వాస్తు |
వాస్తు విషయంగా దిక్కులలో గృహమును పరిశీలించడము వేరు. విదుక్కులలో గృహమును పరిశీలించడము వేరు. చాలా మంది వాస్తు శాస్త్రవేత్తలు ఈ విదిక్కుల విషయంలో చాలా పొరపాట్లు చేస్తుంటారు. ఉదా. తూర్పు లేదా ఉత్తర ప్రాంతమును ఈశాన్యం అనుకుంటారు. అలాగే దక్షిణం లేదా పశ్చిమ భాగమును నైబుతి ప్రాంతముగా గుర్తిస్తారు. వాస్తు శాస్త్రవేత్త అంటే తప్పని సరిగా వారి దగ్గర దిక్చూచి ఉండాలి. దిక్చూచి లేని వాస్తు శాస్త్రవేత్త చేత గృహమును పరిశీలింప చేయించుకోవడం సబబు కాదు. దిక్కులను గుర్తించడం కొరకు దిక్పూచిని కనుక్కోవడం
జరిగింది. దిక్కులు తెలియకుండా గృహమునకు వాస్తు శాస్త్రము బోధించడం ఎంత వరకు న్యాయము. దిక్చూచి లేకుండా ఎవరైనా వాస్తు శాస్త్రవేత్త మీ గృహమును పరిశీలించడానికి వచ్చినచో మీరు దిక్చూచి గురించి వారిని నిలదీయవచ్చును. ఇది ఒకరిని దృష్టిలో వుంచుకొని అన్నమాట కాదు. వాస్తు శాస్త్రవేత్త గృహ యజమాని క్షేమము కోరాలి. దిక్కులు సరిగా కనుక్కోలేక పోతే గృహము యందలి దోషములను ఆయన ఎలా మీకు తెలపగలరు. ఒకవేళ తెలిపినా సరైన దోషములను మీముందు ఉంచలేడు కదా.
విదిక్కులు విషయంలో నేను వ్రాసిన శుభవాస్తు గ్రంధములో కర్నూల్ జిల్లాలో జరిగిన సంఘటనను వివరించడం జరిగింది. దిక్చూచి లేకుండా వాస్తు చెప్పడం తప్పు. సరైన ఫలితములు పొందడం కష్టం.
- దిక్చూచి లేకుండా వాస్తు శాస్త్రవేత్తను మీ గృహ పరిశీలనకు అనుమతించవద్దు.
- దిక్కునకు విదిక్కునకు ఉన్న తేడా ఏమంటే మీరు అనుకున్న విధంగా తూర్పు భాగము తూర్పుగా ఉండదు. అలాగని దిక్కులు పొరపాటుబడ్డాయని కాదు.
- మీరున్న స్థలము దిక్కులకు సరిగా లేకుండా పోతే అది విధిక్కు స్థలమని గమనించుకోవాలి.
- విదిక్కుస్థలములో తూర్పు భాగము ఈశాన్యము కిందగను లేదా ఆగ్నేయ ప్రాంతముగను ఉండును. అలాగే ప్రతి ఒక దిక్కు కూడా స్థలముయందు సరిగా చూపించబడి ఉండదు.
- స్థలము దిక్కులకు సరిగా లేనప్పుడు మాత్రమే ఇలాంటి పరిస్థతులు సంభవిస్తాయి. మన రాష్ట్రములోనే విస్తారంగా ఎన్నో పట్టణములు, పల్లెల ప్రాంతములు ఇలాంటి విదిక్కు స్థలములను చూడవచ్చును.
- ప్రతి ఒక వాస్తు శాస్త్రవేత్తకు ఇలాంటి విదిక్కుల స్థలములయందు గృహపరిశీలనకు కాస్త ఎక్కువ సమయము తీసుకోవడం కద్దు.
- ప్రతి గదికి దిక్పూచిని చూడవలసిన పరిస్థితులు రావచ్చును. ఇందులో ఏ దోషము లేదు. పైగా ఇది సరైన పద్ధతే.
- విదిక్కుల స్థలములయందు గృహములో ప్రతి గదికి దిక్చూచిని తీసుకు పోవడం, పరిశీలించడము చిన్న తనముగా భావించరాదు. మహామహులే గృహస్థుల క్షేమము కోరుతూ నిశితంగా గృహ పరిశీలనను దిక్పూచి సహాయంతో గమనిస్తారని తెలుస్తోంది.
