Ayurvedic tips to reduce urinary problems |
మూత్ర సమస్యలు రకరకాలుగా ఉంటాయి.
వాటిలో ముఖ్యంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, త్వరగా మూత్రం రావడం, మూత్రం సరిగా రాకపోవడం, మూత్రంలో శు, చీము, ప్రోటీన్స్ వెళ్లిపోవడం వంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. యూరినరీ సమస్యలకు కారణాలు ఏవైనా కావచ్చు అవి మీ సహనానికి సవాలుగా మారుతాయి.. మూత్ర సమస్యలకు వైద్య పరమైన చికిత్స ఉన్నప్పటికీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది.. అందులోనూ వాటి వలన త్వరగా నయం కాకపోవచ్చు.. మందులను తీసుకోవడం వల్ల కేవలం లక్షణాలను మాత్రమే అరికట్టవచ్చు.. మూత్ర సమస్యలకు ఆయుర్వేద వైద్యంలో అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి.. వాటిని తెలుసుకుని పాటిస్తే శాశ్వత పరిష్కారాన్ని పొందవచ్చు.. అన్ని రకాల మూత్ర సమస్యలకు చెక్ పెట్టే ఆయుర్వేద వైద్య చిట్కాలు గురించి తెలుసుకుందాం..!!
urinary problems |
Urinary Problems: మూత్ర సమస్యలను తగ్గించే ఆయుర్వేద చిట్కా..!!
కావలసిన పదార్థాలు:
- చందనం పొడి – 100 గ్రాములు,
- గోక్షు ర చూర్ణం – 100 గ్రాములు,
- ఉసిరికాయ పొడి – 100 గ్రాములు,
- మిరియాల పొడి – 100 గ్రాములు,
- కర్పూర శిలాజిత్ – 100 గ్రాములు,
- రజిత భస్మం – 1 గ్రాము,
- చెంగల్వ కోస్టు – 100 గ్రాములు,
- తెల్ల గలిజేరు చూర్ణం – 100 గ్రాములు,
- తవాక్షరీ చూర్ణం – 100 గ్రాములు,
- గంటు భరంగి – 100 గ్రాములు.
పైన చెప్పుకున్న పదార్థాలన్నింటినీ సేకరించి శుభ్రం చేసుకుని వాటిని పొడి చేసుకోవాలి. పైన చెప్పిన మోతాదులో అన్ని పొడులను కలుపుకొని ఒక గాజు సీసా లో భద్రపరుచుకోవాలి. ఇలా తయారుచేసుకున్న పొడి ని ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక స్పూన్ పొడి ని తీసుకొని ఒక గ్లాసు మజ్జిగ తో గాని లేదంటే మట్టి కుండ లోని నీటితో తీసుకోవాలి. ఇలా మూడు నెలలు చేస్తే మూత్రం లో శన్స్. సుద్ధ పోవటం, మూత్రం సరిగ్గా రావడానికి వంటి అన్ని మూత్ర సమస్యలు తగ్గిపోతాయి.. చూర్ణం వలన మూత్ర సమస్యలు తగ్గటమే కాకుండా బలం కూడా పెరుగుతుంది.
గమనిక:
పై నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి.