: కార్తిక పురాణము :
జనక వశిష్ట సంవాదం
నైమిశారణ్యమందు సత్రయాగ దీక్షితులయిన శౌనకాది మహా మునులు ఒకప్పుడు జనకునకు వసిష్ట మహామునిచేత చెప్పబడిన కార్తిక మాహాత్యమును సవిస్తారముగా మేము మీవలన వినగోరితిమి అని సూతుని అడిగిరి. సూతుడు ఇట్లుచెప్పెను. శౌనకాది సమస్తము నీశ్వరులారా ! వినుడు. ఈ కార్తికమాహాత్యమును వసిష్టమహాముని జనకమహారాజుకు చెప్పెను.
పూర్వము నారదునకు బ్రహ్మయు, పార్వతికి శివుడు, లక్ష్మీదేవికి విష్ణువు చెప్పినారు. దీనివలన సమస్త సంపత్తులు ప్రాప్తించును. దీనిని విన్నవారు జనన మరణ రూప సంసారబంధనమును తెంచుకుని మోక్షము పొందుదురు.
ఒకానొకప్పుడు దై దెవవశముచేత సిద్ధాశమమునకు బోవుచు వసిష్ట మహాముని జనకమహారాజు గృహమునకు జేరెను. అంత జనకమహారాజు వచ్చిన వసిష్టుని జూచి సింహాసనము నుండి త్వరగా దిగి సాష్టాంగదండ ప్రణామముజేసెను. సంతోష పులకాంకితుదై అర్ధ్యృపాద్యాదులచేత పూజించి మునిపాదోదకమును తనశిరస్సున చల్లు కొనెను. బంగారపు ఆసనమునిచ్చి వికసించిన తామరపువ్వులవంటి కన్నులు గల వాడును, సమస్త సుగుణ సంపన్నుడును అగు మునికి భక్తిభావముతో ఇట్లనివిన్నవించెను.
బ్రాహ్మణోత్తమా! మీదర్శనము వలన ధన్యుడనైతిని. నేను చేయదగిన పుణ్య మింకేమియు లేదు. ఇప్పుడు మా పితరులందరును తృప్తి నొందినారు. మహాత్ములయొక్క దర్శనము సంసారులకుదుర్లభము, కనుక ఇప్పుడు మీరాక నాకుశుభములకు కారణమైనది.
సూతుడిట్లు చెప్పెను. తరువాత వసిష్ట మహర్షి వికసించిన ముఖము గలవాడై దయతో గూడినవాదై సంతోషించి చిణునవ్వుతో ఇట్లని పలికెను. రాజోత్తమా! నీకు క్షేమమగుగాక. నేను మా యాశ్రమమునకు బోవు చున్నాను. రేపు మా యింటి వద్ద యజ్ఞము జలుగును. దానికి ద్రవ్యమును ఈయగోరుదును. ఆరాజిట్లు పలికెను. ముని శ్వరా ! యజ్ఞమునకు చాలాద్రవ్యమును ఇచ్చెదను. గాని వినువారి పాపములను బోగొట్టు ధర్మ రహస్యములను నీ వలనవినగోరితిని. నీకు తెలియని ధర్మరహస్యములు లేవు కాబట్టీ అధికఫలము ఇచ్చెడి సూక్ష్మధర్మములను నాకు చెప్పుము. మునీశ్వరా ధర్మజ్ఞా కార్తిక మాసము సమస్త మాసములకంటెను సమస్త ధర్మములకంటెను ఎట్లధికమైనదో దానిని వినగోరితిని నాకు చెప్పుము. వసిష్టుడిట్లు పల్కెను.
రాజా! పూర్వ పుణ్యమువలన సత్వశుద్ధి గలుగును. సత్వశుద్ది గలిగిన పుణ్యమార్గమందు అభిలాష గలుగును. లోకోపకారార్తమై నీవడిగిన మాట చాలా బాగున్నది. చెప్పెదను వినుము. విన్నంతనే పాపములు నశించును. సత్త్వగుణము కలుగును.
- రాజా! సూర్యుడు తులరాశియందుండగా కార్తికమాసములో చేసిన స్నానము దానము అర్చనము మొదలయినవి మంచి మనస్సుతో ఏవి చేసినను అవి అక్షయ్యములగునని మునీశ్వరులు చెప్పిరి. కార్తిక వ్రతమును తులాసంక్రమణము=సూర్యుడు తులారాశిలో ప్రవేశించుట మొదలుకొని గాని, కార్తిక శుక్షప్రతిపత్ మొదలుకొని గాని ఆరంభించి నెలరోజులు చేయవలెను.
