Sandhya Vandanam |
సంధ్యావందన మూల ప్రక్రియ
సంధ్యావందన శ్లోకాలు చాలామటుకూ బుగ్వేదం. మరియు తైత్తిరీయ అరణ్యకాలనుంచి సేకరించి క్రోడికీకరించబడినాయి. అవన్నీ ఒక క్రమంలో అమర్చబడినాయి. సంధ్యావందన శ్లోక సంకలనకారుడెవరో తెలియదు. ఆ అజ్ఞాత మహానుభావుడి చరణాలకు నమస్కరించి సంధ్యావందన శ్లోకాల మూలం వాటి అర్థ తాత్పర్యములు తెలుసుకోవాలని ఈ ప్రయత్నం చేయుచున్నాను. కొన్నిశ్లోకాల మూలం నాకగవతం కాలేదు. నిష్టాతులైన బుధజనులు నా ఈసాహసమును మన్నించి ఏవైనా లోపాలు, సంస్కృత శ్లోకాల అనువాదంలో తప్పులేవైనా ఉంటే పెద్ద మనుసుతో క్షమించి తెలియచేసిన సరిదిద్దుకోగలను.
తెలుసుకొనవలసినవి
1. శ్రీ కృష్ణ పండితులవారు తాము వ్రాసిన సంధ్యాభాష్యంలో అర్హ్యప్రదానం, గాయత్రీజపం. ఉపస్థానం, : ఈ మూడింటిని సంధ్యావందన ప్రక్రియలో అతిముఖ్య మైన అంగాలుగా . పేర్కొన్నారు. మిగిలినవన్నీ అనుబంధక్రియలే. అతిముఖ్యమైన మూడంగాలలో అర్హ్య(ప్రదానం మరింత ప్రధానమైనది మరియు అత్యావశ్యకమైనది. తప్పనిసరిగా చేయవలసినది.
2. ప్రాచీన కాలంలో నది, సెలయేరు లేదా జలాశయాలలో మోకాలిలోతులో నిల్చుని సంధ్యావందనం చేసేవారు. అర్హ్యప్రదానం, గాయత్రీజపం, ఉపస్థానం కావించుకునేవారు. ఈరోజుల్లో ఇంటిలోనే సంధ్యావందనం చేసుకుంటూ ఉండటం వలన సంధ్యావందన క్రియలో అనుగుణంగా మార్పులు జరిగాయి. పద్మానసమేసుకునే పూర్తి క్రియ కానిస్తున్నారు. అదనంగా చాలా అనగా గాయత్రీ ముద్రలు, అంగన్యాస, కరన్యాసములు, తర్పణ కార్యక్రమం సంధ్యావందనంతో కలిపేసుకున్నారు.
3. వేదకాలంలో ప్రకృతి, పంచభూతాలు (భూమి, జలం, అగ్ని, వాయు, ఆకాశం), సూర్య చంద్రులు కనుపించు దైవాలుగా (దైవశక్తులు) పరిగణించబడినాయి. సంధ్యావందనంలో సహజంగా వీటి పూజలే చూస్తాము. కాలక్రమేణా, వీటన్నిటికీ మూలమైన పరమాత్మను ఆరాధిస్తున్నాము.
4. బుగ్వేదము రెండు సంకలనములుగా లభ్యమౌతుంది. ఒక సంకలనములో బుగ్వేదం 8 అష్టకాలుగా విభజింపబడినది. ప్రతి అష్టకంలో అధ్యాయాలు, ప్రతి ఆధ్యాయంలో వర్గాలు, ప్రతి వర్గంలో మంత్రాలు ఉంటాయి. రెండవ సంకలనంలో బుగ్వేదం 10 మండలాలుగా విభజింపడినది. ప్రతి మండలంలో అనువాకాలు, ప్రతి అనువాకంలో సూక్తులు, ప్రతి సూక్తంలో మంత్రాలు ఉంటాయి... రెండు సంకలనాలలోకూడా ఒకే మంత్రములు మొత్తం 10,552 ఉన్నాయి.
