కృష్ణార్జునులు |
కర్మయోగము - Karma Yogam -శ్లోకము - 11
దేవాన్ భావయతానేన తే దేవా భావయన్తు నః |
పరస్పరం భావయన్తః శ్రేయః పరమవాప్స్యథ ॥
దేవాన్ - దేవతలు; భావయతః - ప్రసన్నులై; అనేన - ఈ యజ్ఞం ద్వారా; తే - ఆ; దేవాః - దేవతలు; భావయన్లు - ప్రీతిని కలిగిస్తారు; వః - మీకు; పరస్పరం - పరస్పరము; భావయన్తః - ప్రీతి కలిగించుకోవడం; శ్రేయః - శ్రేయస్సు; పరం - మహోన్నతమైన; అవాస్స్యథ - నీవు పొందుతావు.
యజ్ఞములచే ప్రసన్నులై దేవతలు కూడ మీకు ప్రీతిని కలిగిస్తారు. ఆ విధంగా మానవులు, దేవతల మధ్య పరస్పర సహకారముతో అందరికీ శ్రేయస్సు కలుగుతుంది.
భాష్యము. ; భౌతికకలాపాలను నిర్వహించడానికి అధికారము కలిగిన పాలకులే దేవతలు. ప్రతీజీవుని దేహపోషణకు అవసరమైనట్టి గాలి, వెలుతురు, నీళ్ళు, ఇతర వరాలను సమకూర్చే కార్యము దేవతలకు అప్పజెప్పబడింది. వారు భగవంతుని వివిధ దేహాంగాలలో ఉన్నట్టి అసంఖ్యాక సహాయకులు. వారి సుఖదుఃఖాలు మానవుడు చేసే యజ్ఞాల మీద ఆధారపడి ఉంటాయి. కొన్ని యజ్ఞాలు కొందరు ప్రత్యేకమైన దేవతల ప్రీతి కొరకే ఉద్దేశించబడినా అన్ని యజ్ఞాలలో విమ్ణభగవానుడే ప్రధాన భోక్తగా అర్చింపబడతాడు. స్వయంగా శ్రీకృష్ణుడే అన్ని రకాల యజ్ఞాలకు భోక్త యని భగవద్గీతలో కూడ చెప్పబడింది. “భోక్తారం యజ్ఞతవసాం”. కనుక యజ్ఞపతి యొక్క చరమ సంతృప్తే అన్ని యజ్ఞాల ప్రధాన ఉద్దేశము. ఈ యజ్ఞాలను చక్కగా నిర్వహించినవుడు వివిధ శాఖలకు అధిపతులైన దేవతలందరు సహజంగానే సంతృప్తి చెందుతారు. ఆ విధంగా వ్రకృతివన్తువుల సరఫరాలో ఎటువంటి కొరత ఉండబోదు.
యజ్ఞనిర్వహణ అనేకమైన. ఇతర. లాభాలను చేకూరుస్తూ చివరకు భవబంధ విముక్తిని కూడ కలిగిస్తుంది. యజ్ఞనిర్వహణ ద్వారా సమస్త కర్మలు శుద్ధివడతాయి. ఇదే వేదాలలో “ఆహారశుద్దా సత్త్వశుద్ధిః సత్త్వ శుద్ధా ధ్రువా స్కృతిః, సృృతిలంభే సర్వగ్రంథీనాం వివ్రమోక్షః” అని చెప్పబడింది. యజ్ఞము చేయడం ద్వారా ఆహార పదార్థాలు. పవిత్రమౌతాయి.. పవిత్రమైన ఆహారము. తినడం ద్వారా మనిషి అస్తిత్వము పవిత్రమౌతుంది.. అస్తిత్వము వవిత్రం కావడం ద్వారా స్కృతిలోని సూక్ష్మ గ్రంథులు పవిత్రమౌతాయి. స్మృతి పవిత్రమైనప్పుడు మనిషి మోక్షమార్గం గురించి. ఆలోచింపగలుగుతాడు. ఇవన్నీ కలిపి నేటి నమాజానికి. అత్యవసరమైనట్టి కృష్ణభక్తిభావనకు దారితీస్తాయి.
శ్లోకము - 12
ఇష్టాన్ భోగాన్ హీ వో దేవా దాస్యన్తే యజ్ఞభావితాః |
తైర్దత్తానవ్రదాయైభ్యో యో భుజ్తే స్తేన ఏవ సః ॥
ఇష్టాన్ - కోరినట్టి; భోగాన్ - జీవితావసరాలను; హి - నిక్కముగా; వః - మీకు; దేవాః - దేవతలు; దాస్యన్తే - సమకూరుస్తారు; యజ్ఞభావితాః - యజ్ఞాలచే సంతృప్తిచెంది; తైః - వారిచే; దత్తాన్ - ఇవ్వబడినవాటిని; అప్రదాయ - సమర్పించకుండ; ఏభ్యః - ఆ దేవతలకు; యః - ఎవ్వడైతే; భుజ్త్కే - అనుభవిస్తాడో; స్తేనః - చోరుడు; ఏవ - నిక్కముగా; నః - వాడు.
విధ జీవితావసరాలకు అధిపతులైన దేవతలు యజ్ఞనిర్వహణ ద్వారా సంతృప్తిచెంది మీకు అన్ని అవసరాలను సమకూరుస్తారు. కాని అటువంటి కానుకలను తిరిగి దేవతలకు సమర్పించకుండానే భోగించేవాడు నిశ్చయముగా చోరుడు అవుతాడు.
