An Ayurvedic Perspective of Diabetes |
మధుమేహం - ఆయుర్వేద దృక్పథం
అల్లోపతి ఆగమనం తరువాత మధుమేహ వ్యాధి చికిత్సలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చిన మాట నిజం. ముఖ్యంగా ఇన్సులిన్ కనుగొనబడిన తరువాత మధుమేహాన్ని నియంత్రించడం సులువయ్యింది. అయితే ఈ చికిత్సలన్నీ రక్తంలోని చక్కెరను కంట్రోల్ చేసే దిశగా పని చేస్తున్నాయి తప్పితే చక్కెర పెరిగిపోవటం వెనుక ఉన్న కారణాల పైన దృష్టి పెట్టడం లేదు. పైగా ఈ చికిత్సల వల్ల ఇతర ఇక్కట్లు ఎదురవుతున్నాయి. బెషధాన్ని తట్టుకోలేక పోవటం (డ్రగ్ ఇంటాలరెన్స్), జెషధం శరీరానికి అలవాటు పడి పని చేయక పోవటం (ద్రగ్ రెసిస్టెన్స్), రక్తంలో చక్కర హఠాత్తుగా తగ్గిపోయి ప్రాణ ప్రమాదం ఏర్పడటం (హైపోగ్లైసీమిక్ ఎటాక్), అవాంఛనీయ దుష్పలితాలు కనిపించడం వంటి అంశాల కారణంగా సమాంతర, ప్రత్యామ్నాయ చికిత్సల ఆవశ్యకత పెరిగింది. ఈ నేపథ్యంలో మధుమేహానికి సంబంధించి ఆయుర్వేద చికిత్సా సూత్రాలు ఏం చెబుతున్నాయో చూద్దాం.
చరిత్రలో మొట్టమొదటగా మధుమేవాన్ని గూర్చిన సమగ్రమైన వివరణ ఇచ్చింది ఆయుర్వేద గ్రంథాలే. చరక సుశ్చత సంహితలు గ్రంథస్తమైన కొన్ని వేల సంవత్సరాల తరువాత కూడా...నాటికీ, నేటికీ...వ్యాధి మౌలిక దృక్పథంలో ఏ మాత్రం మార్చు లేక పొవటం వైద్య శాస్త్రవేత్తలను విన్మయ పరుస్తోంది. “వాత వ్యాథీ ప్రమేహాశ్చ....” అంటూ నుళ్ళతుడు ఎనిమిది
౪-8 మహారోగాలలో మధుమేహాన్ని చేర్చి చికిత్సాపరంగా దీనికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చాడు. ఎక్కువ మోతాదులో మూత్రం (మేహం) వెళుతుంది కాబట్టి దీనికి ప్రమేహమని పేరు. అలాగే \ మూత్రం చక్కెరతో (మధు) కలిసి విసర్జితమవుతుంది కనుక దీనికి మధుమేహమని పేరు వచ్చింది. దీనిలో 'ప్రభూత-మూత్రత (మూత్రం ఎక్కువ మోతాదులో రావటం), అవిల-మూత్రత (మూత్రం \ చిక్కగా రావటం) అనే రెండు ప్రధానమైన లక్షణాలుంటాయని శాస్త్రకారుడు చెప్పాడు. మధుమేహానికి సరిపొలిన ఇంగ్రీషు పదం డయాబెటిస్ మెల్లిటస్ కూడా ఇదే అర్జాన్ని ధ్వనించడం గమనార్హం! డయాబెటిస్ అనేది గ్రీకు పదం. ప్రవహించడమని అర్థం. అలాగే మెల్లిటస్ అనేది లాటిన్ పదం. తేనె అని అర్థం. డయాబెటిస్ మెల్లిటస్ అంటే, తేనె వంటి ద్రవం శరీరం నుంచీ ప్రవహించడమని అర్ధం.
మధుమేహంలో వాత, పిత్త, కఫాల జోక్యం ఉన్నప్పటికి ప్రధానంగా మాత్రం కఫ వాతాలు దూషితమవుతాయి. శ్లేష్మం పెరిగే ఆహార విహారాల వలన కఫం అమాశయంలో జమ చేరి పాంక్రియాస్ బలహీనమవుతుంది. ఈ పాంక్రియాస్ ఇన్సులిన్‌ను పూర్తి స్థాయిలో విడుదల చేయలేకపోవడంతో రక్తంలో ఉన్న చక్కెర నిల్వలు కణజాలాలలోకి వెళ్లలేవు. దీనితో శరీరానికి రావలసిన శక్తి అందకపోగా, గుండె, మూత్రపిండాల వంటి ప్రధాన అంతర్గత అవయవాల మీద అదనపు వత్తిడి పడుతుంది. ఈ విధంగా మధుమేహమూ, దానిని అనుసరించి ఇతర ఇక్కట్లూ వస్తాయి. శారీరక క్రియలు సక్రమంగా జరుగకపోవడానికి కారణం వాతదోషం కనుక, మధుమేహం వాత ప్రధాన వ్యాధిగా నమోదయింది.