5. సంధ్యావందన సమయం :ః సూర్యోదయానికి ముందు మూడు ఘడియలు (గంట 20 నిమిషములు), సూర్యాస్తమయం తరువాత మూడు ఘడియల సమయం మంచిది. అలా సాధ్యం కానప్పడు సూర్యోదయానంతరం ఆరు ఘడియల (2 గంటల 20 నిమిషములు) సమయం, సూర్యాస్తమయం తరువాత ఆరు ఘడియల సమయం లోనైనా ముగించవలయును.
6. మూడు ఆచమనాలలో ఏదైనా ఆచరించవచ్చును. శ్రౌతాచమనంలో శుద్ది క్రియ గాయత్రీ మంత్రం, సంధ్యావందనంలో ఉన్న మార్దన శ్లోకాలతో కానిస్తారు. శుద్ది క్రియ పురాణాచమనం కేశవనామాలతో కానిస్తారు. సృత్యాచమనంలో శ్లోకాలేమీ ఉండవు, మౌనంగానే శుద్ధిక్రియ కానిస్తారు. అన్నింటిలో శుద్ధిక్రియ ఒకలాగానే ఉంటుంది. పురాణామచనం ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది.
7. పురాణామచనం చేయు పద్దతి
ఓం కేశవాయ స్వాహా నారాయణాయ స్వాహా మాధవాయ స్వాహా అని ముమ్మారు జలపానము చేయవలయును.
గోవిందాయ నమః అని యొడమఅరచేతిని కుడిఅరచేతితోను, విష్ణవే నమః అని కుడిఅరచేతిని ఎడమఅరచేతితోను ప్రక్షాళనము చేసికొనవలయును.
మధుసూదనాయనమః బొటనవేలితో పై పెదవిని స్పృశించవలను
(ఆవికమాయనమః క్రింది పెదవిని స్పృశించవలెను
వామనాయనమః కుడి కపాలమును స్పృశించవలెను
శ్రీధరాయనమః ఎడమ కపాలమును స్పృశించవలెను
హృషీ కేశాయనముః చేతులు జోడించవలెను
పద్యునాభాయనమః రెండు మోకాళ్ళను స్పృశించవలను
దామోదరాయనమః శిరస్సును స్పృశించవలను
సంకర్ణణాయనమః అన్నివేళ్ళతో గడ్డమును స్పృశించవలను
వాసుదోవాయనమః ముక్కు కుడి భాగము స్పృశించవలను
(పద్యువ్నూయనమః ముక్కు ఎడమ భాగము స్పృశించవలను
అనిరుధాయనమః కుడి కన్నును స్పృశించవలెను
వురుషోత్తమాయనమః ఎడమ కన్నును స్పృశించవలను
అధోక్షజాయనమః కుడి చెవిని స్పృశించవలను
నారసింహాయనమః ఎడమ చెవిని స్పృశించవలను
అచ్యుతాయనమః బొడ్డును స్పృశించవలను
జనారనాయనమః వక్ష స్థలమును స్పృృశించవలను
ఉ పేరద్రాయనమః శిరస్సును స్పృశించవలను
హరయేనమః కుడి భుజమును స్పృశించవలను
శ్రీరృష్టాయనమః ఎడమ భుజమును స్పృశించవలెను
8. ప్రాణాయామము చేయు పద్దతి
ప్రాణాయామములో పూరకము, కుంభకము, రేచకము అని మూడు భాగములు. ముక్కులోనుంచి వాయువు పీల్చుకొనుట పూరకము, పీల్చుకొనిన వాయువును లోనే ఉంచుకొనుట కుంభకము, ఆ తరువాత పీల్చుకొన్న వాయువును విడిచివేయుట 'రేచకము. ఎడమ ముక్కుతో పూరకము, కుంభకంలో మంత్ర జపం, కుడి ముక్కుతో 'రేచకం చేయవలయును.
