శ్లోకము - 50
బుద్దియుక్తో జహాతీహా ఉభే సుకృత దుష్కృతే |
తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్ ||
బుద్ధియుక్తః - భక్తియుతసీవలో నిమగ్నమైనవాడు; జహాతి - తొలగించుకుంటాడు; ఇహ - ఈ జన్మలో; ఉభే - రెండింటిని; సుకృత దుష్పృతే - మంచిచెడు ఫలాలు; తస్మాత్ - కనుక; యోగాయ - భక్తియోగము కొరకు; యుజ్యస్వ - ఆ రకంగా నెలకొన వలసింది; యోగః - కృష్ణభక్తిభావన; కర్మసు - సకల కర్మలలో; కౌశలం - నేర్పు.
భక్తియుతసేవలో నిమగ్నమైన వ్యక్తి ఈ జన్మలోనే శుభఫలములు, అశుభఫలములు రెండింటి నుండి విముక్తుడౌతాడు. కనుక సకల కర్మలలోని నేర్పు అయినట్టి యోగము కొరకే ప్రయత్నించు.
భాష్యము : అనంతకాలము నుండి ప్రతీ జీవుడు నానారకాల శుభ, అశుభ కర్మఫలాలను ప్రోగుచేసికొన్నాడు. నిజానికి తన నిజమైన సహజస్థితి గురించి అతడు నిరంతరము ఎరుగకుండానే ఉండిపోతున్నాడు. మనిషి అజ్ఞానము భగవద్గీత ఉపదేశము ద్వారా తొలగిపోతుంది. శ్రీకృష్ణభగవానునికి అన్ని విధాలుగా శరణాగతుడై జన్మజన్మాంతరాలుగా సాగుతున్నట్టి కర్మ, కర్మఫలం అనే హానికారక శృంఖలం నుండి ముక్తుడవు కమ్మని అది అతనికి బోధిస్తున్నది. కనుక కర్మఫలాన్ని శుద్ధిచేసే విధానమైనట్టి కృష్ణభక్తిభావనలో కర్మ చేయమని అర్జునునికి ఉపదేశించబడింది.
శ్లోకము - 51
కర్మజం బుద్దియుక్తా హి ఫలం త్యక్త్వామనీషిణః |
జన్మబన్ధవినిర్ముక్తా: పదం గచ్చన్త్యనామయం ||
కర్మజం - కామ్యకర్మల వలన కలిగే; బుద్ధియుక్తాః - భక్తియుతసేవలో నెలకొని; హి - నిక్కముగా; ఫలం - ఫలాలను; త్యక్త్వా - విడిచి; మనీషిణః - మహర్షులు లేదా భక్తులు; జన్మబన్ధ - జన్మమృత్యు బంధము నుండి; వినిర్ముక్తాః - విముక్తులై; పదం - పదమును; గచ్భన్తి - పొందుతారు; అనామయం - దుఃఖరహితమైన.
ఆ విధంగా భగవానుని భక్తియుతసేనలో నెలకొనడం ద్వారా మహర్షులు లేదా భక్తులు ఈ భౌతికజగత్తులో కర్మఫలాల నుండి తమను ముక్తులను చేసికొంటారు. ఈ రకంగా వారు జన్మమృత్యుచక్రం నుండి విడుదలను పొంది (భగవద్గామానికి చేరుకోవడం ద్వారా) దుఃఖరాహిత్య స్థితిని పొందుతారు.
భాష్యము : ముక్తజీవులు భౌతికళ్లేశాలు లేనట్టి స్థానానికి చెందినట్టివారు. శ్రీమద్భాగవతము (10,14.58) ఈ విధంగా చెబుతున్నది.