- పొరపాటుగా దిక్చూచి లేకుండా గృహాన్ని పరిశీలించి తూర్పు ద్వారము పెట్టడము కొరకు స్థల నిర్ణయములో పొరపాటుపడి ఆగ్నేయ ప్రాంతములో ద్వారమును ఏర్పాటు చేస్తారు.
- ఆగ్నేయ ద్వారము మహా దోషపూరితమైనదని మీకు తెలుసు.
- పశ్చిమమనుకొని వాయవ్య ప్రాంతములో ద్వారమును ఏర్పాటు చేస్తారు. వాయవ్య ద్వారము ఎంత దోష పూరితమైనదో మీకు అందరికి తెలుసుకదా.
- ఇలాంటి పొరపాట్ల వల్ల గృహస్థులు దినగండము నూరెళ్ళ ఆయుష్నులా రోజులను గడపవలసిన పరిస్థితులు దాపురిస్తాయి.
- ఇక కొళాయి గుంతల (సంపు) విషయులో ఈశాన్య ప్రాంతమనుకొని తూర్పు ప్రాంతములో లేదా ఉత్తర ప్రా '౦తములో గుంతలు త్రవ్వకుంటారు.
- ఈశాన్య ప్రాంతము గుంత లేకుండా పోతుంది.
- తూర్పు లేదా ఉత్తర ప్రాంతములో గుంత రావడం తప్పు కాదు. అలాగని ఈశాన్య ప్రాంతములో గుంత లేకుండా పోవడం మంచిది కాదు కదా.
- ఈశాన్య ప్రాంతములో గుంత రావడం వలన ఎన్నో దోషాలను హరిస్తూ సకల సంపదలను గృహస్థులకు అందిస్తుంది.
- కుళాయి గుంత విషయము వదిలితే మరుగుదొడ్డి గుంత విషయములో తూర్పు లేదా ఉత్తర భాగములో మరుగుదొడ్డి గుంతను తవ్వకోవడం మనకు తెలిసిందే.
- ఈ విదిక్కు స్థలములలో మరుగుదొడ్డి గుంతల విషయములలో జరిగే మతలబు ఏమంటే తూర్పు ప్రాంతము అనుకొని ఆగ్నేయంలోనూ లేదా ఉత్తర ప్రాంతముఅనుకొని వాయవ్యంలోనూ మరుగుదొడ్డి గుంతలు 'తవ్వకుంటారు.
- ఆగ్నేయం, వాయవ్యంలో గుంతలు ఉండడం దోషము లేదా ఈశాన్యంలో మరుగుదొడ్డి.
- ముఖ్యంగా ద్వారముల విషయములో విదిక్కుల స్థలములలో జరిగే పొరపాట్లు అంతా ఇంతా కాదు.
- అనుభవజ్ఞుడైన వాస్తు శాస్త్రవేత్తలకు కూడా ఈ విదిక్కు స్థలములలో దోషములను పట్టుకోవడానికి కాస్త సమయము తీసుకోవడం జరుగుతుంది. అయితే వీరివలన జరిగే ప్రయోజనము ఏమంటే భవిష్యత్తులో గృహస్థులు బాధపడకుండా దోషాలను సవరించే ఉపాయాలను తెలుపగలరు.
- దక్షిణము, పశ్చిమముల యందు బరువులను ఉంచుకోవడం చాలా మంచిది. చాలా మంది గృహస్థులు కూడా ఈ పద్దతులను పాటిస్తారు.
- విదిక్కుల స్థలములలో జరిగే పొరపాట్లు ఏమంటే దక్షిణమనుకొని ఆగ్నేయ ప్రాంతములోనూ లేదా పశ్చిమమనుకొని వాయవ్య ప్రాంతములోనూ. బరువులను ఉంచడం జరుగుతుంది. తద్వారా దక్షిణ, పశ్చిమ ప్రాంతములో బరువులను కోల్పోయి వ్యతిరేక ఫలితములను గృహస్థులు అనుభవించాల్సిన పరిస్థితులు రావచ్చును.
- ఇక వాడుక నీరు బయటికి వెళ్ళే విషయంలో ఉత్తర, ఈశాన్య, తూర్పు ప్రాంతములనుకొని వాయవ్యం, ఆగ్నేయ ప్రాంతములలో వాడుక నీరు బయటికి వెళ్ళడానికి కంతలను ఏర్పాటు చేసుకుంటారు. ఇది తప్పు.
