శ్లోకము - 58
యదా సంహరతే చాయం కూర్మోకజ్ఞానీవ సర్వశః |
ఇన్షియాణీల్షియార్డేభ్యస్తస్య ప్రజా ప్రతిష్ఠితా ||
యదా - ఎప్పుడు; సంహరతే - ముడుచుకుంటాడో; చ - కూడా; అయం - అతడు; కూర్మః - తాబేలు; అంగాని - అవయవాలను; ఇవ - వలె; సర్వశః - అన్ని; ఇన్ద్రియాణి - ఇంద్రియాలను; ఇన్టియార్డేభ్యః - ఇంద్రియార్థాల నుండి; తస్య - అతని; ప్రజ్ఞా - చైతన్యము; ప్రతిష్ఠితా - స్థిరముగా ఉంటుంది.
తాబేలు తన అవయవాలను చిప్పలోనికి ముడుచుకు రీతిగా, ఇంద్రియార్థాల నుండి తన ఇంద్రియాలను వెనకకు తీసికొనగలిగేవాడు పరిపూర్ణ చైతన్యంలో సుస్థిరముగా ఉన్నవాడౌతాడు.
భాష్యము : తన యుక్తి ననుసరించి ఇంద్రియాలను నియంత్రించగలగడమే యోగికి, భక్తునికి లేదా ఆత్మదర్శికి పరీక్ష. అయినా సాధారణంగా జనులందరు ఇంద్రియదాసులై ఉండి, ఆ విధంగా ఇంద్రియాల ఆదేశముచే నడుపబడతారు. యోగి ఏ విధంగా నెలకొని ఉంటాడనే ప్రశ్నకు ఇది సమాధానము. ఇంద్రియాలు విషపూరిత సర్పాలతో పోల్చబడతాయి. అవి విచ్చలవిడిగా, ఎటువంటి అడ్డు లేకుండ వర్తించగోరుతాయి.
యోగి లేదా భక్తుడు పాములవానిలాగా ఆ సర్పాలను నియంత్రించగలిగేటంత శక్తిమంతుడై ఉండాలి. అవి స్వేచ్ఛగా వర్తించడాన్ని అతడు ఏనాడూ అనుమతించడు. శాస్త్రాలలో పలు నియమాలు చెప్పబడినాయి. వాటిలో కొన్ని నిషేధాలు, కొన్ని విధులు. మనిషి తనను ఇంద్రియభోగము నుండి నియంత్రిస్తూ విధినిషేధాల పాలన చేయనిదే కృష్ణభక్తి భావనలో సుస్థిరంగా నిలిచే అవకాశమే లేదు. ఇక్కడ చెప్పబడిన మంచి ఉపమానము తాబేలు, తాబేలు ఏ క్షణంలోనైనా తన ఇంద్రియాలను ముడుచుకొని, తిరిగి ఏ క్షణంలోనైనా ప్రత్యేక ప్రయోజనాలకు వాటిని ప్రదర్శించగలుగుతుంది. అదే విధంగా కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తుల ఇంద్రియాలు కేవలము భగవత్సేవలో ఏదో ప్రత్యేకమైన ఉద్దేశానికే వాడబడుతూ ఉంటాయి. లేకపోతే అవి వెనకకు మళ్ళించబడి ఉంటాయి. స్వీయ తృప్తికి బదులు భగవత్సేవ కొరకే తన ఇంద్రియాలను వాడమని ఇచ్చట అర్జునునికి చెప్పబడుతోంది. ఇంద్రియాలను సర్వదా భగవత్సేవలో నిలపాలనే విషయము ఇంద్రియాలను లోపలకు ముడుచుకొని ఉండే తాబేలు ఉపమానముతో చెప్పబడింది.
శ్లోకము - 59
విషయా వినివర్తన్ నిరాహారస్య దేహినః |
రసవర్షం రసోఃప్యస్య పరం దృష్ట్వా నివర్తతే ||
విషయాః - ఇంద్రియభోగ వస్తువులు; వినిర్తన్తే - దూరం చేసే ప్రయత్నాలు చేయబడతాయి; నిరాహారస్య - నిషేధాల ద్వారా; దేహినః - దేహధారికి; రసవర్షం - రుచిని విడిచి; రసః - భోగభావన; అపి - ఉన్నప్పటికిని; అస్య - అతనికి; పరం - చాలా ఉన్నతమైన విషయాల; దృష్ట్వా - అనుభూతి ద్వారా; నివర్తతే - వాటి నుండి విరమిస్తాడు.
దేహధారిని ఇంద్రియభోగము నుండి నిగ్రహించినా ఇంద్రియార్థాల పట్ల రుచి నిలిచే ఉంటుంది. కాని ఉన్నతమైన రసానుభూతి ద్వారా అటువంటి కలాపాలను విడిచి అతడు చైతన్యంలో స్థిరుడౌతాడు.
