నారాయణుడు - బలచక్రవర్తి |
(గోదావరి పుష్కర మహత్యం)
గోదావరి ఉత్పత్తి (పుట్టుక)
రాక్షస వంశములో పుట్టిన బలిచక్రవర్తి మహావిష్ణు భక్తుడయ్యాడు కాని ఆతడు. తన రాక్షసత్వం మాత్రం మానలేదు. ముల్లోకాల్లో గూడా బలిచక్రవర్తి అంత దానవీరుడులేడు. అటువంటి బలి మహేంద్రునిపై దండెత్తి సురలోకాన్ని ఆక్రమించుకొన్నాడు. అష్టదిక్సాలురతో దేవేంద్రుడు అడవులు పట్టాడు ఆ సమయమున నారాయణుడు వామనావతారముతో బలచక్రవర్తిని మూడడుగులు భూమిని యాచించాడు. ఒకపాదం భూమి, రెండవ అడుగు ఆకాశం. మూడవపాదం బలిచక్రవర్తి శిరముపై నుంచి ఆతనిని పాతాళలోకానికి శ్రొక్కాడు నారాయణుడు. భూభాగమంతా నారాయణుని పాదరూపముగా కనుపిస్తుంది. ఆకశమంతా విష్ణుపాదము గానే కనుపిస్తుంది. అందువలన భూమి, ఆకాశములు శ్రీమన్నారాయణు పాదయుగముగా సమస్త లోకాలకూ కానవస్తుంది.
అప్పుడు బ్రహ్మ శంకరులిరువురూ కలిసి నారాయణుని దివ్య గ పాదాభిషేకము జరిపించాలని, యెంచి సేమస్త తీర్థాలనూ పిలిపించారు అప్పుడు. బ్రహ్మ తన దివ్య కమండలములో ఆ త్రీర్థములన్నింటినీ ఉంచి “శ్రీవిమ సహస్రనామస్తోత్రం” చేసి ముందుగా ఆ తీర్జాలను పవిత్రంగావించి, తరువాత నారాయణుని దివ్యపాదయుగాభిషేకం జరిపించారు. అప్పుడు బలిచక్రవర్తిపై నున్న కోపాగ్ని నారాయణుని పాదాలు శాంతించాయి. శ్రీ నారాయణుని పాదాబ్బ యుగాఖభిషేకము వలన పవిత్రమైన తీర్థమే గంగానది, ఆ మహానది 'రంగదుత్తుంగ తరంగాలతో పరవళ్ళు క్రొక్కుతుంది. అలా పరవళ్ళు డ్రాక్కుకున్న గంగమ్మతల్లిని పట్టుకోవడానికి యెవరూ సమర్థులు కావడం లేదు. యింక ఆ మహాతల్లి ము ల్లోకాల్నీ ముంచుతుందని యోచించి నారదాదులు పరమశివుని ప్రార్థించారు. దయూమయుడా శంకర భగవానుడు తన జటాజూటాడవి యందా గంగాదేవికి స్థానము కల్పించి నిలిపాడు. ఆతనిని ప్రార్థించి ఆతని మెప్పుగాంచి భూలోకవాసుల జీవితాల్ని నిలువదానికి భగీరధుడు గంగమ్మను, గౌతమమహర్షి పరమపావనియైన గోదావరిమాతను తీసుకునివచ్చారు. గౌతమముని వలన వచ్చినందున “గౌతమి” యని, “గోదావరి” యని పిలువబడింది.