Important Vastu Tips |
ముందుగా గృహము కొనడానికి మీరు ప్రయత్నము చేసినప్పుడు అనుభవజ్ఞుడు అయిన ఓ వాస్తు శాస్త్రవేత్తచే కొనబోయే గృహమును పరిశీలన చేయించుకొని ఆయన సలహాను పాటించినచో మీ జీవనము మధురంగా గడుస్తుంది. మిడిమిడి వాస్తు జ్ఞానము కలిగి ఏ మాత్రము అనుభవము లేని వారిచే కొనబోయే గ్రహమును పరిశీలింపచేయిస్తే అందుగల దోషములను ఆయన పూర్తిగా మీకు తెలుపకుండా చేసినచో జీవితాంతము మీరు ఎన్నో కష్టాలను అనుభవించవలసి వుంటుంది. విజ్ఞులు, బుద్ధిమంతులు, తెలివైనవారు ఎప్పటికి అనుభవజ్ఞుడు అయిన శాస్త్రవేత్త సలహాలను పొంది మాత్రమే గృహాలను కాని, స్థలాలను కాని కొంటారు. అందుకే వారు, వారితదనంతరం వారి పిల్లలు సంతోషంగా వుంటారు.
మీకు అందుబాటులో అనుభవజ్ఞుడైన వాస్తు శాస్త్రవేత్త లేకపోతే మీలాంటి వారిని దృష్టిలో వుంచుకొని సులభతరమైన రీతిలో ఈ వాస్తు జనరల్ పాయింట్స్ గ్రంధమును మీకు అందించడం జరిగినది.
- మొట్ట మొదటి సూచనగా మీరు కొనబోయే గృహమునకు ఈశాన్యము తెంపు లేకుండా చూసుకోవాలి.
- గృహమునకు ఈశాన్య భాగంలో మెట్టు, దిబ్బలు, భారీ భవంతులు, సెల్ ఫోన్ టవర్లు తదితరములు లేకుండా చూసుకోండి. ఈశాన్యములో తొలగించుకోవడానికి వీలైన మెట్లు దిబ్బలు తదితరములను తొలగించుకొని మాత్రమే గృహమును కొనడానికి ప్రయత్నము చేయాలి. ఒకవేళ వీలు లేకపోతే గృహము కొన్న తక్షణము వాటిని తొలగించుకోవాలి. తొలగించుకోవడానికి వీలులేని నిర్మాణములు వున్నచో ఆ గృహమును మీరు కొనకపోవడమే మంచిది.
- మీరు కొనబోయే గృహమునకు తూర్పు భాగము తెంపు కలిగి వుండరాదు. అలాగే తూర్పు భాగంలో ఎత్తులు గాని, భారీ భవంతులు గాని ఇతరత్ర ఇబ్బందులు కలిగించే ఆవాస్తు నిర్మాణములు వున్నచో ఆ గృహమును కొనకపోవడము మంచిది.
- మీరు కొనబోయే గృహమునకు ఆగ్నేయ భాగం త్రెంపు కలిగివున్నచో ఏ ప్రమాదము లేదని గమనించాలి. కొన్నిసార్లు ఆగ్నేయ భాగం త్రెంపు కలిగిన స్థూలు మరియు గృహాలు అందువుండు యజమానులను మంచి అభివృద్ధికి తీసుకు వెళ్ళడము జరుగుతుంది.
- కొనబోయే గృహమునకు దక్షిణ భాగము వుచ్చంగా, బాగా ఎత్తుగా, మిర్రు కలిగి వున్నప్పుడు చాలా మంచిది. ఇటువంటి గృహములను కొనవచ్చు.
- దక్షిణ భాగము పల్లము కలిగి, గుంతలు, కొలనులు, పెద్ద కాలువలు వున్నచో అటువంటి గృహములను
- కొనరాదు.
- కొనబోయే గృహమునకు నైబుతి పెరిగి వున్నదో అటువంటి గృహములను వదులుకోవడం మంచిది. అనుకూలమైతే నైబుతి తొలగించికోవడానికి వీలైతే ఆ గృహమును కొనవచ్చు.
- నైబుతి భాగంలో ఎటువంటి పరిస్థితులలోను గుంతలు, కొలనులు, పెద్ద కాలువలు, బావులు ఇతరత్ర దోషపూరితమైన గృహములను కొనరాదు.
