వృద్ధాప్యం |
వృద్ధాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం. వృద్దులు అనగా అమ్మ గానీ నాన్నగానీ అమ్మగానీ తాతయ్యగానీ ఉంటారు. వీరు కాకుండా వృద్దులు ఉండరు. వ్యక్తికి ఉన్న తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు మరొకరికి మామగారు అవ్వవచ్చును అత్తగారు కావచ్చును. కానీ వారసుడు చుట్టూనే ఈ తల్లిదండ్రుల బంధం పెనవేసుకుని ఉంటుంది.
వ్యక్తికి ఉండే తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు వారసత్వంగా ఆస్తిని ఆచారాన్ని అందిస్తారు. వారిని వీరు చూస్తున్నంతకాలం వృద్దులకు కూడా కుటుంబంలో పిల్లలవలె అనిపిస్తారు. పిల్లలను చిన్ననాటి నుండి కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తున్నవారు పిల్లలకు పెళ్ళిచేసి చూసేవరకు శ్రమిస్తునే ఉంటారు. వారే తల్లిదండ్రులు మరియు వారి తల్లిదండ్రులు.
యుక్తవయస్సులోనే వివాహం అయితే తాతయ్య, అమ్మమ్మలు కూడా అవుతారు. తల్లిదండ్రులకు పిల్లలు అడ్డుకారు… ఆనందమయం అవుతారు. పిల్లలకు సేవ చేయడమే తల్లిదండ్రులు సంతోషంగా భావిస్తారు.
నడుస్తున్న పిల్లలు పడిపోకుండా పట్టుకోవడానికి సిద్దంగా ఉంటారు. పడిపోతే దెబ్బ తగిలిన చోట ఆప్యాయత అనే ఆయింట్ మెంట్ పూస్తారు. అమ్మ ఒడిలో ఓదార్పు నాన్న ఒడిలో ధైర్యం పొందే పిల్లలు ఎదిగి ఎదిగి తల్లిదండ్రులు వృద్దులైతే అడ్డుగా భావిస్తే, అంతకన్నా బాధాకరమైన విషయం వ్యక్తి జీవితంలో ఉండదని అంటారు.
మలమూత్రములు ఎత్తి పిల్లవానిని శుభ్రపరిచే అమ్మలో ఉండే సేవా దృక్పదం వలననే మనం ఈరోజు ఒక వ్యక్తిగా పరిణితి చెందాము. నాన్న చేసిన కష్టం వలన వచ్చిన కూడు తిని ఈ శరీరం ఇంతటిది అయ్యిందనే ఆలోచన మరిచివారిని కృతఘ్నులుగా చెబతారు.