సీమంతంలో గాజులు ?
ఏ శుభకార్యములో లేని విధంగా సీమంతం సమయములో గర్భినికి అందరు గాజులు తొడుగుతారు . ఐదోతనంతో పాటు పండంటి బిడ్డను కనాలని ఆశిర్వాదిస్తారు . అలా గాజులు తొడిగే కార్యములో చక్కని పరమార్థం దాగుంది .
గర్భం ధరించిన స్రీ గర్భకోశం మీద కావలసినంత జీవనాడుల ఒత్తిడి కావాలి. అందుకే ఏడో నెలలో శుభకార్యము చేస్తూ అయినవాళ్ళంత గాజులు తొడుగుతారు . చేతుల్లో నరాలకి, గర్భకోశానికి అవినాభావ సంబంధం ఉంది . అలా ఎక్కువగా గాజులు తోడిగించుకోవటం ద్వార గర్భకోశంపై సరియైన ఒత్తిడి వచ్చి సుఖప్రసవం జరుగుతుంది.