- నైబుతి భాగంలో కొండలు, గుట్టలు, భారీ భవంతులు, అపార్లమెంట్లు, పెల్ఫోన్ టవర్లు ఇతరత్ర వున్నచో అటువంటి గృహములను నిరభ్యంతరముగా కొనగోలు చేయవచ్చు.
- కొనబోయే గృహమునకు పళ్చిమ భాగం పల్లమైనచో ఆ గృహమును కొనరాదు.
- పళ్చిమ భాగం మిరు కలిగి వున్న గృహములను కొనవచ్చు.
- కొనబోయే గృహమునకు వాయవ్య భాగములో పల్లముగాని, గుంతలు బావులు గాని, లేకుండా చూసుకోవాలి. నైబుతి, ఆగ్నేయం కన్నా వాయువు భాగం మిర్రుగా వుండరాదు.
- కొనబోయే గృహమునకు ఉత్తర భాగంలో బావులు, గుంతలు, పెద్ద కాలువలు, ఇతరత్ర వున్నచో నిరభ్యంతరంగా ఆ గృహమును కొనవచ్చు.
- కొనబోయే గృహమునకు ఉత్తర భాగంలో మెట్లు కాని, భారీ భవంతులు గాని, గుట్టలు గాని, ఇతరత్ర వున్నవో అటువంటి గృహములను కొనకపోవడము మంచిది.
- వీధి పోట్లు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఒక విషయము గమనించుకోవాలి.
- ఈశాన్య వీధిపోటు వున్న గృహములను ఎటువంటి పరిస్థితులలోను వదులుకోరాదు. ఇటువంటి గృహములను కొనే అవకాశము వచ్చినపుడు తప్పని సరిగా కొనడము చాలా మంచిది.
- తూర్పు వీధి పోటు గల గృహము నిరభ్యంతరముగా కొనవచ్చు.
- తూర్పు ఆగ్నేయం వీధి పోటు గల గృహము కొనరాదు.
- ఆగ్నేయ వీధి పోటు గల గృహమును కొనరాదు.
- దక్షిణ ఆగ్నేయ వీధి పోటు గల గృహమును అశుభమని తలచరాదు. నిరభ్యంతరముగా కొనవచ్చు.
- దక్షిణ వీధి పోటు గల గృహమును కొనవచ్చు.
- దక్షిణ నైబుతి వీధి పోటు గల గృహమును కొనరాదు.
- నైబుతి వీధి పోటు గల గృహమును ఎటువంటి పరిస్థితిలోను కొనరాదు.
- పశ్చిమ నైబుతి వీధి పోటు గల గృహమును కొనరాదు.
- పశ్చిమ వీధి పోటు గల గృహమును కొనవచ్చు. (పూర్తి వివరాలకు శుభవాస్తు పుస్తకమును చదవండి.)
- పశ్చిమ వాయవ్య వీధి పోటు గల గృహమును నిరభ్యంతరముగా కొనవచ్చు.
- వాయవ్య వీధి పోటు గల గృహమును కొనరాదు.
- ఉత్తర వాయవ్య వీధి పోటు గల గృహమును కొనరాదు.
- ఉత్తర వీధి పోటు గల గృహమును కొనవచ్చు.
- ఉత్తర ఈశాన్య వీధి పోటు గల గృహమును నిరభ్యంతరముగా కొనవచ్చు.
- ఎత్తు పల్లాల విషయానికి వస్తే ఈశాన్య భాగంలో పల్లమున్న గృహమును నిరభ్యంతరముగా కొనవచ్చు. ఇది చాలా మంచిది అని గమనించాలి.
- ఈశాన్య భాగంలో ఎత్తు గల గృహమును కొనరాదు.
- తూర్పు భాగమున పల్లమున్న గృహమును కొనవచ్చు.
- తూర్పు భాగమున హెచ్చు, ఎత్తు కలగి వున్న (మిర్రు) గృహమును కొనరాదు.
- ఆగ్నేయ భాగంలో పల్లమున్న గృహమును కొనరాదు.
- ఆగ్నేయ భాగంలో నైబుతి కన్నా ఎత్తు కలిగి వున్న గృహమును కొనరాదు.
- దక్షిణ భాగమున ఎత్తు కలిగి వున్న గృహమును కొనడము మంచిది.
- దక్షిణ భాగమున పల్లము కలిగి వున్న గృహమును కొనరాదు.
- నైబుతి భాగమున ఎత్తు కలిగి వున్న గృహమును కొనవచ్చు.
- నైబుతి భాగమున పల్లము కలిగి వున్న గృహమును కొనరాదు.
- పశ్చిమ భాగమున ఎత్తు కలిగి వున్న గృహమును కొనవచ్చు.
- పశ్చిమ భాగమున పల్లము కలిగి వున్న గృహమును కొనరాదు.
- వాయవ్య భాగమున ఆగ్నేయం, నైబుతి కన్నా ఎత్తు కలిగి వున్న గృహమును కొనరాదు.
- వాయవ్య భాగమున పల్లము కలిగి వున్న గృహమును కొనరాదు.
- ఉత్తర భాగమున ఎత్తు కలిగి వున్న గృహమును కొనరాదు.
- ఉత్తర భాగమున పల్లము కలిగి వున్న గృహమును కొనవచ్చు.
- కొనబోయే గృహము గురించి అందు నివసించిన వారి గురించి, వారి పరిస్థితుల గురించి చుట్టు పక్కల వారిని అడిగి విచారించడం చాలా మంచిది.
- కొనబోయే గృహమునకు ఎటువంటి కోర్టు వాజ్యములు లేకుండా ఇతర వ్యవహారములు లేకుండా
- వున్నటువంటివి మాత్రమే కొనాలి.
- వ్యవహారములు వున్న గృహములను కొనకపోవడము చాలా మంచిది.
- వ్యవహారములన్న గృహములను ఇతరులకు అంటగట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటువంటి వారి గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
- సాధారణంగా కొనబోయే గృహమునకు వాయవ్య, ఆగ్నేయ దోషమున్నవో వ్యవహారములు వుంటాయని గమనించాలి.
- కొనబోయే స్థలమునకు కూడా పై పాయింట్స్ను గమనించి ఏ దోషములు లేకుండా వున్న స్థలములను కొనడము చాలా మంచిది.
- ముఖ్యముగా గృహముల కన్నా స్థలముల విషయములో ఎన్నో వ్యవహారములు వుంటాయి. ఇటువంటి అన్నింటిని గమనించి తగిన జాగ్రత్తలు తీసుకొని కొనడము చాలా మంచిది.
- ఏది ఏమయినా చుట్టు ప్రక్కల వారిని విచారించడము మంచిదనే విషయము మరొకసారి గుర్తుకు తెచ్చుకోవాలి.
- ఒక్కో సారి సలముల విషయములో చుట్టు ప్రక్కల ఎవరిని విచారించడానికి అవకాశము వుండదు. కావున అనుభవజ్ఞుడైన ఓ న్యాయవాదిని సంప్రదించి తగిన జాగ్రత్తలు పాటించి స్థలములను కొనడము చేయాలి.
- స్థలముల విషయములో దక్షిణ నైబుతి, పశ్చిమ భాగంలో బావులు, గుంఅలు, పల్లము లేకుండా చూసుకోవాలి.
- ఉత్తర, ఈశాన్య, తూర్పు భాగమున బావులు, గుంతలు, పెద్ద కాలువలు, పల్లమున్న స్థలములను వదులుకోవద్దు.
- ఇక వీధి పోట్ల విషయములో చెడు వీధి పోట్లు గల స్థలములను కొనరాదు.
- శుభ వీధి పోట్లు గల స్థలములను కొనడము మంచిది.
- ఈశాన్య వీధి పోటు గల స్థలములను ఎటువంటి పరిస్థితులలోను వదులు కోవద్దు. ఏది ఏమైనా ఇటువంటి స్థలములు కొడము చాలా మంచిది.
- పెరిగిన స్థలముల విషయమునకు వస్తే ఈశాన్యం పెరిగిన స్థలమును వెంటనే కొనండి.
- తూర్పు పెరగడము మంచిది. కాని ఈశాన్యం కోల్పోతుంది కదా. కావున ఇటువంటి స్థలముల విషయములో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఆగ్నేయం పెరిగిన స్థలమును ఎటువంటి పరిస్థితులలోను కొనరాదు. దక్షిణ ఆగ్నేయం పెరిగిన స్థలమును కొనవచ్చు. అయితే ఈశాన్యములో గుంత వుండడం చాలా మంచిది.
- దక్షిణ భాగము పెరిగిన స్థలమును కొనరాదు.
- దక్షిణ నైబుతి పెరిగిన స్థలమును కొనరాదు.
- నైబుతి పెరిగిన స్థలమును ఎటువంటి పరిస్థితులలోనూ కొనరాదు.
- పశ్చిమ నైబుతి పెరిగిన స్థలమును కొనరాదు.
- పశ్చిమము పెరిగిన స్థలమును కొనరాదు.
- పశ్చిమ వాయవ్యం పెరిగిన స్థలమును కొనవచ్చు. ఈశాన్య భాగంలో గుంత వుండడం చాలా మంచిది.
- వాయవ్యం పెరిగిన స్థలమును కొనరాదు.
- ఉత్తరం పెరగడం చాలా మంచిది. అలాగని ఉత్తరం పెరిగిన స్థలమును కొన్నవో ఈశాన్య భాగమును కోల్పోతాము గదా. కావున ఇటువంటి స్టలముల విషములో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఉత్తర ఈశాన్యం పెరిగిన స్థలమును నిరభ్యంతరముగా కొనవచ్చు.
ఇప్పటి వరకు మీరు కొనబోయే గృహములు మరియు స్టలముల గురించి తెలుసుకోవడం జరిగినది. ఇకపై కొన్న గృహములకు మరియు మీరు నివాసితమున్న గృహమునకు వాస్తు దోషమున్నచో వాటిని ఎలా తొలగించుకోవాలి. లేదా ఎలా వాటిని గమనించాలి మరియు దోషాన్ని ఎలా పోగొట్టాలి ఇతరత్రా విషయాలను పాయింట్స్ రూపకముగా తెలుసుకుందాము. మొదటిగా ఈశాన్య స్థలములు, గృహముల గురించి తెలుసుకుందాము.
ఈశాన్యము:
- దిక్కులలో ఈశాన్యం రాజు. కావున ఈశాన్య విషయమునకు వచ్చినపుడు అత్యంత జాగరూకతతో వ్యవహరించి పూర్తి జాగత్తలు మెళకువతో శద్ధగా ఏ మాత్రము అజాగ్రత్త లేకుండగా చూసుకోవాలి.
- రాజు సరిగా లేకపోతే రాజ్యము పతనము అవుతుంది. అలాగే ఈశాన్యం సరిగా లేకపోతే అందుండు వారు బ్రష్టు పట్టి పోవుదురు.
- ఒకటికి నాలుగు సార్లు ఈ విషయమును పదే పదే గుర్తుంచుకొని జాగ్రత్తలు తీసుకొన్నవో జీవనము
- భృహత్తరంగా గడిచి వంశం అభివృద్ధి అయ్యి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలతో తులతూగుతారు.
- గృహమునకు ఈశాన్య భాగమున మెట్లు వుండరాదు.
- ఈశాన్య భాగమున పల్లము కలిగి వుండడం అదృష్టాన్ని కొని తెచ్చుకొన్నట్లే.
- ఈశాన్య భాగమున అరుగులు వున్నచో వెంటనే కొట్టి వేయాలి.
- ఈశాన్య భాగమున గుంత లేనట్లయితే వెంటనే ఓ గుండ్రటి గుంతను ఏర్పాటు చేసుకోవాలి.
- ఈశాన్య భాగమున నడక వచ్చులాగున ద్వారములు ఏర్పాటు చేసుకోవాలి.
- ఈశాన్య భాగమున ద్వారము వుండడం చాలా మంచిదని గమనించాలి. అది తూర్పు ఈశాన్యం కాని, లేదా ఉత్తర ఈశాన్యం కాని ఏదైనా సరే ఈశాన్య భాగములో ద్వారం వుండడం చాలా మంచిదని గమనించాలి.
- ఈశాన్య భాగమున దిబ్బలు వుండడం జరిగితే వెంటనే తొలగించుకోవడం చాలా మంచిది, తక్షణ కార్యక్రమముగా దీనిని తొలగించుకోవడం చేయాలి.
తూర్పు :
- తూర్పు బాగము పల్లము కలిగి వుండడం మంచిది.
- తూర్పు బాగమున బావి వుండడం మంచిది. ఏ తొందర లేదు.