సమాశ్రితా యే పదపల్లవప్లవం మహత్పదం పుణ్యయశో మురారేః |
భవామ్భుధి ర్వత్సపదం పరం పదం పదం పదం యద్విపదాం న తేషాం ||
" జగత్తుకు ఆశ్రయమైనవాడు, ముక్తినిచ్చే ముకుందునిగా ప్రసిద్ధి చెందినవాడు అయిన భగవంతుని పాదపద్మనౌకను స్వీకరించినవానికి సంసారసాగరము దూడపాదముద్రలోని జలము వంటిదే అవుతుంది. పరమపదమే అంటే భౌతికక్లేశాలు లేనట్టి స్థానమే (వైకుంఠము) అతని గమ్యము గాని జీవితంలో అడుగడుగున అపాయము పొంచి ఉన్న స్థానము కాదు.”
ఈ భౌతికజగత్తు అడుగడుగున ప్రమాదాలు ఉన్నట్టి దుఃఖమయ స్థానమని మనిషి అజ్ఞానవశంగా తెలిసికోలేడు. కేవలము అజ్ఞానము కారణంగానే అల్పబుద్ధి కలిగిన జనులు సకామకర్మల ద్వారా పరిస్థితిని సవరించుకోవడానికి యత్నిస్తారు.
అటువంటి కర్మల ఫలాలు తమను సుఖభాగులను చేస్తాయని వారు అనుకుంటారు ఈ విశ్వంలో ఎక్కడైనా ఏ రకమైన దేహమైనా దుఃఖరాహిత్యమైన జీవితాన్ని ఇవ్వలేదని వారికి తెలియదు. జీవితక్లెశాలు, అంటే జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధులు అనేవి భౌతికజగత్తులో సర్వత్ర ఉంటాయి. కాని భగవానుని నిత్యదాసునిగా తన నిజమైన సహజస్థితిని అర్థం చేసికొని, ఆ విధంగా దేవదేవుని స్థితిని తెలిసికొన్నవాడు భగవంతుని దివ్యమైన ప్రేమయుతసేవలో నెలకొంటాడు. తత్పలితంగా అతడు ఎక్కడైతే భౌతికమైన దు:ఖమయమైన జీవితం గాని, కాలమృత్యువుల ప్రభావం గాని లేనట్టి వైకుంఠలోకాలలో ప్రవేశించడానికి యోగ్యుడౌతాడు. స్వీయ సహజస్థితిని తెలిసికోవడమంటే భగవంతుని ఉదాత్తమైన స్థితిని కూడ తెలిసికోవడమని అర్థం.
జీవుని స్థితి, భగవంతుని స్థితి ఒకే స్థాయిలో ఉన్నాయని తప్పుగా భావించేవాడు అంధకారములో ఉన్నవాడుగా భావించబడతాడు. అందువలన అతడు భగవత్పేవలో నెలకొనలేడు. అతడు తానే ప్రభువై ఆ విధంగా జన్మమృత్యువులకు మార్గం ఏర్పాటు చేసికొంటాడు. కాని సేవించడమే తన స్థితియని అర్థం చేసికొని భగవత్సేవలో నెలకొనేవాడు శీఘ్రమే వైకుంఠలోకాన్ని పొందడానికి అర్హుడౌతాడు. భగవానునికి చేయబడే సేవ కర్మయోగము. లేదా: బుద్ధియోగము, స్పష్టంగా చెప్పాలంటే భగవంతుని భక్తియుతసేవ అని పిలుపబడుతుంది.
శ్లోకము - 52
యదా తే మోహకలిలం బుద్దధిర్వ్యతితరిష్యతి |
తదా గన్తాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ ||
యదా - ఎప్పుడైతే; తే - నీ యొక్క; మోహ - మోహమనే; కలిలం - దట్టమైన అరణ్యము; బుద్ధిః - దివ్యసీవతో కూడిన బుద్ధి; వ్యతితరిష్యతి - దాటుతుందో; తదా - అవ్పుడు; గన్తాసి - నీవు పొందుతావు; నిర్వేదం - పట్టించుకొనని బుద్ధి; శ్రోతవ్యస్య - వినవలసినదాని పట్ల; శ్రుతస్య - అదివరకే వినినదాని పట్ల; చ - కూడ
నీ బుద్ధి దట్టమైన మోహారణ్యమును దాటినప్పుడు వినినదాని పట్ల, వినవలసిన దాని పట్ల నీవు ఉపీక్ష వహిస్తావు.