అన్ని వేళ్ళతో చేసే ప్రాణాయామం ప్రణవ ముద్ర అని అంటారు. ఇది గృహస్థులు, వానప్రస్థులు చేసే ప్రాణాయామం. బొటనవేలితో కుడిముక్కు, కనిష్టికనామికలతో ఎడమ ముక్కు బంధించి చేసే ప్రాణాయామం ఓంకారముద్ర అని అంటారు. ఇది బ్రహ్మచారులు, యతీశ్వరులు చేసే
పాణాయామం.
9. ఆచమనంచేయు పద్దతి
గోకర్ణాకృతి హస్తములో మినుపగింజ మునుగునంత జలముంచుకుని బ్రహ్మతీర్థముతోనే ఆచమనము చేయవలయును.బొటనవేలిని మధ్యవేలి క్రింది కణుపుతాకునట్లు వంచి. ఆబొటనవేలిపై చూపుడువేలు (తర్జని) వంచి, తక్కిన వేళ్ళు చాచినచో గోకర్ణాకృతి వచ్చును. ఆచమనము శబ్దము రాకుండా చేయవలెను.
10. బ్రహ్మతీర్ధము
- తీర్ధాలు నాలుగు విధములు. అజచేయి క్రింది భాగము మణికట్టుమీదుగా బ్రహ్మ తీర్థం తీసుకుంటారు.
- కుడిచేయి చిటికెనవేలువైపువంచి జలధార కావించిన అది బుషితీర్ణమగును.
- నాలుగువేళ్ళమీదుగా క్రందికిజారు జలధార దేవతీర్థమగును. .
- కుడిఅఅచేతిని చూపుడువేలువైపు వంచి చూపుడువేలు బొటనవేలు మధ్యప్రదేశంద్వారా
- జలధార గావించినచో అది పితృతీర్థమగును.
- ఆచమనంలో ఎల్లవేళలా బ్రహ్మతీర్థమే తీసుకోవలెను. బ్రహ్మతీర్థం పెతృతీర్థ స్థానంను
- తగలకూడదు. గోకర్ణాకృతిలో ఇది సాధ్యమౌతుంది.
- పురాణాచమనం సంధ్యావందనం ప్రారంభం, అంతంలో చేయవలయును. మధ్యలో
- కేశవనామాలతోనే పూర్తిచేయవచ్చు.
11. సంకల్పము
పద్మాసనంవేసుకుని ఎడమ అజఅచేయి. కనుపించునట్లు _ కుడితొడపై ఉంచికుడిఅజచేయి ఎడమచేయిపై ఉంచి సంకల్పం చెప్పవలయును. సంకల్పములో దేశ,కాలములను తెలుపుచున్నప్పుడు దినతిథిని, తిథిగా సంబోధించకూడదు. అది కేవలంశ్రాద్ద సమయమప్వుడే చేయవలయును. సంధ్యావందన సమయంలో ప్రథమాయాం, ద్వితీయాం, ... దశమ్యాం... గా చెప్పవలయును.
12. బుగ్వేదు యజుర్వేద అపౌరుేషేయములు, అమూలములు. అనగా భగవంతుని మఖతః వెలువడినవి. మంత్ర పఠనం చేయునప్పుడు ఆ మంత్రాలకాద్యు లైన దైవము, ఆ మంత్రదేవతను ప్రప్రథంగా దర్శించి (దష్టలైన బుషులు, మునులను, మంత్ర ఛందస్సులను వివరంగా స్మరించవలయును
13. గాయత్రి మహామంత్రం
ఈ జగత్తులోని ఏడు లోకములుః భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము అన్నియూ (ఓంకార) బ్రహ్మ స్వరూపములే. ఏదేవుడు మాయొక్క బుద్దివృత్తులను. తత్తద్విషయములను గ్రహిచుటకు పేరేపించునో, అట్టి ఉదయాస్తమయకల్పనలతో లోకయాత్ర నడిపించుచున్న సూర్యభగవానునియొక్క _ (సూర్యమండలాంతర్వ ర్తియెన పరమేశ్వరునియొక్క) సర్వోత్కృష్టమైన, దివ్యలేజస్సును ధ్యానింతుముగాక. (full-width)