నిత్య జీవితంలో భాషావ్యక్తత |
నిత్య జీవితంలో భాషావ్యక్తత
మానవుడు నంఘజీవి సమాజంలో అతడు బ్రతకాలంటే మరొక వ్యక్తి తో సంబంధాన్ని ఏర్పరుచుకోవడం అతి సాధారణమైన విషయం. ఇలా వ్యక్తుల్ని ఒకరితో మరొకరిని కలిపే వ్రధాన సాధనం భాష. వ్యక్తి తన భావనల్ని, ఆలోచనల్నీ, అభిరుచుల్ని, ఆనక్తుల్నీ ఎదుటి వారికి చెప్పాలన్నా, ఎదుటివారి ఆయా విషయాదులను తాను గ్రహించాలన్నా ప్రధాన ఆధారభూమిక కేవలం భాష ఒక్కటే.
లోకవ్యవహారానికి ప్రధానరంగభూమి భాషయే. ఆర్దికంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా సాంన్కృతికంగా నూతన అంశాలను తెలిసికోవాలన్నా, తెలిసిన అంశాల ఆధారంగా అభివృద్దిని సాధించాలన్నా ముఖ్యమైన హేతువు భాషయే. గతకాలపు జ్ఞానాంశాలను పొందాలన్నా, పొందిన జ్ఞానాంశాలను దూరప్రాంతాలకు చేరవేయాలన్నా భాషయే ఆధారం. వ్యక్తిని, అతని కుటుంబాన్ని, అతని సమాజాన్ని అభివృద్ది మార్గం వైవు పయణింవ చేసే మేటి సాధనం భాషయే. ఇలా భాష లేక వ్యక్తే లేడు. వ్యక్తి లేక సేమాజిమే లేదు. సమాజం లేక జీవితమే లేదు. అందుకే నిత్యజీవితంలో భాష అనేది మనిషికి ఆయువు పట్టు.