భావ్యము : విమ్ణభగవానుని పక్షాన వన్తుసరఫరా చేసే అధీకృత వ్రతినిధులే దేవతలు. కనుక విధ్యుక్త యజ్ఞాల నిర్వహణ ద్వారా వారిని తప్పక సంతృప్తిపరచాలి. వేదాలలో నానారకాల దేవతల కొరకు నానారకాలైన యజ్ఞాలు చెప్పబడ్డాయి. కాని తుట్టతుదకు అవన్నీ దేవదేవునికే సమర్పించబడతాయి. భగవంతుడంటే ఎవరో తెలియనివానికే దేవతల యజ్ఞము చెప్పబడింది. మనుషుల వివిధ గుణాలను అనుసరించి వేదాలలో వివిధ యజ్ఞాలు చెప్పబడినాయి. వివిధ దేవతార్చనము కూడ అదే ఆధారముగా, అంటే వివిధ గుణాల ననుసరించి. చెప్పబడింది. ఉదాహరణకు మాంసభక్షకులకు ప్రకృతి ఘోరరూవమైన కాళికాదేవి వూజ ఉపదేశించబడింది; ఆ దేవి. ఎదుట. జంతు బలి చెప్పబడింది. కాని సత్త్వగుణంలో ఉన్నవారికి విమ్గుభగవానుని దివ్యార్చనమే ఉపదేశించ 'బడింది.. కాని. తుట్టతుదకు అన్ని యజ్ఞాలు. క్రమంగా దివ్యస్థితికి చేరుకోవడానికే ఉద్దేశించబడ్డాయి. సామాన్యజనులకు పంచ మహాయజ్ఞాలని తెలియబడే కనీనం ఐదు యజ్ఞాలు తప్పనినరియైనవి.
అయినా మానవసంఘానికి అవసరమైన జీవనావళ్యకాలన్నీ భగవత్రతినిధులైన దేవతల చేతనే సరఫరా చేయబడతాయని మనిషి తప్పక తెలిసికోవాలి. ఎవ్వడూ దేనినీ తయారు చేయలేడు. ఉదాహరణకు మానవుల ఆహారపదార్థాలన్నింటినీ తీసికోండి. ఈ ఆహారపదార్థాలలో నత్త్వగుణంలో ఉండే మానవులకు ధాన్యము, పండ్లు, కూరగాయలు, పాలు, చక్కెర మొదలైనవి, మాంసాహారులకు మాంసము వంటివి ఉంటాయి. వీటిలో ఏదీ కూడ మానవులచే తయారు కాదు. ఇక తిరిగి వేడి, వెలుతురు, నీళ్ళు, గాలి వంటివి ఉదాహరణగా తీసికోండి. ఇవి కూడ జీవనావశ్యకాలే. వీటిలో ఏదీ కూడ మానవనంఘంచే తయారు చేయబడదు. భగవంతుడు లేకుండ పువ్మలంగా సూర్యకాంతి, వెన్నెల, వర్షము, గాలి మొదలైనవి లభించవు. అవి లేనిదే మనిషి జీవించలేడు. అంటే మన జీవితము భగవంతుని. నుండి లభించేవాటి పైననే ఆధారపడి ఉంటుంది. చివరకు మనము నడిపే కర్మాగారాలకైనా లోహము గంధకము, పాదరసము, మాంగనీసు, ఎన్నో అవసరమైన ముడి పదార్థాలు మనకు అవసరమౌతాయి. ఇవన్నీ భగవత్ర్రతినిధుల చేతనే సరఫరా చేయబడతాయి. ఆత్మానుభూతి ప్రయోజనానిక్టై మనలను తగినట్లుగా, ఆరోగ్యవంతంగా ఉంచుకునేందుకు సద్వినియోగం చేసికుంటామనేదే వారి ఉద్దేశ్యం. ఇదే చరమ జీవితగమ్యానికి, అంటే భౌతికజీవన సంఘర్షణ నుండి ముక్తికి దారితీస్తుంది. ఈ జీవితలక్ష్యము యజ్ఞనిర్వహణ ద్వారా పొందబడుతుంది. కాని మనం మానవజన్మ ఉద్దేశాన్ని మరవి కేవలము ఇంద్రియ భోగార్థము భగవత్ర్రతినిధుల నుండి అన్నీ తీసికొని సంసారంలో మరింతగా చిక్కుబడితే (అది సృష్టి ప్రయోజనము కానేకాదు నిక్కముగా. దొంగలమౌతాము. అందువలన ప్రకృతి నియమాల ద్వారా శిక్షించబడతాము. దొంగల సమాజము ఏనాడూ సుఖవంతము కాబోదు. ఎందుకంటే వారికి జీవితంలో లక్ష్యమే. ఉండదు. వరమలెౌకికులైన దొంగలకు చరమ జీవితగమ్యమే ఉండదు. వారు కేవలము, ఇంద్రియభోగము వైవుకు నడుస్తారు. యజ్ఞాలను నిర్వహించే జ్ఞానము వారికి ఉండదు. కాని శ్రీవైతన్యమహావ్రభువు అత్యంత సులభమైన యజ్ఞాన్ని, అంటే సంకీర్తన యజ్ఞాన్ని ఆవివ్యరించారు. కృష్ణభక్తిభావన సిద్ధాంతాలను అంగీకరించే ప్రపంచంలోని ఎవ్వరైనా దానిని నిర్వహింపగలుగుతారు.