మాటల గారడి - Maatala Garadi |
మాటల గారడి
- రాజు కాని రాజు - తరాజు
- కారము కాని కారము - ఉపకారం
- రాగి కాని రాగి - బైరాగి
- కోడి కాని కోడి - పకోడి
- తారు కాని తారు - జలతారు
- మామ కాని మామ - చందమామ
- తాళి కాని తాళి - ఎగతాళి
- దార కాని దార - పంచదార
- నత్త కాని నత్త - మేనత్త
- జనము కాని జనము - భోజనము
- రాయి కాని రాయి - కిరాయి, పావురాయి
- నాడ కాని నాడ - కాకినాడ
- టూరు కాని టూరు - గుంటూరు
- రెంటు కాని రెంటు - కరెంటు
- మొగ్గ కాని మొగ్గ - పిల్లిమొగ్గ
- కాయ కాని కాయ - తలకాయ, మెడకాయ
- దేహము కాని దేహము - సందేహము
- హారము కాని హారము - వ్యవహారము
- శిక్ష కాని శిక్ష - బాలశిక్ష
- దేశం కాని దేశం - సందేశం
- తార కాని తార - సితార
- దారము కాని దారము - మందారము
- కీలు కాని కీలు - వకీలు
- సందు కాని సందు - పసందు
- కాలు కాని కాలు - టీకాలు
- కారు కాని కారు - షికారు
- పాలు కాని పాలు - కోపాలు, తాపాలు, మురిపాలు.
- కులం కాని కులం - గురుకులం
- జారు కాని జారు - బేజారు
- గోళం కాని గోళం - గందరగోళం
- పతి కాని పతి - పరపతి
- రసం కాని రసం - నీరసం
- కర్ర కాని కర్ర - జీలకర్ర
- రాళ్ళు కాని రాళ్ళు - కీచురాళ్ళు
- కట్టు కాని కట్టు - తాకట్టు
- దారి కాని దారి - గోదారి
- బడి కాని బడి - రాబడి
- వరం కాని వరం - కలవరం
- గ్రహం కాని గ్రహం - అనుగ్రహం
- మందు కాని మందు - కామందు
- కులం కాని కులం - కాకులం
- గొడుగు కాని గొడుగు - పుట్ట గొడుగు
- తాళం కాని తాళం - పాతాళం
- మాట కాని మాట - టమాట
- రాణి కాని రాణి - పారాణి
- వెల కాని వెల - కోవెల
- లత కాని లత - కలత
- మత్తు కాని మత్తు - గమ్మత్తు