ్రంథిలో ఉండే బీటా కణాలు ఇన్సులిన్ని విడదల చేస్తాయి. ఆహారం ద్వారా తయారైన గ్లూకోజ్ రక్తంలో సంచరిస్తున్నప్పుడు శరీరపు కణసముదాయాలు దానిని స్వీకరించడానికి ఇన్సులిన్ సహాయపడుతుంది. అలాగే కాలేయంలోనూ, కండరాల్లోనూ గైకోజన్ తయారీకీ, గ్లూకోజ్ ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వు సంబంధ పదార్జాలుగా మారడానికీ, ప్రోటీన్ల జీవక్రియకూ ఇన్సులిన్ హార్మోన్ సహాయపడుతుంది.
రక్తంలో గ్లూకోజ్ మొత్తాలు మూడు అంశాలమీద ఆధారపడి ఉంటాయి:
1) కాలేయం గ్లూకోజ్‌ని తయారుచేయటం
2) శారీరక కణసముదాయాలు గ్లూకోజ్‌ని గ్రహించి వినియోగించుకోవటం
3) ప్యాంక్రియాస్ గ్రంథి ఇన్సులిన్ని తయారుచేసి విడుదల చేయటం.
ఈ ప్రక్రియల్లో తేడా ఎక్కడ తేడా సంభవించినా గ్లూకోజ్ వినిమయంలో సమస్యలు చోటుచేసుకుంటాయి. శరీరం గ్లూకోజ్‌ని సమర్ధవంతంగా వినియోగించుకోలేకపోయినప్పుడు మధుమేహం ప్రాప్తిస్తుంది. దీనినే గ్లూకోజ్ ఇంటాలరెన్స్ అంటారు. దీని పర్యవసానంగా గ్లూకోజ్ రక్తంలో సంచితమై అవాంఛనీయ లక్షణాలను, సమస్యలను ఉత్పన్నం చేస్తుంది.
- డా. చిరుమామిళ్ల మురళి మనోహర్ ఎం.డి (ఆయుర్వేద)
ఫోన్ - (040) 23742146, 9246575510.