రుద్రాక్షలు |
రుద్రాక్షలు
- ఏకముఖి రుద్రాక్ష : ఇది శివుని ప్రతిరూపం. ఇది ధరించిన వ్యక్తికి ఏ విషయంలోనూ కొరత ఉండదు. వ్యక్తి వికాసం, జ్ఞాన సమృద్ధి, సంపద చేకూరతాయి.
- ద్విముఖి : అర్ధనారీస్వర తత్వానికి సంకేతం. దీనిని ధరించడం వలన కుండలినీ శక్తి పెరుగుతుంది.
- త్రిముఖి : ఇది అగ్నికి సంకేతం. ఆరోగ్యానికీ, అభ్యుదయానికీ ఉపకరిస్తుంది.
- చతుర్ముఖి : బ్రహ్మకు ప్రాతినిధ్యం వహిస్తుంది. పాలలో వేసి త్రాగితే మానసిక రోగాలు నయమవుతాయి. విద్యార్ధులకు బాగా ఉపకరిస్తుంది.
- పంచముఖి : గుండె జబ్బులున్నవారికి మంచిది. శతృవులను సులభంగా జయించవచ్చు. పాము కాటునుంచి రక్షణ కలుగుతుంది.
- షణ్ముఖి : కార్తికేయునికి ప్రతీక. రక్తపోటు, హిస్టీరియా పోతాయి.
- సప్తముఖి : కామధేనువుకి ప్రతీక. అకాల మరణం సంభవించద
- అష్టముఖి : విఘ్నేశ్వరునికి ప్రతీక. కుండలినీ శక్తి పెరుగుతుంది.
- నవముఖి : భైరవునికి ప్రతీక. దుర్గ ఆరాధకులకు మంచిది. దీనిని ఎడమ చేతికి ధరించాలి.
- దశముఖి : జనార్ధనుడికి పరీక్ష. అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. దీనిని స్త్రీలు ఎక్కువగా ధరిస్తారు.
- ఏకాదశముఖి : 11 ముఖాలు. రుద్రుని 11 రూపాలకు ప్రతీక. దుష్ట శక్తులనుంచి కాపాడుతుంది.
- ద్వాదశముఖి : 12 మంది ఆద్యులకు ప్రతీక. గౌరవం పెరుగుతుంది.
- త్రయోదశముఖి : కామధేవునికీ, కార్తికేయునికీ ప్రతీక. పాలలో వేసి, ఆ పాలను త్రాగితే అందం పెరుగుతుంది.
- చతుర్దశముఖి : 14 ముఖాలు. ఉపనిషత్తుల ప్రకారం ఇది పరమశివుని కన్ను.
- పంచదశముఖి : పశుపతికి ప్రతీక. ఆధ్యాత్మిక సాధనకు ఉపకరిస్తుంది.
- షోడశముఖి : 16 ముఖాలు కలది. ఇది కల్పిమాడుకుకు ప్రతీక.
- సప్తదశముఖి : విశ్వకర్మకు ప్రతీక. దీని వలన సంపద కలుగుతుంది.
- అష్టాదశముఖి : 18 ముఖాలు. ఇది భూమికి తార్కాణం.
- ఏకోన్నవింశతిముఖి : 19 ముఖాలు. ఇది సాక్షాత్తూ నారాయణుడికి సంకేతం.
- వింశతిముఖి : 20 ముఖాలు. ఇది సృష్టికర్త బ్రహ్మకు సంకేతం.
- ఏకవింశతిముఖి : 21 ముఖాలుగల రుద్రాక్ష. ఇది కుబేరునికి ప్రతీక. ఇది అత్యంత అరుదైన రుద్రాక్ష. 21 ముఖాల కలిగిన రుద్రాక్షలతో తయారైన మాలను ఇంద్ర మాల అంటారు. ఇంద్రమాలను ధరిస్తే ఇక వారికి దుస్సాధ్యమేదీ లేదు. జ్ఞాన సమృద్ధి, సంపద చేకూరుతాయి.