Prahari Dwaram (Gates) and Vastu |
తూర్పు వీధి గృహమునకు :
- ప్రహారీ యందలి గృహము ముఖద్వారమునకు ఎదురుగా ప్రహారీకి గేటు వుండవలెను.
- గృహమునకు ఉత్తర (ప్రాంతములో ఎక్కువ ఖాలీ స్థలము వున్నప్పుడు గృహ ముఖద్వారమునకు ఎదురుగా ప్రహారీకి గేటు రావడం వల్ల ఆ గేటు నీచమగును.
- ఉత్తర ప్రాంతము ఎక్కువ ఖాలీ స్థలము వున్నచో తూర్పు వీధి గృహస్థులు ప్రహారీకి ఈశాన్య ప్రాంతములో గేటు వుంచుకోవడం శుభకరము.
- ఉత్తర ప్రాంతము ఎక్కువ ఖాలీ స్థలము లేనివారు గృహ ముఖ ద్వారమునకు ఎదురుగా ప్రహారీకి గేటు వుంచినను ప్రహారీలో ఈశాన్య (ప్రాంతమున రెండవ పెద్ద గేటును ఏర్పాటు చేసుకోవడం మంచిదని గమనించాలి.
- ప్రహారీ గేటుకు రేకును బవిగించకుండా గేటును ఉంచుకోవడం మంచిది.
- అవసరమనుకుంటే క్రింది అర్ధ భాగము ఇనుప రేకును వేసుకోవచ్చు.
- ప్రహారీకు సమానంగా అయినను లేదా ఒకటి రెండించులు తక్కువ అయినను గేటు వుండవచ్చును.
- ప్రహారీ ఎత్తుకన్నను గేటు ఎత్తును పెంచుకోవడం వద్దు.
- ఒకవేళ ఏదైనా డిజైన్ రూపకంగా ఎత్తును పెంచుకొదలిస్తే గేటు మధ్య భాగములో ఎత్తు వుండవచ్చును.
- ప్రహారీ గోడ మందమునకు మధ్యలో గేటు రావడం ఉత్తమము.
- ప్రహారీ గోడ లోపలనే గేటు బిగించుకోవడం అంత సబబు కాదు. ఇలా బిగిస్తే గేటు మందము గల తూర్పు ఈశాన్యమును మనము పోగొట్టుకున్న వారము అవుతాము. ఇది ప్రమాదకరము కాకపోయినను చిన్న పాటిగా ప్రభావము చూపించే అవకాశం మెండు.
దక్షిణ వీధి గృహమునకు :
- దక్షిణ వీధి గృహమునకు ప్రహారీలో గేటును ఉంచు సమయంలో చాలా మంది కొన్ని పొరపాట్లు చేస్తారు.
- అది ఏమంటే దక్షిణ ఆగ్నేయంలో గేటును ఉంచిన చాలని గృహము యందలి దక్షిణ ఆగ్నేయ ముఖద్వారమునకు ఎదురుగా ప్రహారీలో గేటును ఉంచరు. ఇది సరియైన విధానము కాదు.
- గృహ ముఖద్వారమునకు ఎదురుగా 'ప్రహారీలో గేటు ఉంచక కేవలం దక్షిణ ఆగ్నేయ ప్రాంతములో ప్రహారీకి గేటును ఉంచినచో ఆ గేటు ద్వారా నడుస్తూ గృహము యందలి ముఖ ద్వారమునకు చేరుకుంటాము కదా. తద్వారా ఆగ్నేయ వాయవ్య నడక ఓం 'ప్రధమములోనే ఏర్పడును.
- ఆగ్నేయ వాయవ్య నడకలు శుభకము కాదు. దీనిని నివారించుకోవడానికి గహ ముఖద్వారమునకు ఎదురుగా ప్రహారీకి గేటు ఉంచుకోవడం వల్ల ఈ దోషము పరిహారము అగును.
- గృహము యందలి దక్షిణ (ప్రాంతములో పెద్ద కాలువలు ఉన్నప్పుడు గృహమును కాలువ హద్దుకు అనుకొని ప్రక్కనే నిర్మ్ణంచుకోవడం వల్ల దక్షిణ ప్రాంతము పల్లమై అనేక రకాల ఇబ్బందులు గృహస్థులు అనుభవించవలసి వుంటుంది. కావున గృహమునకు ప్రహారీ నిర్మాణము అత్యావశ్యకము.
దక్షిణ వీధి గృహమునకు ముఖ ద్వారమునకు ఎదురుగా (ప్రవోరీకి గేటు వుంచినవుడు కొన్ని జాగత్తలు తీసుకోవాలి. అవి ఏమంటే:
- ప్రహారీ ఎత్తుకు సరిసమానంగా గేటు కూడా వుండాలి.
- గేటును బాగా మందంగా చేయించుకోవాలి.
- గేటుకు ఐరన్ కడ్డీలతో పాటుగా ఒక ఇనుప రేకును కూడా బిగించుకోవడం వల్ల మంచి ఫలితాలు వుంటాయి.
- ప్రహారీ గోడకు మధ్యమములో గేటును వుంచుకోవడం మంచిది.
- గోడ మందము చాలా తక్కువగా వున్నప్పుడు గేటును ప్రహారీ గోడకు లోపలి భాగము యుందు వేసుకోవచ్చు.
- అయితే గోడ పారును తప్పి గేటు బయటకు రాకూడదు. గోడ మందమునకు సరిసమానంగా వుండాలి.
- గేటును ఎంత మందముగా చేయించుకుంటే అంత మంచిది అని గమనించాలి. అలాగని గేటును తీయడానికి ఎక్కువ తినే పని పెట్టుకొనరాదు.
- గేటు ఎత్తు ప్రహారీ కన్నా ఎత్తుగా వున్నను ఏ దోషము లేదు. అయితే ఈ ఎత్తు అనేది రెండించులు లేదా మూడించులు దాటరాదు.
- ప్రహారీ ఎత్తు కన్నా గేటు తక్కువ ఎత్తులో వుండరాదు.
- ప్రహారీకి సమానంగా గేటు రావడం మంచిది.
- ఒకవేళ గేటుకు పూర్తిగా రేకును బిగించడానికి అనుకూలము లేకపోతే, లేక పూర్తి రేకును వేయడానికి మనసు అంగీకరించకపోతే కనీసం గేటులో అర్థభాగము అయిననూ క్రింది పక్క భాగంలో రేకును బింగించుకోవడం మంచిది.
పశ్చిమ ప్రాంత గృహమునకు :
- గృహము యందలి ముఖద్వారమునకు ఎదురుగా 'ప్రహారీలో గేటు వుంచుకోవడం వల్ల చాలా మంచిది.
- పశ్చిమ వాయవ్యం యందు గేటు వుంది కదా అని గృహము ముఖద్వారము నకు ఎదురుగా ప్రహారీలో గేటు వుంచుకోకపోవడం తప్పు.
- తప్పని సరిగా ప్రహారీకి గృహ ముఖద్వారమునకు ఎదురుగా గేటు ఉంచుకోవడం మంచిది.