భాష్యము : కేవలము భగవత్పేవ ద్వారా వేదవిపహిత కర్మల పట్ల ఉపేక్ష వహించిన మహా భగవద్భక్తుల జీవితాలలో ఎన్నో మంచి ఉదాహరణలు ఉన్నాయి. మనిషి యథార్థంగా శ్రీకృష్ణుని, ఆతనితో గల సంబంధాన్ని అర్థం చేసికొన్నప్పుడు అనుభవజ్ఞుడైన బ్రాహ్మణుడే అయినప్పటికిని సహజంగా కామ్యకర్మల పట్ల పూర్తిగా ఉపేక్ష వహిస్తాడు. పరమభక్తుడు, భక్తపరంపరలో ఆచార్యుడు అయినట్టి శ్రీమాధవేంద్రపురి ఈ విధంగా అన్నారు.
సంధ్యావందన భద్రమస్తు భవతో భోఃస్నాన తుభ్యం నమో
భో దేవాః పితరశ్చ తర్పణవిధౌ నాహం క్షమః క్షమ్యతాం |
యత్ర క్వాపి నిషద్య యాదవ కులోత్తమన్య కంసద్విషః
స్మారం స్మారమఘం హరామి తదలం మన్యే కిమన్యేన మే ||
" ఓ సంధ్యావందనమా! నీకు జయమగు గాక! ఓ స్నానమా, నీకు నా వందనాలు. ఓ దేవతలారా, పితృదేవతలారా మిమ్ము గౌరవింపలేని నా అశక్తతకు నన్ను మన్నించండి. ఇప్పుడు నేను ఎక్కడ కూర్చున్నా కంసవైరిని, యాదవకులోత్తముని (శ్రీకృష్ణుని) స్మరించి తద్వారా సమస్త పాపబంధము నుండి ముక్తుడను కాగలుగుతాను. ఇది నాకు చాలని నేను అనుకుంటున్నాను."
రోజుకు మూడుసార్లు అన్ని రకాలైన స్తోత్రాలు చేయడం, తెల్లవారుఝామునే స్నానం చేయడం, పితృదేవతలకు నమస్కరించడం వంటి వేదవిహిత కర్మలు, ఆచారాలు ఆంభదశలో ఉన్న భక్తులకు తప్పనిసరియైనవి. కాని మనిషి కృష్ణభక్తిభావనలో పరివూర్ణుడై దివ్యమైన ప్రేమయుతసేవలో నెలకొన్నప్పుడు తాను అదివరకే పూర్ణత్వాన్ని సాధించిన కారణంగా ఈ నియమాల పట్ల ఉపీక్ష వహిస్తాడు. శ్రీకృష్ణభగవానుని సేవ ద్వారా భక్తుడు చక్కని అవగాహనా స్థితికి చేరితే శాస్త్రాలలో తెలుపబడినట్టి నానారకాల తపోయజ్ఞాలను చేయవలసిన అవసరమే ఉండదు. అదేవిధంగా వేదాల ఉద్దేశము శ్రీకృష్ణుని చేరుకోవడమేనని మనిషి అర్థం చేసికోక కేవలము ఆచారకర్మలలో నెలకొంటే అట్టి కలాపాలలో కాలాన్ని వ్యర్థం చేసినవాడే అవుతాడు. కృష్ణభక్తిభావనలో ఉన్న జనులు శబ్దబ్రహ్మము సీమను, అంటే వేదోపనిషత్తుల పరిధిని అతిశయిస్తారు.