Celebrating the 36th Anniversary of the Hindu Temple of Greater Chicago |
హిందూ టెంపుల్ ఆఫ్ గ్రేటర్ చికాగో 36వ వార్షికోత్సవ వేడుకలు ఇటీవల వైభవంగా జరిగాయి. ఆగస్ట్ 3వ తేదిన ప్రారంభమై 5రోజులపాటు అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు బక్షిష్ రావల్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 30 మంది పూజారులతో హోమాలు ఇతర కార్యక్రమాలు శాస్త్రోక్తంగా ఘనంగా జరిగాయి. టెంపుల్ మాజీ అధ్యక్షులను, ఇతర ప్రముఖులను ఈ సందర్భంగా నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.
టెంపుల్ ప్రథమ అద్యక్షులు డాక్టర్ విద్యాసాగర్ మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణానికి పడ్డ వ్యయ ప్రయాసలను వివరించారు. తదుపరి అధ్యక్షులు డాక్టర్ క్రిష్ణారెడ్డి మందిర భవనాల నిర్మాణం గురించి మాట్లాడగా.. అత్యధికంగా నాలుగు పర్యాయాలు ప్రెసిడెంటుగా పనిచేసిన భీమారెడ్డి కష్టపడి నిర్మించుకున్న ఈ ఆలయాన్ని కలిసికట్టుగా మరింత ఆదర్శవంతమైన మందిరంగా ముందుకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు.
అ మరొక మాజీ అధ్యక్షులు డాక్టర్ గోపాల్ శ్రీనివాసన్ మాట్లాడుతూ.. తన హయాంలో జరిగిన అభివృద్దిని వివరించారు. ఈ అభివృద్ధి తన ఒక్కరితోనే సాధ్యం కాలేదని తనతో పని చేసిన కార్యవర్గ ఉద్యోగులు కూడా తీవ్రంగా శ్రమించి అభివృద్ధి చేశారని చెప్పారు. ఆలయ కార్యదర్శి రోహిణి ఉడుప ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. అంతేకాకుండా మాజీ అధ్యక్షులు మొట్టమొదటి మహిళ ఆలయ అధ్యక్షురాలు డాక్టర్ సుధారావు తరువాత అధ్యక్షులుగా పదవిని అలంకరించిన ప్రసన్నారెడ్డి ,కే వి రెడ్డి, వేమూరి సుబ్రహ్మణ్యం, అసుతోష్ గుప్తా, రేణుకారెడ్డి, శ్రీధర తంబరహల్లి, లక్ష్మన మీట్టూరు, సతీష్ అమృతూర్, తిలక్ మార్వాహలను సత్కరించారు. అందరితోపాటు ప్రస్తుత అధ్యక్షుడు బక్షీస్ రావల్‌ను కూడా సన్మానించారు.