మధుమేహం ఎందుకు ప్రాప్త్పిస్తుందనే దానికి సుశృతుడు ఇచ్చిన వివరణ అత్యంత ప్రామాణికతను సంతరించుకుంది. “'సహజో ఆపథ్యనిమిత్తా...” అంటూ మధుమేహం ప్రధానంగా రెండు రకాలని, వంశపారం పర్యత, బీజ దోష వికృతి వంటి సహజమైన కారణాలచేత వచ్చేది మొదటి రకమని, అపథ్యాలైన ఆహార విహారాలను పాటించడం వలన సంక్రమించేది రెండవ రకమనీ సుశ్చతుడు పేర్కొన్నాడు. మొదటి రకాన్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ లేదా జువనైల్ డయాబెటిస్ తోను, రెండవ రకాన్ని నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ లేదా మెట్ట్యూరిటీ ఆన్సెట్ డయాబెటిస్ తోనూ పోల్చవచ్చు.
మధుమేహం వ్యక్తమవ్వటానికి ముందుగా శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయి. ఆయుర్వేదం ఈ లక్షణాలను “పూర్వరూపాలు అంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు కనుక అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి పురోగమనాన్ని అరికట్టవచ్చు.
శరీరమంతా జిగటగా తిమ్మిరి పట్టి నట్లు ఉండటం (చిక్కనతా దేహే), దంతాలు, కళ్లు మొదలైన భాగాల్లో మలినాలు ఎక్కువగా చేరడం (దంతాదీనాం మలాద్యత్వం,), నోరు తడారి పోవటం (గళ తాలు శోషు, కాళ్లు, చేతుల్లో మంటలుగా అనిపించటం (హస్త పాద తల దాహం),
- వెంట్రుకలు, గోళ్లు ఎక్కువగా పెరగటం (కేశ నఖాతివృద్ధి, మూత్రం నుంచీ తియ్యని వాసన రావటం (మధుర మూత్రత),
- ఎక్కువగా దాహం వేయటం (పిపాసా),
- అనుత్సాహంగా అనిపించటం (అవసాదం),
- చల్లని పదార్జాలంటే ఇష్టంగా అనిపించటం (శీత ప్రియత్వం),
- నిస్తాణంగా అనిపించటం (శిథిలాంగత,),
- కొద్దిపాటి పనికే ఆయాసం రావటం (శ్వాస, నోటిలో తియ్యగా అనిపించటం (స్వాదు ఆస్యత),
- ఎప్పుడూ విశ్రమించాలని అనిపిస్తుండటం (స్వప్న సుఖే రతి),
- కునికి పాట్లు పడుతుండటం (తంద్ర),
- చెమటలు ధారలుగా కారుతుండటం (స్వేదో గంధా)...
ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వాటిని మధుమేహ పూర్వరూపాలుగా భావించాల్సి ఉంటుంది.
చికిత్స విషయానికి వస్తే సంహితాకారులు రక్తంలోని చక్కారను తగ్గించటం కంటే, “'సంప్రాప్పి విఘటనికు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారు. సంప్రాప్తి అంటే, వ్యాధి ప్రాదుర్భావం నుంచీ ఉపద్రవాల వరకూ కొనసాగే వివిధ దశలు.దోషాలు కొద్దిగా పెరిగినప్పుడు ఆహారనియమాలతో పాటు శారీరక వ్యాయామాలు అవసరమవుతాయి. దోషాలు ఒక మోస్తరుగా వృద్ధి చెందితే ఆహార వ్యాయామాలతో పాటు బెషధాలు కూడా అవసరమవుతాయి... ఒక వేళ దోషాలు మరీ ఎక్కువగా వృద్ధి చెందితే, బెషధ, ఆహార, వ్యాయామ సూచనలతో పాటు దోషాలను సమూలంగా బైటకు పంపడానికి శోధన చికిత్సలను చేయాల్సి ఉంటుంది. వీటిని పంచ కర్మ చికిత్సలంటారు. సంక్షిప్తంగా చెప్పాలంటే ఆయుర్వేద శాస్త్రం ప్రకారం, మధుమేహ చికిత్స మూడు ప్రధానమైన విభాగాలుగా జరుగుతుంది: 1) ఆహార చికిత్స 2) విహార చికిత్స (వ్యాయామం తదితరాలు) ౩) ఔషధ చికిత్స.
- డా. చిరుమామిళ్ల మురళి మనోహర్ ఎం.డి (ఆయుర్వేద)
ఫోన్ - (040) 23742146, 9246575510.