- తూర్పు బాగమున అరుగులు వున్నచో, ఈ అరుగులు ఇంటి గర్భముకన్నా ఎత్తుగా వున్నచో తగ్గించుకోవడం లేదా తొలగించుకోవడం చేయాలి.
- తూర్పు బాగమున ఇంటికి ఎదురు వచ్చునట్లుగా మెట్లు వుండడం తప్పు.
- తూర్పు ద్వారము ఉంచుకోవడం మంచిదే. నడక శుభకరము.
ఆగ్నేయం :
- ఆగ్నేయభాగము పెరిగి వుండడం తప్పు. తొలగించుకోవడం వెంటనే చేయాలి.
- ఆగ్నేయ భాగము ద్వారా నడక రావడం చాలా తప్పు. తగిన జాగ్రత్తలు తీసుకొని ఈశాన్య నడక వచ్చులాగున చేసుకొన్నచో మంచిదని గమనించాలి.
- ఆగ్నేయ భాగములోని భూమి మట్టము నైబుతి కన్నా ఎత్తు కలిగి వుండరాదు.
దక్షిణం :
- దక్షిణ భాగము పెరిగి వున్నచో తొలగించుకోవడం చేయాలి.
- దక్షిణ భాగమున కొళాయి గుంతలు గాని, పల్లము గాని వున్నట్లయితే పూడ్చివేసి అరుగులు నిర్మాణము చేయడం చాలా మంచిది.
- దక్షిణ భాగమున గుండా నీరు బయటికి వెళ్ళడం మంచిది కాదు. దక్షిణ ఆగ్నేయం ద్వారా నీరు బయటిక వెళ్ళడం చాలా మంచిది.
- గృహమునకు దక్షిణ నైబుతి ద్వారమున్నచో తొలగించుకోవాలి. వెంటనే ఆలస్యము చేయక ద్వారమును పూద్చివేసి గోడను నిర్మించుకోవాలి. ఇటువంటి పనులు చేయునపుడు ప్రయాణము చేయడం నిషిద్ధము.
- నైబుతి భాగములో ద్వారమున్నచో తొలగించుకొని అత్య ఆవశ్యకముగా గోడ నిర్మాణము చేసుకోవాలి. ఈ సమయంలో ప్రయాణము కూడా నిషిద్ధము.
- దక్షిణ నైబుతి, నైబుతి, పశ్చిమ నైబుతిల యందు గోడ నిర్మాణము చేయునపుడు ప్రయాణాలు చేయడం మంచిది కాదు.
- నైబుతి పెంపు కలిగి వున్నచో చాలా చెడ్డది. పెంపు కలిగిన స్థలమును గృహమునుండి వేరు చేసుకోవడం చేయాలి.
- పశ్చిమ భాగము పెంపు కలిగి వున్నప్పుడు దాన్ని తొలగించుకోవడానికి వీలు లేకపోతే భారీ వృక్షములను నాటుకోవడం, బలమైన రాతి అరుగుల నిర్మాణము చేయడం ఉత్తమమైన పద్ధతి.
- వాయవ్యం విషయములో తగిన జాగ్రత్తలు తీసుకోవలసి వుంటుంది.
- ముఖ్యముగా వ్యాపారస్థులు వాయవ్య విషయములో జాగ్రత్తలు తీసుకొనకపోతే తరువాత కాలములో అనేక బాధలకు గురి కావలసి వుంటుంది.
- స్థిరత్వము కలిగిన గృహస్థులును అస్థిర పరిచి బ్రష్టు పట్టించే శక్తి వాయవ్య భాగమునకు కలదు.
- సాధారణంగా ఎన్నో గృహాలకు వాయవ్యం పెరిగి వుండడం చూడవచ్చును. ఇది చాలా తప్పు. ఇటువంటి దోషాలను ఆలస్యము చేయక సరిచేయించు కోవడం చేయాలి.
ఉత్తరము :
- ఉత్తరం ద్వారా నడక సాగడం అత్యుత్తమము.
- ఉత్తరం పల్లమై వుండడం మహోత్తమము.
- ఉత్తరం గుండా వాడుక నీరు బయటకు వెళ్ళడం అద్భుతము.
- ఉత్తరం ద్వారం వుండడం బ్రహ్మాండము.
వాస్తు నిపుణులు "సురేష్" - 098481 14778