శ్లోకము - 66
నాస్తి బుద్ధియుక్తస్య న చాయుక్తస్య భావనా |
న చాభావయతః శాస్త్రశాన్తస్య కుతః సుఖం ||
న అస్తి - ఉండదు; బుద్ధిః - దివ్యమైన బుద్ధి; అయుక్తస్య - (కృష్ణ భక్తిభావనతో) సంబంధము లేనివానికి; న - ఉండదు; చ — మరియు; అయుక్తస్య - కృష్ణ భక్తి భావన లేనివానికి; భావనా - (ఆనందముతో) స్థిరమైన మనస్సు; న - ఉండదు; చ — మరియు; అభావయతః - స్థిరుడు కానివానికి; శాస్త్రి: - శాంతి; అశాన్తస్య - శాంతి లేనివానికి; కుతః - ఎక్కడ; సుఖం - సుఖము.
(కృష్ణ భక్తి భావనలో) భగవానునితో సంబంధము లేనివానికి దివ్యమైన బుద్ధి గాని, స్థిరమైన మనస్సు గాని ఉండదు. అవి లేనిదే శాంతికి అవకాశమే లేదు. ఇక శాంతి లేకుండ సుఖమెట్గా కలుగుతుంది?
భాష్యము : మనిషి కృష్ణ భక్తి భావనలో లేకపోతే శాంతికి అవకాశమే లేదు. శ్రీకృష్ణుడే యజ్ఞతపస్సుల సమస్త ఫలభోక్త యని, ఆతడే సకల విశ్వసృష్టులకు అధిపతి యని, సకల జీవులకు ఆతడే నిజమైన మిత్రుడని మనిషి అర్థం చేసికొన్నప్పుడు మాత్రమే నిజమైన శాంతిని పొందగలుగుతాడని ఐదవ అధ్యాయంలో (5.29) ధ్రువపరుపబడింది. కనుక మనిషి కృష్ణభక్తిభావనలో లేకపోతే మనస్సుకు ఒక చరమలక్ష్యమే ఉండదు.
చరమలక్ష్యము లేకపోవడమే కలతకు కారణము. శ్రీకృష్ణుడే ఎల్లరకు, ప్రతీదానికీ భోక్తయని, అధిపతి యని, మిత్రుడని మనిషి నిశ్చయించుకొన్నప్పుడు స్థిరమైన మనస్సుతో శాంతిని పొందగలుగుతాడు. కనుక శ్రీకృష్ణునితో సంబంధము లేకుండ ఉండేవాడు జీవితంలో శాంతి, ఆధ్యాత్మిక ప్రగతి ఉన్నట్లు ఎంతగా ప్రదర్శించినా నికముగా సర్వదా దుఃఖంలోనే, శాంతిరహితంగానే ఉంటాడు. కృష్ణభక్తి భావన అనేది స్వయంగా ప్రకటమయ్యే శాంతిమయ స్థితి. అది కేవలము శ్రీకృష్ణునితో సంబంధములోనే లభిస్తుంది.
శ్లోకము - 67
ఇన్ద్రియాణాం -హచరతాం యన్మనోఃనువిధీయతే |
తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివామృసి ||
ఇన్ద్రియాణాం - ఇంద్రియాలలో; హి - నికముగా; చరతాం - చరిస్తున్నప్పుడు; యత్ - దేనితోనైతే; మనః - మనస్సు; అనువిధీయతే - నిరంతరము లగ్నమౌతుందో; తత్ - అది; అస్య - అతని; హరతి - హరిస్తుంది; ప్రజాం - బుద్ధిని; వాయుః - గాలి; నావం - నావను; ఇవ - వలె; అమృసి - నీటిలో.
తీవ్రమైన గాలి నీటిలోని నావను త్రోసివేసినట్లుగా, మనస్సు సంలగ్నమైనప్పుడు చరించే ఇంద్రియాలలో ఒక్కటైనా సరే మనిషి బుద్ధిని హరిస్తుంది.
భాష్యము : ఇంద్రియాలన్నీ భగవత్సేవలో నెలకొననంతవరకు, వాటిలో ఒక్కటి ఇంద్రియభోగంలో నెలకొన్నా సరే భక్తుడిని ఆధ్యాత్మిక ప్రగతిపథం నుండి తప్పిస్తుంది. అంబరీష మహారాజు జీవితంలో పేర్కొనబడిన విధంగా ఇంద్రియాలు అన్నింటినీ కృష్ణభక్తి భావనలో తప్పక నెలకొల్పాలి. ఎందుకంటే మనోనిగ్రహానికి అదే సరియైన పద్ధతి.
