గురువారం కు సాయిబాబా కు ఏం సంబంధం లేదు!
గురువారం వచ్చింటే చాలు ఓ తెగ సాయిరాంలు.,సాయిబాబాలు.,సాయి పూజలు., శుభోదయాలు., సాయిబాబా ఆశీస్సులతో మీకు అంతా శుభమే జరగాలని ఓ తెగ స్క్రోలింగ్ లు.,వాట్సాప్ పోస్టింగ్ లు.! మొత్తానికి గురువారం అంటే సాయిబాబా.,సాయిబాబా అంటే గురువారం ఇలా తయారు చేశారు.!?
అయితే గురువారానికి సాయిబాబాకు ఏమైనా సంబంధముందా? తెలుసుకుందాం.
హిందూ పురాణాల ప్రకారం గురువారం అంటే గురు గ్రహం లేదా బృహస్పతి గ్రహానికి సంబంధించినది. గురువారాన్ని లక్ష్మీ వారం లేదా బేస్త వారం అంటారు. గురువారం శ్రీ మహావిష్ణువుకు సంబంధించినది.గురువారంను బృహస్పతి వారంగా కూడా పిలుస్తారు.గురువారం శ్రీ మహావిష్ణువుకు మరియు దేవతల గురువైన బృహస్పతికి అంకితం చేయబడింది. గురుగ్రహాన్ని ఇంగ్లీషులో జుపిటర్ అని పిలుస్తారు.శ్రీరాముడు గురువారం నాడు జన్మించాడని పురాణాల ద్వారా తెలుస్తోంది.
'గు' అనగా అంధకారం.,అజ్ఞానం 'రు' అనగా తొలగించేది. గురు అంటే అజ్ఞానమనే అంధకారం తొలగించేవాడు.!
హిందువులకు దేనికైనా వేదము ప్రమాణము. ఏ వేదాలలో కూడా సాయిబాబా యొక్క ప్రస్తావనే లేదు.! అలాగే...మహాభారతం.,రామాయణం.,భాగవతం.,భగవద్గీత.,స్మృతులు.,పురాణాలు.,ఉపనిషత్తులుఇలా ఏ హిందూ గ్రంథాలలో కూడా సాయిబాబా యొక్క ప్రస్తావన లేదు గాక లేదు. మన హిందూ గురువులు ఎందరో ఎన్నో గ్రంథాలు రాశారు. కానీ సాయిబాబా ఒక్క గ్రంథం కూడా రాసిన దాఖలాలు లేవు.! గురువంటే కనీసం ఉపదేశం ఇచ్చి ఇవ్వాలి. సాయిబాబా జీవితంలో ఒక్క మనిషికైనా ఉపదేశం ఇచ్చినది లేదు.! అలాగేమన హిందూ గురు పరంపర ను చూసినచో.....జగద్గురువు శ్రీకృష్ణుడు శ్రీరాముని గురువులు వశిష్ఠ్.,విశ్వామిత్రులు.కృష్ణుని గురువు సాందీపని.గురు రాఘవేంద్రుడు.గురు దత్తాత్రేయుడు, ఆది గురువులు వ్యాసుడు పరంపర. జగద్గురువు శంకరాచార్య పరంపర. ఇలా మనకు అద్భుతమైన గురు పరంపర ఉంది.ఇంకా చెప్పాలంటే... శివాజీ గురువులు దాదాజీ కొండదేవ్.,సమర్థ రామదాసులు.వివేకానంద గురువు రామకృష్ణ పరమహంస. చంద్రగుప్తుని గురువు చాణక్యుడు.ఇలా గురు పరంపర ను చూడవచ్చు.
ఈ ఆధునిక యుగంలో కూడా...అనేక మంది జగద్గురువులు.,శంకరాచార్యలు.,శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ కానివ్వండి.,జగ్గీ వాసుదేవ్ కానివ్వండి.,స్వామి చిన్మయానంద.,భక్తి శీలప్రభుపాద.,పాండురంగ శాస్త్రి ఆఠవళే.,జీయర్లు....ఇంకా ఎందరో మరెందరో....ఈ గురు పరంపరలో ఎక్కడ కూడా సాయిబాబా యొక్క ప్రస్తావన అస్సలు లేదు కనిపించదు.! కాబట్టి గురువారం అయితే గియితే పైన తెలిపిన గురు పరంపరకు చెందినదై ఉండాలి గానీ. సాయిబాబాకు సంబంధించినది కాదు.
ఇక గురుపౌర్ణమి విషయం చూద్దాం.
గురుపౌర్ణమి అంటే వాస్తవానికి చతుర్వేదాలను రచించిన ఆది గురువు వేద వ్యాసుని జయంతి.! ఆ మహాపురుషుని జయంతినే గురుపౌర్ణమి గా జరుపుకుంటాం. కానీఏమిటో అర్థం కాదు.!.ఇప్పుడు గురుపౌర్ణమి అంటే చాలు సాయిబాబా సాయిబాబా.!సాయి గుళ్ళల్లో ఓ ఒకటే హడావుడి.!!!?? ఒకటే పూజలు. ఒకటే అన్నసత్రాలు. హిందువుల అజ్ఞానానికి.,మూర్ఖత్వానికీ అంతులేకుండా పోయింది.
అసలు గురువారానికీ సాయిబాబాకు ఏమైనా సంబందం ఉందా?అని ఎవ్వరినడిగినా కూడా ఏం చెప్పలేని స్థితి.!?
ఈ విషయాన్ని సమస్త హిందూ బందువులతో పంచుకోవాలని. ఆలోచించండి హిందూ బందువులారా....!!!!!
Baba kaalaniki puranalaki vedhalaki atheethamynavadu anduke yekkada saibaba gurinchi undadu ayana guruvulake guruvu okka rojuku parimitham cheyakandi intha cheptunnare okkati cheppandi sun yetuvypu vudhaisthadu?
రిప్లయితొలగించండి