భాష్యము : మనిషి దివ్యముగా నెలకొననిదే ఇంద్రియభోగాన్ని విడిచిపెట్టడము అసాధ్యం. నియమనిబంధనల ద్వారా ఇంద్రియభోగాన్ని నియంత్రించే పద్ధతి రోగిని కొన్ని రకాల ఆహార పదార్థాల నుండి నియంత్రించడం వంటిది. అయినా రోగి అటువంటి నియమాలను మెచ్చడు; ఆహారపదార్థాల పట్ల అతని రుచి పోదు. అదేవిధంగా అష్టాంగయోగము అంటే యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము వంటివి కలిగి ఉండే ఆధ్యాత్మిక పద్ధతుల ద్వారా ఇంద్రియనిగ్రహము ఉత్తమ జ్ఞానము లేనట్టి అల్పబుద్ధి కలవారికి చెప్పబడింది.
కాని శ్రీకృష్ణ భగవానుని సౌందర్యాన్ని రుచి చూసినవానికి కృష్ణ భక్తిభావన ప్రగతిపథంలో మృతప్రాయమైన లౌకిక విషయాల పట్ల రుచి ఏమాత్రము ఉండదు. కనుక కలిగిన సాధకుల కొరకు ఆధ్యాత్మికజీవన ప్రగతిలో నియమాలు ఉన్నప్పటికిని కృష్ణ భక్తి భావనలో నిజంగా రుచి కలిగేటంత వరకే అటువంటివి లాభకరమౌతాయి. మనిషి నిజంగా కృష్ణభక్తి భావనలో ఉన్నప్పుడు శుషమైన విషయాల పట్ల రుచిని సహజంగానే అల్పబుద్ధి కోల్పోతాడు.
శ్లోకము - 60
యతతో హ్యపి కౌన్డేయ పురుషస్య విపశ్చితః |
ఇంద్రియాణి ప్రమాథీని హరని ప్రసభం మనః ||
యతతో - ప్రయత్నిస్తున్నప్పుడు; హి - నిక్కముగా; అపి - అయినప్పటికిని; కౌన్డేయ - ఓ కుంతీపుత్రా; పురుషస్య - మనిషి యొక్క: విపశ్చితః - పూర్తి వివేకము కలవాని; ఇన్షియాణి - ఇంద్రియాలు; ప్రమాథీని - కలతను కలిగిస్తూ; హరని - త్రోసివేస్తాయి; ప్రసభం - బలవంతంగా; మనః - మనస్సును.
ఓ అర్జునా! ఇంద్రియాలు ఎంత బలవంతమైనవి, ఉగ్రమైనవంటే వాటిని నియంత్రించడానికి యత్నించే వివేకవంతుని మనస్సునైనా అవి బలవంతంగా హరించి వేస్తాయి.
భాష్యము : ఇంద్రియాలను జయించడానికి యత్నించే పండితులైన ఋషులు, తత్త్వవేత్తలు, జ్ఞానులు ఎంతోమంది ఉన్నారు. కాని వారెన్ని యత్నాలు చేసినా కల్లోలిత మనస్సు కారణంగా వారిలో మహాఘనులైనవారే ఒక్కొకప్పుడు భౌతికేంద్రియభోగానికి బలి అవుతుంటారు. మహర్షి, పరిపూర్ణ యోగి అయిన విశ్వామిత్రుడు తీవ్రమైన తపోయోగసాధనల ద్వారా ఇంద్రియనిగ్రహానికి యత్నిస్తున్నప్పటికిని మేనకచే మైథున భోగానికి ఆకర్షితుడయ్యాడు. ప్రపంచ చరిత్రలో ఇటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. కనుక సంపూర్ణ కృష్ణ భక్తి భావన లేనిదే మనస్సును, ఇంద్రియాలను నిగ్రహించడం చాలా కఠినం. మనస్సును శ్రీకృష్ణునిలో లగ్నము చేయకుండ మనిషి అటువంటి లౌకికకర్మలను ఆపలేడు. గొప్ప ముని, భక్తుడు అయినట్టి శ్రీరామునాచార్యులే దీనికి చక్కని ఉపమానము. ఆయన ఇలా అన్నారు :
యదవధి మమ చేతః కృష్ణ పదారవినే
నవనవరసధామన్యుద్యతం రంతుమాసీత్ |
తదవధి బత నారీ సంగమే స్మర్యమాణే
భవతి ముఖవికారః సుష్టు నిఫ్టీవనం చ ||
“నా మనస్సు శ్రీకృష్ణ భగవానుని పాదపద్మసేవలో నెలకొని ఉన్నందున, నేను సర్వదా నవ్యదివ్య రసాన్ని ఆస్వాదిస్తున్నందున స్త్రీ సంగమ తలంపు కలగగానే ముఖం వికారంచెంది ఆ ఆలోచనపై ఉమ్మివేస్తాను.” కృష్ణభక్తి భావన ఎంతటి దివ్యమైన విషయమంటే భౌతికభోగము అప్రయత్నంగానే
రుచి లేనిది అవుతుంది. అది ఆకలిగొన్నవాడు తగినంత పౌష్ఠికాహారముతో తన ఆకలిని తీర్చుకోవడం వంటిది. అంబరీష మహారాజు కేవలము తన మనస్సును కృష్ణభక్తి భావనలో నెలకొల్పిన కారణంగానే (స వై మనః కృష్ణ పదారవిద్దయోః వచాంసి వైకుంఠ గుణానువర్గనే) మహాయోగియైన దుర్వాసమునిని కూడ జయింపగలిగాడు.