మానవాళిని సంసారపు అజ్ఞానము నుండి ఉద్దరించడమే భగవద్గీత ఉద్దేశ్యము. ప్రతీ మానవుడు అనేక రకాలుగా కష్టాలలో ఉన్నాడు. అర్జునుడు కూడ అలాగే కురుక్షేత్ర రణరంగంలో యుద్ధం చేయవలసిన కష్టంలో చిక్కుకున్నాడు. కాని అతడు శ్రీకృష్ణునికి శరణాగతుడయ్యాడు. తత్ఫలితంగా ఈ భగవద్గీత చెప్పబడింది.
కేవలము అర్జునుడే కాదు, ఈ సంసార కారణంగా మనలో ప్రతియొక్కరము చింతాపూర్ణులమై ఉన్నాము. మన అస్తిత్వమే అసత్తు వాతావరణంలో ఉన్నది. నిజానికి మనము అసత్తుచే బెదిరింపబడడానికి లేము. మన అస్తిత్వము నిత్యమైనది. కాని ఏదో కారణంగా మనము అసత్తులో ఉంచబడ్డాము. అసత్తు అనేది అస్తిత్వము లేనిదానిని సూచిస్తుంది.
దుఃఖితులయ్యే అనేకానేక మానవులలో అతికొద్దిమంది మాత్రమే తామెవరు తామెందుకు ఈ వికారమైన స్థితిలో ఉంచబడ్డామంటూ తమ స్థితిని గురించి నిజంగా విచారణ చేస్తారు. మనిషి తన దుఃఖము గురించి అడిగే ఈ స్థితికి మేల్కాంచనంతవరకు, తనకు దుఃఖము వద్దేవద్దని, పైగా సమస్త దుఃఖాలకు తాను పరిష్కారము చూపుతానని అతడు అనుకోనంతవరకు పరిపూర్ణ మానవునిగా భావించబడడు. మనస్సులో ఇటువంటి విచారణ జాగృతమైనప్పుడే మానవత్వము ప్రారంభమౌతుంది.
బ్రహ్మసూత్రాలలో ఈ విచారణ "బ్రహ్మ జిజ్ఞాసా" అని చెప్పబడుతుంది. "అథాతో బ్రహ్మజిజ్ఞాసా". పరతత్త్వ స్వభావము గురించి విచారణ చేయనంతవరకు మనిషి యొక్క ప్రతీ కార్యము భంగపాటుగానే భావించబడుతుంది. అందుకే తామెందుకు దుఃఖాలకు గురౌతున్నామని లేదా తామెక్కడ నుండి వచ్చామని, మరణము తరువాత ఎక్కడకు వెళతామని ప్రశ్నించడము మొదలుపెట్టినవారే భగవద్గీత అవగాహనకు తగిన విద్యార్థులు, శ్రద్ధావంతుడైన విద్యార్థి దేవదేవుని పట్ల దృడమైన గౌరవము కూడ కలిగి ఉండాలి, అటువంటి విద్యార్థే అర్జునుడు.
జీవితము యొక్క నిజమైన ఉద్దేశ్యాన్ని మనిషి మరిచిపోయినప్పుడు దానిని పునఃస్థాపించడానికే శ్రీకృష్ణభగవానుడు ప్రత్యేకంగా అవతరిస్తాడు. అయినా కూడ ఆ విధంగా మేల్కొన్న అనేకానేక మాసనవులలో నిజానికి ఒక్కడు మాత్రమే తన స్థితిని గురించిన అవగాహనలో నిజంగా ప్రవేశిస్తాడు. అటువంటివాని కొరకే ఈ భగవద్గీత బోధించబడింది. నిజానికి మనమందరము అజ్ఞానమనే ఆడపులిచే మింగివేయబడ్డాము. కాని భగవంతుడు జీవులపై, ముఖ్యంగా మానవులపై పరమ దయాళువై ఉన్నాడు. అందుకే ఆతడు తన మిత్రుడైన అర్జునుని శిష్యునిగా చేసికొని భగవద్గీతను ఉపదేశించాడు.