- మెట్లను (సోపానాలు) ఆగ్నేయం లేదా వాయవ్య ప్రాంతములయందు వేసుకోవడం తెలిసినదే కదా. ఈ విదిక్కుస్టలములలో జరిగే తంతు ఏమంటే ఒక్కోసారి ఆగ్నేయమనుకొని తూర్పు ప్రాంతములో, వాయవ్యం అనుకొని ఉత్తర ప్రాంతములో మెట్లను వేసుకోవడం జరుగుతుంది.
- అలాగే ఇంటి యందలి ఫర్నీచర్ విషయములో కూడా నైబుతి ప్రాంతములో బరువులను అధికము చేయవలసినది పోయి దక్షిణ లేక పశ్చిమ ప్రాంతములలో బరువులను అధికము చేస్తూ నైబుతి ప్రాంతమును బరువులు లేకుండగా చేయడము జరుగుతుంది. ఇది తప్పు. నైబుతిలో బరువులుండటం చాలా మంచిది.
- ఏది ఏమయినా విదిక్కుల విషయములలో మాత్రము చిన్న పొరపాట్లు జరగడం కూడా మంచిది కాదు. ఏమాత్రము అశ్రద్ధ చేయక ఓ నమ్మకస్థుడు, అనుభవజ్ఞుడు అయిన వాస్తు శాస్త్రవేత్త చే గృహ పరిశీలన మరియు సవరణలు చేయుంచుకోవడం చాలా మంచిది.
- ప్రహారీ విషయములో జరిగే పొరపాట్లు అంతా ఇంతా కాదు. ఈశాన్యములో ఎక్కువ స్థలము వదలవలసింది పోయి తూర్పు లేక ఉత్తరముల యందు ఎక్కువ స్థలము వదలడము జరుగుతుంది.
- తూర్పు లేదా ఉత్తరముల యందు ఎక్కువ స్థలము వదులుకోవడం మంచిదే. అలాగని ఈశాన్యమును నిర్లక్ష్యము చేయడం ఎంత మాత్రము భావ్యము కాదు.
- తూర్పు లేదా ఉత్తరములు అనుకొని ఆగ్నేయం లేదా వాయవ్యముల యందు ఎక్కువ స్థలమును వదులుకుంటారు.
- ఆగ్నేయం లేకా వాయవ్యముల యందు ఎక్కువ ఖాల్లీ స్థలము రావడం సబబుకాదు.
- ప్రహారీ విషయములో ఈశాన్య (ప్రాంతముల యుందు ఎక్కువ ఖాలీ స్థలము రావడం చాలా ప్రాముఖ్యత కలిగినది. ఈ విషయంగా పొరపాటు చేయడం తగదు.
- విదిక్కుల స్థలాలలో పశ్చిమము దక్షిణ ప్రాంతముల యందు ఎక్కువ ఖాల్లీ స్థలములు రావడం జరుగుతుంది. ఇది కూడా తప్పు.
- ఇక చెట్ల విషయానికి వస్తే వేయవలసిన ప్రాంతములో చెట్లు వేయకుండా ఇతర ప్రాంతములలో చెట్లను వేసి మంచి స్థలములను సైతము వాటి బలమును పోగొట్టె విధంగా చేస్తున్నారు. ఇవి తెలియకుందా చేసే పొరపాట్లు.
- గృహస్టులు విదిక్కు విషయాలలో పై సూచనలన్నింటిని దృష్టిలో వుంచుకొని నిర్మాణములను సాగించి క్షేమముగా ఇంటిల్లిపాది సంతోషకరముగా ఉండాలని ఆశించి మీకు తెలపడం అయ్యింది.
ఒక ప్రాముఖ్యత కలిగిన సమాచారము ఏమంటే విదిక్కు గృహములో ఈశాన్య ప్రాంతములో ద్వారము ఉంచుకొని దానికి ఎదురు అనుకొని దొడ్డి దారిగా నైబుతిలో ద్వారమును ఏర్పాటు చేస్తారు. ఇటువంటి పొరపాట్లు జరగకుండా మీరు జాగ్రత్త వహించాలి. తస్మాత్ జాగ్రత్త.
వాస్తు నిపుణులు "సురేష్" - 098481 14778