యముడు - నచికేతుడు |
బాలల కథలు
1. నచికేతుడు
రచన: స్వామీ రంగనాథం - రామకృష్ణ మఠం
భారతీయులమైన మనం ఎంతో గొప్పవాళ్ళం. మన దగ్గర చాలా గొప్ప సంపద ఉంది. ప్రపంచంలో అందరికీ పంచిపెట్టినా అది తరగదు. కానీ అది ఎక్కడ ఉందో మనం తెలుసుకోవాలి. అటువంటి సంపదను చిన్నతనంలోనే సంపాదించినవాడు నచికేతుడు. వేదాలలోని కఠలోపనిషత్తులో ఇతణ్సి గురించి చెప్పబడింది.
నచికేతుడి తండ్రి వాజశ్రవసుడు. అతడు ఒకసారి విశ్వజిత్తు అనే యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం చేసేవారు తమకున్న ఆస్తి మొత్తాన్ని ఇతరులకు దానం చెయ్యాలి. ఆ నియమం ప్రకారం వాజశ్రవసుడు దానాలు చేస్తున్నాడు. ఆ కాలంలో ముఖ్యమైన ఆస్తి గోవులు. ఆ గోసంపదనే వాజశ్రవసుడు దానం చేస్తున్నాడు. అయితే, మంచి ఆవుల్ని దానం చెయ్యడం లేదు.
నచికేతుడు చాలా డశ్రద్ధగలవాడు. ధర్మంమీద అతడికి గొప్ప విశ్వాసం ఉందేది. తండ్రి వట్టిపోయి, చావడానికి సిద్ధంగా ఉన్న ఆవుల్ని దానం చెయ్యడం గమనించాడు. అటువంటి దానాల వలన తన తండ్రికి చేటు కలుగుతుందని భావించాడు. తండ్రిని ఈ దోషం నుంచి తప్పించడం తన బాధ్యత అని అనుకున్నాడు. అందుకని తండ్రి దగ్గరికి చేరి, “తండ్రీ! నన్ను ఎవరికి దానమిస్తావు?” అని అడిగాడు. తండ్రి పట్టించుకోలేదు. నచికేతుడు రెండవసారి, మూడవసారి కూడా అదే విధంగా ప్రశ్నించాడు. తండ్రికి కోపంవచ్చి, “నిన్ను యముడికి దానమిస్తున్నాను, పో!” అని గద్దించాడు. వెంటనే నచికేతుడు, “తండ్రీ! మన పూర్వులు సత్యాన్ని పాటించి గొప్పవారయ్యారు. నువ్వు కూడా ఆడినమాట నిలబెట్టుకో!” అని కోరాడు. వాజథభవసుడు తాను తొందరపాటుతో నోరుజారి అన్న మాటను గురించి బాధపడ్డాడు. అయినా ఆడినమాటను నిలబెట్టుకుని ఆ బాలుణ్ణి యముడి వద్దకు పంపాడు.
నచికేతుడు యముడి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన ఇంటిలో లేడు. నచికేతుడు మూడు రోజులపాటు ఆయన కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. నాల్గవ రోజు యమధర్మరాజు ఇంటికి రాగానే మంత్రులు, “స్వామీ! అగ్నిహోత్రంలాగా వెలిగిపోతున్న ఒక బాలుడు మూడురోజులుగా మీకోసం వేచి ఉన్నాడు” అని చెప్పారు. వెంటనే యమధర్మరాజు అతడికి తగిన మర్యాదలు చేసి, “నాయనా! నీ రాకవల్ల నాకు శుభం కలుగుతుంది! నీవు మూడురోజులుగా ఉపవాసం చేస్తున్నావు. అందుచేత నీకు మూడు వరాలు ఇస్తాను, కోరుకో!” అన్నాడు.