: విషయసూచిక :
భగవద్గీత అధ్యాయములు
» 1. మొదటి అధ్యాయము: కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము
|
వివరణ: కురుక్షేత్ర రణరంగమున పరస్పరము విరోధించే సేనలు యుద్ధానికి సన్నద్ధమై నిలువగా మహాయోధుడైన అర్జునుడు ఇరుసేనలలో సన్నిహిత. బంధువులను, గురువులను, మిత్రులను చూసాడు. వారందరు యుద్ధం చేసి ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడి ఉన్నారు. విషాదము, కరుణ ఆవరించగా అతడు బలమును కోల్పోయి మనస్సు భ్రాంతిమయము కాగా యుద్ధనిశ్చయాన్ని విడిచిపెడతాడు. |
2. రెండవ అధ్యాయము: గీతాసారము |
వివరణ: అర్జునుడు శిష్యునిగా శ్రీకృష్ణభగవాసునికి శరణాగతుడౌతాడు. తాత్కాలికమైన భౌతికదేహానికి, నిత్యమైన ఆత్మకు ఉన్నట్టి మూలభేదాన్ని వివరిస్తూ శ్రీకృష్ణుడు అతనికి ఉపదేశమును ప్రారంభిస్తాడు. పునర్జన్మ విధానమును, నిస్వార్థమైన భగవత్సేవా స్వభావమును, ఆత్మదర్శియైన వ్యక్తి యొక్క లక్షణాలను భగవంతుడు వివరిస్తాడు. |
3. మూడవ అధ్యాయము: కర్మయోగము |
వివరణ: ఈ భౌతికజగత్తులో ప్రతియొక్కడు ఏదో ఒక రకమైన కర్మలో తప్పక నెలకొనవలసి ఉంటుంది. కాని కర్మలు అతడిని ఈ జగత్తులో బంధించడమో లేదా దీని నుండి ముక్తుని చేయడమో చేస్తాయి. భగవంతుని ప్రీత్యర్థము నిస్వార్ధముగా పనిచేయడము ద్వారా మనిషి కర్మసిద్ధాంతము (చర్య, ప్రతిచర్య) నుండి ముక్తుడై ఆత్మపరమాత్మల దివ్యజ్ఞానాన్ని పొందుతాడు. |
4. నాలుగవ అధ్యాయము: దివ్యజ్ఞానము |
వివరణ: దివ్యజ్ఞానము, అంటే ఆత్మ, భగవంతుడు, వారి సంబంధము గురించిన ఆధ్యాత్మిక జ్ఞానము పునీతము చేసేది, ముక్తిని కలిగించేది రెండూ అయి యుంటుంది. అట్టి జ్ఞానము నిస్వార్థమైన భక్తిమయకర్మ (కర్మయోగపు) ఫలము. గీత యొక్క అత్యంత పురాతన చరిత్రను, భౌతికజగత్తులో కాలక్రమము చొప్పున కలిగే తన అవతరణల ఉద్దేశ్య ప్రాధాన్యతలను, గురువును (ఆత్మదర్శియైన బోధకుడు) ఆశ్రయించవలసిన అవసరమును భగవానుడు వివరిస్తాడు. |
5. ఐదవ అధ్యాయము: కర్మయోగము - కృష్ణభక్తిభావనలో కర్మ |
వివరణ: బాహ్యానికి అన్ని కర్మలను చేస్తున్నా ఆంతరముగా వాటి ఫలాలను త్యజించే వివేకవంతుడు దివ్య జ్ఞానాగ్నిచే పవిత్రుడై శాంతిని, అసంగత్వమును, ఓర్పును, ఆధ్యాత్మికదృష్టిని, ఆనందమును పొందుతాడు. |
6. ఆరవ అధ్యాయము: ధ్యానయోగము |
