Giloy |
Tinospora cordifolia |
తిప్పతీగను తులసిని కలిపి తింటే స్వైన్ ఫ్లూను ఎదుర్కునే రోగనిరోధక శక్తి శరీరానికి చేకూరుతుంది. అలాగే స్వైన్ ఫ్లూ వచ్చినా తగ్గించగల దివ్యౌషధమిది. దీనినే ఈమధ్య యోగా గురువు ప్రసిద్ధ ఆయుర్వేద వైద్య పరిశోధకులు రామ్ దేవ్ బాబా ఈవ్యాధి నివారణకు మందుగా సూచించారు. దీనిని కాడను ఒకటిరెండంగుళాల ముక్కను ,పది తులసి ఆకులతో కలిపి పొద్దుటే నమిలి తినాలి. అలా నాలుగైదు రోజులకు ఒకసారి తీసుకోవాలి.వ్యాధిసోకినప్పుడు ఎక్కువమోతాదులో తీసుకోవాలి. అద్భుతంగా పనిచేస్తుంది.
దీనిని మన పూలకుండి లో నాటుకుంటే నీరుపోస్తుంటే అదేపెరుగుతుంది .కనుక పెంచటము తేలికే . పుట్టకొక్కులు ,తేనె పల్లెటూర్లనుంచి తెచ్చి అమ్మే యానాదులకు ఈమూలిక బాగ పరిచయం కనుక వారినడిగితెప్పించుకోవచ్చు. లేదా మీకు పల్లెలలో ఎవరన్నా చుట్టాలుంటే వారినడిగినా పంపిస్తారు.తులసి మొక్క ఎలాగూ మీదగ్గరలో దొరుకుతుంది ..
..Dr.Vandana Seshagirirao
గమనిక:
పైనుదహనించిన చికిత్స విధానాలు మనిషి అవగాహన కొరకే, మరింత సమాచారం కోసం వైద్యులను సంప్రదించగలరు.