- ఆరంభమందు ఓ దామోదరా ! నేను కార్తిక వ్రతము ఆరంభించుచున్నాను. దానిని నిర్విఘ్నముగా పూర్తిజేయుము. అని సంకల్పము చేసి కార్తిక స్నానమారంభింపవలెను.
- కార్తికమాసమందు సూర్యోదయ సమయమున కావేరీనదియందు స్నానమాచరించిన వారికి మహాఫలము కలుగగలదు. సూర్యుడు తులా రాశిని ప్రవేశించినతోడనే మూడు లోకములను పవిత్రము జేయుచు గంగ ద్రవరూపమును ధరించి సమస్త నదీజల ములయందును ప్రవేశించును.
- తులారాశియందు కార్తికమున చెరువులందును, దిగుడుభావు అందును నూతులందును, చిన్నకాలువలందును హరినివసించియుండును. రాజా కార్తికమందు వ్రతము అన్నివర్ద్ణాలవారు జేయవచ్చును. బ్రాహ్మణుడు కార్తికమాసమందు గంగకుబోయి నమస్కరించి హరిని ధ్యానించి కాళ్ళుచేతులు కడుగుకొని ఆచమనముచేసి శుద్ధుడై మంత్రముల చేత భైరవానుజ్ఞనుబొంది మొలలోతు జలమందు స్నానము చేయవలెను.
- తరువాత దేవర్షి పితృతర్ప్చణ మాచరించి హరిభక్తితో అఘమర్షణ మంత్రమును పఠింపుచు బొటనవైేలికొనతో ఉదకమును ఆలోడనము చేసి తీరమునకువచ్చి అచ్చట యక్ష్మతర్పణమునుచేసి ధరించిన వస్త్రమును పిడిచికట్టుకొని ఉదకమును వదలి ఆచ మనముచేసి శిరస్సునువదలి మిగిలిన శరీరమంతయు తడివస్తముతో తుడిచికొని నారాయణ ధ్యాన మాచరింపుచు ధౌాతవస్త్రమును ధరించవలెను.
- తరువాత బ్రాహ్మణుడు గోపీచందనముతో ఊర్ధ్వ పుంద్రములను ధరించి సంధ్యావందనముచేసి గాయత్రీ జపము చేయవలెను. ప్రీలు గౌరీ జపము చేయవలెను. తరువాత బెపాసనముగావించి బ్రహ్మయజ్ఞముచేసి తనతోటలో నుండి పుష్పములు తెచ్చి శంఖచక్రములను ధరించినహరిని భక్తితో సాలగ్రామమందు షోడశోపచారములతో పూజించవలెను.
- కార్తికపురాణము పఠించి (లేక) విని ఇంటికి వెళ్ళి భక్తితో దేవతార్చనచేసి వేశ్వ దేవమును 'నెఱవేర్చి భోజనముచేసి ఆచమనముగావించి తరువాత పురాణకాలక్షేపమును వేయవలయును. సాయంకాలముకాగానే ఇతర వ్యాపారములనన్నిటిని అపివేసి విష్ట్వా లయమందుగాని, శివాలయ మందుగాని తనశక్తి కొలది దీపములను బెట్టి భక క్ష్యభోజ్యాదులతో స్వామిని పూజించి వాక్ళుద్ధితో విష్ణుస్తోత్రమునుగాని, శివస్తోత్రమునుగాని పఠించి నమస్మారములాచరించవలయును. ఎవడు కార్తికవ్రతము భక్తితో చేయు చున్నాడో వాడు పునరావృత్తి వర్ణితమైన వైకుంఠమును బొందుచున్నాడు. పూర్వజన్మార్దితములున్ను ఈ జన్మార్జితములున్ను అయిన సమస్త పాపములు కార్తికవతమాచరించిన యెడల నశించును.
- బొహ్మాణుడుగాని, క్షత్రియుడుగాని, వైశ్యుడుగాని, శూద్రుడుగాని, బుషీశ్వరుడు గాని, స్త్రీలుగాని, భక్తిశ్రద్ధలతో కార్తికవ్రతమును జేసిన యెడల వానికి పునరావృత్తిలేని వైకుంఠమునొందుదురు. “ఎవ్వడు కార్తిక వతమాచ రించువానిని జూచి సంతోషించునోవానియొక్క పగటికాలమందాచరించిన పాతకమునశించును. ఇందుకు సందేహములేదు.