శ్లోకము - 68
తస్మాద్ యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః |
ఇంద్రియాణీన్షియాఛభ్యస్తస్య ప్రజా ప్రతిష్ఠితా ||
తస్మాత్ - కనుక; యస్య - ఎవ్వని; మహాబాహో - ఓ మహాబాహువులు కలవాడా; నిగృహీతాని - నిగ్రహింపబడతాయో; సర్వశః - సమస్తమైన; ఇన్షియాణీ - ఇంద్రియాలు; ఇన్ద్రియార్డేభ్యః - ఇంద్రియ విషయాల నుండి; తస్య - అతని; ప్రఙ్ఞా - బుద్ధి; ప్రతిష్ఠితా - సుస్థిరమైనది.
కనుక ఓ మహాబాహో! ఎవ్వని ఇంద్రియాలు వాటి ఇంద్రియార్థాల నుండి నిగ్రహించబడి ఉంటాయో అతడు నిక్కముగా స్థితప్రజ్ఞుడు.
భాష్యము : ఇంద్రియభోగ వేగాలను మనిషి కేవలము కృష్ణ భక్తి భావన ద్వారానే, అంటే సర్వేంద్రియాలను భగవానుని దివ్యమైన ప్రేమయుతసేవలో నెలకొల్పడం ద్వారానే అణచగలడు. ఉన్నతమైన శక్తిచే శత్రువులను అణచినట్లుగా, ఎటువంటి మానవయత్నముచే గాక కేవలము భగవత్సేవలో నెలకొల్పడం ద్వారా ఇంద్రియాలు అదేవిధంగా అణగుతాయి. కేవలము కృష్ణభక్తి భావన ద్వారానే మనిషి నిజంగా బుద్ధిలో నెలకొంటాడని, ఈ కళను అతడు ప్రామాణిక గురువు మార్గదర్శనంలో తప్పక సాధన చేయాలని అర్ధం చేసికున్నవాడు సాధకుడు లేదా మోక్షానికి యోగ్యమైనవాడని పిలువబడతాడు.
శ్లోకము - 69
యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ |
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః ||
యా - ఏది; నిశా - రాత్రియో; సర్వ - సకలమైన; భూతానాం - జీవులకు; తస్యాం - దానిలో; జాగర్తి - మేల్కొని ఉంటాడు; సంయమీ - ఆత్మనిగ్రహము కలవాడు; యస్యాం - దేనిలో; జాగ్రతి –మేల్కొని ఉంటారో; భూతాని - సకల జీవులు; సా - అది; నిశా - రాత్రి; పశ్యతః - అంతర్ముఖుడైన; మునేః - మునికి.
జీవులందరికీ ఏది రాత్రి సమయమో అది ఆత్మనిగ్రహము కలవానికి మేల్కొని ఉండే సమయము; సకల జీవులకు మేల్కొని ఉండే సమయము అంతర్ముఖుడైన మునికి రాత్రి సమయము.
భాష్యము : రెండు తరగతుల తెలివిగలవాళ్ళు ఉన్నారు. ఒకరు ఇంద్రియ భోగార్థము లౌకికకలాపాలలో తెలివిగలవారు, కాగా ఇంకొకరు అంతరేక్షణ కలవారు, ఆత్మానుభూతి సాధనలో జాగృతమైనవారు. చింతనాపరుడైన ముని లేదా వివేకవంతుని కలాపాలు లౌకికత్వంలో లగ్నమైన మనుషులకు రాత్రి వంటివి. లౌకికులు ఆత్మానుభూతి గురించి ఎరుగని కారణంగా అటువంటి రాత్రిలో నిద్రపోయి ఉంటారు. అంతర్ముఖుడైన ముని లౌకికుల రాత్రి వేళలో చురుకుగా ఉంటాడు. ముని క్రమానుగతమైన ఆధ్యాత్మిక పురోగతిలో దివ్యానందాన్ని అనుభవిస్తాడు, కాగా లౌకికకలాపాలలో ఉండే వ్యక్తి ఆత్మానుభూతి పట్ల నిద్రలో ఉన్నందున ఆ నిద్రావస్థలో ఒక్కొకప్పుడు సుఖమును, ఒక్కొకప్పుడు దుఃఖమును అనుభవిస్తూ నానారకాల ఇంద్రియసుఖ కలలను కంటూ ఉంటాడు. చింతనాపరుడైన వ్యక్తి సర్వదా లౌకిక సుఖదుఃఖాల పట్ల ఉదాసీనంగా ఉంటాడు. అతడు భౌతిక పరిణామాలచే కలత చెందకుండ తన ఆధ్యాత్మిక కలాపాలను కొనసాగిస్తూనే ఉంటాడు.