మొదటి వరంగా నచికేతుడు, “నా తండ్రికి మనశ్శాంతి కలిగి, నేను తిరిగి వెళ్ళినప్పుడు నన్ను (ప్రేమించేలా చెయ్యమని ప్రార్థించాడు. యమధర్మరాజు “సరే” అని రెండవ వరం కోరుకోమన్నాడు. “స్వామీ! మనుష్యుడు ఏ యజ్ఞం చెయ్యడం వల్ల స్వర్గసుఖాలు పొందుతాడో సెలవియ్యండి?” అని కోరాడు. యముడు వివరంగా అతనికి ఆ విధానాన్ని బోధించి, “కుమారా! నీ శ్రద్ధకు ఎంతో సంతోషించాను. ఇప్పుడు నేను వివరించిన ఈ యజ్ఞం ఇక నుండి నీ పేరుతో 'నాచికేతయజ్ఞం' అని పిలువబడుతుంది. అంతేకాదు, నా ప్రేమకు చిహ్నంగా ఎప్పటికీ కాంతి తగ్గని ఈ రత్నాల హారాన్ని కూడా నీకు ఇస్తున్నాను, ఇక మూడవ వరాన్ని కోరుకో!” అన్నాడు.
అప్పుడు నచికేతుడు, “స్వామీ! మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడు? కొందరు ఉండదని అంటారు, కొందరు ఉంటాడని అంటారు. దయతో నాకు ఈ రహస్యాన్ని బోధించండి!” అని కోరాడు. అప్పుడు యమధర్మరాజు, “నాయనా! ఇది దేవతలు ఆలోచించదగిన ప్రశ్న నీవు చిన్నవాడివి! అటువంటి విషయాలు నీకెందుకు? నువ్వు కోరినంతమంది కుమారుల్ని మనుమల్నిి లెక్కలేనంత ధనాన్ని కావలసినంత భూమిని, అనుభవించడానికి కోరినంత ఆయువునూ, యౌవనాన్నీ ఇస్తాను, కోరుకో!” అన్నాడు. అప్పుడు నచికేతుడు, “స్వామీ! నేను కోరిన దానికి బదులు ఇన్ని ఇస్తానంటున్నారు కాబట్టి నేనడిగింది వీటన్నిటికంటే గొప్పదై ఉండాలి! కాబట్టి దాన్నే నాకు ఇవ్వండి!” అని ప్రార్థించాడు.
నచికేతుణ్ణి యముడు ఇంకా పరీక్షించదలచుకుని ప్రక్కనున్న తెర తొలగించి, “కుమారా! ఇటు చూడు! మహా సౌందర్యరాశులైన స్త్రీలు ఉన్నారు. లెక్కలేనన్ని రథాలు, గుర్రాలు ఇక్కడ ఉన్నాయి. వీటిలో నీకు కావలసినన్ని తీసుకుని, కోరినంతకాలం అనుభవించు!” అన్నాడు. అప్పుడు నచికేతుడు, “స్వామీ! ఇవన్నీ ఎంతోకొంత కాలానికి నళించేవే! పైగా వీటిని కావాలంటే నేనే సంపాదించుకోగలను. కాబట్టీ వీటిని మీవద్దే ఉంచుకోండి! నచికేతుడు ఇంకొకటి కోరడు!” అన్నాడు. నచికేతుడికి గల వైరాగ్యానికి, శ్రద్ధకు, చలించని బుద్ధికి సంతోషించి యమధర్మరాజు అతడికి పరతత్తాన్ని బోధించాడు. అదే వేదాలలో “కఠోపనిషత్తు అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది.
నచికేతుడు తన తండ్రికి మంచిచేశాడు. అతనివల్ల నాచికేత యజ్ఞం అనే క్రొత్త యజ్ఞం తయారయింది. బ్రహ్మవిద్య వలన ప్రపంచానికే మహోపకారం చేశాడు. నచికేతుడు చూపించినటువంటి (శ్రద్ధను అవలంబించి, మన పెద్దలు మహోన్నతమైన సంస్కృతి రూపంలో మనకు వారసత్వంగా అందించిన మహాభాగ్యాన్ని అనుభవించడానికి మనం కూడా ప్రయత్నించాలి!