వివరణ: అష్టాంగయోగము, అంటే యాంత్రికమైన ధ్యానయోగసాధన మనస్సును ఇంద్రియాలను నిగ్రహించి ధ్యానమును పరమాత్మునిపై (హృదయంలో నెలకొనినట్టి భగవద్రూపము) నిలుపుతుంది., ఈ సాధన సమాధిని (పూర్ణ భగవచ్చెతన్యమును) కలుగజేస్తుంది. |
7. ఏడవ అధ్యాయము: భగవద్విజ్ఞానము |
వివరణ: శ్రీకృష్ణభగవానుడే పరతత్త్వము, పరమకారణము, భౌతికము ఆధ్యాత్మికము అయిన సమస్తానికీ పోషణశక్తి, మహాత్ములు భక్తితో ఆతనికి శరణుజొచ్చుతారు.కాగా పాపాత్ములు తమ మనస్సును ఇతర ఆరాధ్య విషయాల వైపుకు మళ్ళిస్తారు. |
8. ఎనిమిదవ అధ్యాయము: భగవత్ప్రాతి |
వివరణ: జీవితము మొత్తము ముఖ్యంగా మరణసమయంలో భక్తితో శ్రీకృష్ణభగవాసుని స్మరించడము ద్వారా మనిషి భౌతికజగత్తుకు అలీతమైన పరంధామమును పొందుతాడు. |
9. తొమ్మిదవ అధ్యాయము: పరమగుహ్య జ్ఞానము |
వివరణ: త్రీకృష్ణుడే దేవాదిదేవుడు, పరమ ఆరాధ్య విషయము. దివ్యమైన భక్తియుతసేవ (భక్తి) ద్వారా ఆత్మ నిశ్చయముగా ఆతనితో సంబంధము కలిగి ఉన్నది. విశుద్ధభక్తిని జాగృతము చేసికోవడము ద్వారా మనిషి ఆధ్యాత్మికజగత్తులో శ్రీకృష్ణుని దగ్గరకే తిరిగి వెళతాడు. |
10. పదియవ అధ్యాయము: భగవద్విభూతి |
వివరణ: భౌతికజగత్తులో గాని, ఆధ్యాత్మిక జగత్తులో గాని శక్తిని, సౌందర్యమును వైభవమును, ఔన్నత్యమును ప్రదర్శించే అన్ని అద్భుతమైన విషయాలు శ్రీకృష్ణుని దివ్యశక్తులు మరియు వైభవాల పాక్షిక రూపములే అవుతాయి. సర్వకారణాలక పరమ కారణునిగా, సమస్తానికీ ఆధారము మరియు సారముగా శ్రీకృష్ణుడే సకల జీవుల పరమ పూజాధ్యేయము. |
11. పదునొకండవ అధ్యాయము: విశ్వరూపము |
వివరణ: శ్రీకృష్ణభగవానుడు అర్జునునికి దివ్యదృష్టిని ప్రసాదించి తన అనంతమైన విశ్వరూపాన్ని ప్రకటిస్తాడు, ఆ విధంగా ఆతడు తన దివ్యత్వాన్ని నిస్సయంశయముగా స్థాపన చేసాడు. తన సర్వసుందరమైన మానవుని బోలిన రూపమే భగవంతుని మూలరూపమని శ్రీకృష్ణుడు వివరిస్తాడు. కేవలము విశుద్ధ భక్తి ద్వారానే మనిషి ఈ రూపాన్ని చూడగలుగుతాడు. |
12. పండ్రెండవ అధ్యాయము: భక్తియోగము |
వివరణ: భక్తియోగము, అంటే శ్రీకృష్ణభగవానుని విశుద్ధ భక్తియుతసేవయే ఆధ్యాత్మిక ఆస్తిత్వ పరమావధియైన విశుద్ధ కృష్ణప్రేమను పొందడానికి అత్యున్నతమైన, ఆవశ్యకమైన పద్ధతి, ఈ పరమ పథమును పాటించేవారు దివ్యగుణాలను పెంపొందించుకుంటారు. |
13. పదుమూడవ అధ్యాయము: ప్రకృతి, పురుషుడు, చైతన్యము |
