శ్లోకము - 47
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |
మా కర్మఫలహీతుర్భూర్మా తే సజ్గోః స్త్వకర్మణి ||
కర్మణి - విధ్యుక్తధర్మంలో; ఏవ - నిక్కముగా; అధికారః - అధికారము; తే - నీకు; మా - ఏనాడూ లేదు; ఫలేషు - ఫలాలలో; కదాచన - ఎప్పుడునూ; కర్మఫల - కర్మఫలాలలో; హీతుః - కారణము; మా భూః - కావద్దు; తే - నీకు; సజ్జః - ఆసక్తి; మా అస్తు - కలుగకుండుగాక, అకర్మణి - విధ్యుక్తధర్మాలు చేయకపోవడంలో.
నీ విధ్యుక్తధర్మమును నిర్వహించడానికే నీకు అధికారం ఉన్నది, కాని కర్మఫలంలో కాదు, నీ కర్మఫలాలకు నీవే కారణమని ఎన్నడూ భావించకు. అలాగే నీ విధిని నిర్వహించకపోవడంలో ఆసక్తి చూపకు.
భాష్యము : విధ్యుక్తధర్మాలు, దుష్కర్మలు, అకర్మ అనే మూడు రకాల విషయాలు ఇక్కడ ఉన్నాయి. మనిషికి అబ్బినట్టి ప్రకృతి గుణాల ననుసరించి ఉపదేశించబడిన కర్మలే విధ్యుక్తధర్మాలు, దుష్కర్మలంటే ప్రామాణికుని అనుమతి లేకుండ చేసే కర్మలని అర్థం.
విధ్యుక్తధర్మాలను చేయకపోవడము ఆకర్మ, అర్జునుడు అకర్మునిగా కావద్దని,ఫలాసక్తి లేకుండ విధ్యుక్తధర్మము నిర్వహించాలని భగవంతుడు ఉపదేశించాడు. తన కర్మఫలం పట్ల ఆసక్తుడయ్యేవాడు కర్మకు కూడ కారణమౌతాడు. ఆ విధంగా అతడు- అట్టి కర్మఫలాలచే సుఖి లేదా దుఃఖి అవుతాడు.
విధ్యుక్షధర్మాలకు సంబంధించినంతవరకు వాటిని నిత్యకర్మ, అత్యవసర కర్మ ఇష్టమైన కర్మ అనే మూడు తరగతులుగా విభజించవచ్చును. శాస్త్రాదేశానుసారముగా ఫలవాంఛ లేకుండ విధిగా నిర్వహించబడే నిత్యకర్మ 'సత్త్వగుణకర్మ' అవుతుంది. ఫలముతో కూడిన కర్మ బంధకారణము అవుతుంది కనుక అట్టి కర్మ మంగళకరము. విధ్యుక్తధర్మ విషయంలో ప్రతియొక్కరికి స్వంత అధికారము ఉన్నది. కాని ఫలాసక్తి లేకుండ అతడు వర్తించాలి. అటువంటి అపేక్షారహితమైన విధ్యుక్తకలాపాలు నిస్పందేహంగా మనిషిని మోక్షపథానికి నడిపిస్తాయి. కనుక ఫలాసక్తి రహితంగా విధిగా యుద్దం చేయమని అర్జునునికి భగవంతునిచే ఉపదేశించబడింది. యుద్ధంలో అతడు పాల్గొనకపోవడం ఇంకొక రకమైన ఆసక్తి . అటువంటి ఆసక్తి మనిషిని ఏనాడూ మోక్షపథానికి నడిపించదు. ఏ ఆసక్తియైనా, అది మంచిదే గాని, చెడ్డదే గాని బంధానికే కారణమౌతుంది. అకర్మ పాపమయము. కనుక విధిగా యుద్ధము చేయడమే అర్జునునికి ఏకైక మంగళకరమైన ముక్తిపథము.
శ్లోకము - 48
యోగస్థః కురు కర్మాణి సజ్గం త్యక్త్వా ధనంజయ |
సిద్ధసిద్ధోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే ||
యోగస్థః - సమత్వభావనతో; కురు - నిర్వహించు; కర్మాణి - నీ విధులను; సజ్గం - ఆసక్తిని; త్యక్త్వా - విడిచి; ధనంజయ - ఓ అర్జునా; సిద్ధ్య అసిద్ధ్యః - జయములో, అపజయములో; సమః - సమభావము; భూత్వా - కలవాడవై; సమత్వం - సమత్వమే; యోగః - యోగమని; ఉచ్యతీ - పిలువబడుతుంది.
ఓ అర్జునా! జయము, అపజయను పట్ల సమస్త ఆసక్తిని విడిచిపెట్టి సమత్యభావనలో నీ విధిని నిర్వహించు. అటువంటి సమత్వమే యోగమని పిలువబడుతుంది.
