Telugu Chandassu |
పద్య లక్షణాలు తెలిపెడి శాస్త్రమును ఛందోశాస్త్రము పిలుస్తారు.పద్యాలను వ్రాయడానికి ఉపయోగించే విధానాన్నిఛందస్సు అంటారు.గురు,లఘువులు కలయికచే ఏర్పడేవి గణాలు.ఇటువంటి కొన్ని గణముల కలయిక వలన పద్యము ఏర్పడుతుంది. గురువుని U తోనూ లఘువుని | తోనూ సూచిస్తారు.
లఘువులు - ఏక మాత్రాకాలంలో ఉచ్చరించబడే దానిని లఘువు అని అంటారు.(మాత్ర అనగా చిటికె వెయునంత కాలము) హ్రస్వాచ్చులు అన్నీ లఘువులు
ఉదా - ఆ,ఇ,ఉ,ఎ,ఒ హ్రస్వాచ్చులతో కూడిన హల్లులు లఘువులు.
ఉదా - క,చి,టు,తె,పొ హ్రస్వమయున సమ్యుక్తాక్షరాలు లఘువులు.
ఉదా - స్వ,క్ష్మి,త్రి,క్త మెదలయునవి హ్రస్వమయున ద్విత్వాక్షరాలు లఘువులు.
ఉదా - గ్గ,మ్మ,క్క మెదలయునవి వట్ర సుడి గల హ్రస్వాక్షరములు లఘువులు.
ఉదా - సృ,తృ,కృ మెదలయునవి
గురువులు - ద్విమాత్రా కాలములో ఉచ్చరించబడే దానిని గురువులు అని అంటారు. దీర్ఘాలన్నీ గురువులు
ఉదా - ఆ,ఈ,ఊ,ఏ,ఓ,ఐ ధీర్గాచ్చులుతో కూడిన హల్లులన్నీ గురువులు.
ఉదా - సై,కా,తే,చీ విసర్గతో కూడిన అక్షరములు గురువులు.
ఉదా - త:,దు:,అ: సున్నా (ం) కూడిన అక్షరాలు అన్నీ గురువులు.
ఉదా - అం,కం,యం,రం సంయుక్తాక్షరం ముందు ఉన్నవన్నీ గురువులు
ఉదా - లక్ష్మి,పద్మ ద్విత్వాక్షరమునకు ముందున్నవన్నీ గురువులు
ఉదా - అమ్మ,అక్క,పువ్వు పొల్లు హల్లులో కూడిన వర్ణములు గురువులు ఉదా - ఖ,ఘ,ఛ,ఝ
వృత్తముల
క్రమ సంఖ్య | గణములు | యతిస్థానము | ప్రతిపాదంలో అక్షరాల సంఖ్య |
---|---|---|---|
1 | ఉత్పలమాల - భరనభభరవ | 10 | 20 |
2 | చంపకమాల - నజభజజజర | 11 | 21 |
3 | శార్ధూలము - మసజసతతగ | 13 | 19 |
4 | మత్తేభము - సభరనమయవ | 14 | 20 |
5 | మత్తకోకిలము - రసజజభర | 11 | 18 |
6 | తరళము - సభరసజజగ | 12 | 19 |
7 | పంచారామరము - జరజరజగ | 10 | 16 |
8 | మాలిని - ననమయయ | 9 | 15 |
9 | మానిని - భభభభభభభగ | 13 | 22 |
10 | స్రగ్దర - మరభనయయయ | 8.15 | 21 |
11 | మహాస్రగ్దర - సతతనసరరగ | 9.16 | 22 |
12 | కవిరాజ విరాజితము - నజజజజజజవ | 12 | 23 |
తెలుగు చంధస్సు
క్రమ సంఖ్య | గణములు | పాదాలు | ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య | ప్రతిపాదంలోని గణాలు | యతి | ప్రాస |
---|---|---|---|---|---|---|
1 | ఉత్పలమాల | 4 | 20 | భ, ర, న, భ, భ, ర, వ | 10 వ అక్షరము | పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు |
2 | చంపకమాల | 4 | 21 | న, జ, భ, జ, జ, జ, ర | 11 వ అక్షరము | పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు |
3 | శార్ధూలము | 4 | 19 | మ, స, జ, స, త, త, గ | 13 వ అక్షరము | పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు |
4 | మత్తేభము | 4 | 20 | స, భ, ర, న, మ, య, వ | 14వ అక్షరము | పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు |
5 | మత్తకోకిలము | 4 | 21 | ర స జ జ భ ర | 11వ అక్షరము | పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు |
6 | తరళము | 4 | 21 | న భ ర స జ జ గ | 12వ అక్షరము | పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు |
7 | పంచారామరము | 4 | 21 | ననమయయ | 10వ అక్షరము | పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు |
8 | మాలిని | 4 | 21 | భభభభభభభగ | 9వ అక్షరము | పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు |
9 | మానిని | 4 | 22 | భభభభభభభగ | 14వ అక్షరము | పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు |
10 | స్రగ్దర | 4 | - | - | - | - |
11 | మహాస్రగ్దర | 4 | - | - | - | - |
12 | కవిరాజ విరాజితము | 4 | - | - | - | - |