భాస్యము : యోగంలో వర్తించమని అర్జునునితో శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. ఇక ఆ యోగమంటే ఏమిటి? నిరంతరము కలతపెట్టే ఇంద్రియాలను నిగ్రహించి మనస్సును పరబ్రహ్మముపై లగ్నం చేయడమే యోగము. మరి పరబ్రహ్మమేవ్వరు? పరబ్రహ్మము. భగవంతుడే, సాక్షాత్తుగా ఆతడే యుద్ధం చేయమని చెబుతున్నాడు కనుక అర్జునునికి యుద్ధఫలితాలతో ఎటువంటి సంబంధము లేదు. లాభము లేదా జయము అనేవి కృష్ణునికి సంబంధించిన విషయాలు. కృష్ణాదేశానుసారము పని చేయమని మాత్రమే అర్జునునికి ఉపదేశించబడింది. కృష్ణాదేశపాలనమే నిజమైన యోగము. కృష్ణభక్తిభావన అని పిలువబడే విధానంలో ఇది ఆచరింపబడుతుంది. కేవలము కృష్ణభక్తిభావన ద్వారానే మనిషి స్వామ్యభావనను విడిచిపెట్టగలుగుతాడు. మనిషి కృష్ణదాసుడు లేదా కృష్ణదాసునికి దాసుడు కావాలి. కృష్ణభక్తిభావనలో విధినిర్వహణకు ఇదే సరియైన మార్గము. అదే అతనికి యోగంలో పనిచేయడానికి తోడ్పడుతుంది.
అర్జునుడు క్షత్రియుడు; అతడు నిజానికి వర్ణాశ్రమ ధర్మవిధానంలో నెలకొని ఉన్నాడు. వర్గాశ్రమ ధర్మపద్ధతిలో విష్ణుప్రీతియే పూర్ణక్ష్యమని విష్ణువురాణంలో చెప్పబడింది. స్వీయసంతృప్తే భౌతికజగత్తులో నియమము. కాని మనిషి తనను సంతృప్తిపరచుకోవడం గాక శ్రీకృష్ణుని సంతృప్తిపరచాలి. శ్రీకృష్ణుని సంతృప్తిపరచనిదే అతడు వర్ణాశ్రమధర్మ నియమాలను చక్కగా పాటించలేడు. కృష్ణుడు చెప్పినట్లుగా నడుచుకొమ్మని అర్జునునికి పరోక్షంగా బోధించబడింది.
శ్లోకము - 49
దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయ |
బుద్దౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహీతవః ||
దూరేణ - దూరంగా విడిచి; హి - నిశ్చయంగా; అవరం - అతి దుష్టమైన; కర్మ - కర్మను; బుద్ధియోగాత్ - కృష్ణభక్తిభావనా బలముపై; ధనంజయ - ధనమును జయించినవాడా; బుద్దౌ - అట్టి భావనలో; శరణం - సంపూర్ణ శరణాగతికి; అన్విచ్చ - ప్రయత్నించు; కృపణాః - లోభులు; ఫలహేతవః - కామ్యపలాలను కోరేవారు.
ఓ ధనంజయా! భక్తియోగము ద్వారా సమస్త దుష్టకార్యాలను దూరం చేసి, ఆ భావనలో భగవంతుని శరణుజొచ్చుము. తమ కర్మఫలాలను భోగింపగోరేవారు లోభులు.
భాష్యము : భగవంతుని నిత్యదాసునిగా తన సహజస్థితిని నిజంగా అర్థం చేసికొనినవాడు కృష్ణభక్తిభావనలో పనిచేయడం మినహా సమస్త కార్యాలను విడిచిపెడతాడు. ఇదివరకే వివరించినట్లు బుద్ధియోగమంటే భగవంతుని దివ్యమైన ప్రేమయుతసేవ. అటువంటి భక్తియుతసేవయే జీవునికి నిజమైన కర్మమార్గము. కేవలము లోభులే మరింతగా భవబంధంలో చిక్కువడడానికి తమ కర్మఫలాలను అనుభవింపగోరుతారు.
కృష్ణభక్తిభావనలో కర్మ తప్ప సమస్త కార్యాలు అతిదుష్టమైనవే. ఎందుకంటే అవి కర్తను నిరంతరము జన్మమృత్యువుల చక్రంలో బంధిస్తాయి. కనుక మనిషి ఎన్నడును కర్మకు కారణము కావాలని కోరుకోకూడదు. ప్రతీదీ కృష్ణప్రీత్యర్థము కృష్ణభక్తిభావనలోనే నిర్వహించాలి. అదృష్టం ద్వారానో, కష్టించి పనిచేయడం ద్వారానో తాము కూడబెట్టే ధనసంపత్తులను ఏ విధంగా ఖర్చు పెట్టాలో లోభులకు తెలియదు. మనిషి తన శక్తులన్నింటిని కృష్ణభక్తిభావనలో పనిచేయడానికే నియోగించాలి. అదే అతని జీవితాన్ని జయప్రదం చేస్తుంది. లోభుల లాగానే అదృష్టహీనజనులు తమ మానవశక్తిని భగవత్సేవలో వినియోగించరు.