వివరణ: దేహముకు, ఆత్మకు, ఆ రెండింటికి అతీతంగా ఉండే పరమాత్మకు భేదమును అర్థము చేసికొన్నవాడు ఈ భౌతికజగత్తు నుండి ముక్తిని పొందుతాడు. |
14. పదునాలుగవ అధ్యాయము: ప్రకృతి త్రిగుణములు |
వివరణ: దేహధారులైన జీవులందరు త్రిగుణాల, అంటే సత్త్వరజస్తమోగుణాల ఆధీనంలో ఉన్నారు. ఈ గుణాలంటే ఏమిటో, అవి మనపై ఏ విధంగా పనిచేస్తాయో మనిషి వాటిని ఏ విధంగా దాటుతాడో, దివ్యస్థితిని పొందినవాని లక్షణాలేమిటో శ్రీకృష్ణభగవానుడు వివరిస్తాడు. |
15. పదునైదవ అధ్యాయము: పురుషోత్తమ యోగము |
వివరణ: భౌతికజగత్తు బంధనము నుండి విడివడడము, శ్రీకృష్ణుని దేవాదిదేవునిగా అర్థం చేసికోవడమే వేదజ్ఞానము యొక్క చరమ ఉద్దేశము. శ్రీకృష్ణుని పరమ రూపమును ఎరిగినవాడు ఆతనికి శరణాగతుడై భక్తియుతసేవలో నెలకొంటాడు. |
16. పదునారవ అధ్యాయము: దైవాసుర స్వభావములు |
వివరణ: అసుర గుణాలను కలిగియుండి శాస్త్రవిధులను పాటించకుండ చపలచిత్తముతో జీవించేవారు నీచజన్మలను పొంది భవబంధాన్ని మరింత పెంచుకుంటారు. కాని దివ్యగుణాలను కలిగి శాస్త్రప్రమాణానికి కట్టుబడి నియమిత జీవితాన్ని గడిపేవారు క్రమంగా ఆధ్యాత్మిక పూర్ణత్వాన్ని పొందుతారు. |
17. పదునేడవ అధ్యాయము: భక్తియోగము |
వివరణ: భక్తియోగము, అంటే శ్రీకృష్ణభగవానుని విశుద్ధ భక్తియుతసేవయే ఆధ్యాత్మిక ఆస్తిత్వ పరమావధియైన విశుద్ధ కృష్ణప్రేమను పొందడానికి అత్యున్నతమైన, ఆవశ్యకమైన పద్ధతి, ఈ పరమ పథమును పాటించేవారు దివ్యగుణాలను పెంపొందించుకుంటారు. |
18. పదుమూడవ అధ్యాయము: ప్రకృతి, పురుషుడు, చైతన్యము |
వివరణ: దేహముకు, ఆత్మకు, ఆ రెండింటికి అతీతంగా ఉండే పరమాత్మకు భేదమును అర్థము చేసికొన్నవాడు ఈ భౌతికజగత్తు నుండి ముక్తిని పొందుతాడు. |
19. పదునాలుగవ అధ్యాయము: ప్రకృతి త్రిగుణములు |
వివరణ: దేహధారులైన జీవులందరు త్రిగుణాల, అంటే సత్త్వరజస్తమోగుణాల ఆధీనంలో ఉన్నారు. ఈ గుణాలంటే ఏమిటో, అవి మనపై ఏ విధంగా పనిచేస్తాయో మనిషి వాటిని ఏ విధంగా దాటుతాడో, దివ్యస్థితిని పొందినవాని లక్షణాలేమిటో శ్రీకృష్ణభగవానుడు వివరిస్తాడు. |
20. పదునైదవ అధ్యాయము: పురుషోత్తమ యోగము |
వివరణ: భౌతికజగత్తు బంధనము నుండి విడివడడము, శ్రీకృష్ణుని దేవాదిదేవునిగా అర్థం చేసికోవడమే వేదజ్ఞానము యొక్క చరమ ఉద్దేశము. శ్రీకృష్ణుని పరమ రూపమును ఎరిగినవాడు ఆతనికి శరణాగతుడై భక్తియుతసేవలో నెలకొంటాడు. |
21. పదునారవ అధ్యాయము: దైవాసుర స్వభావములు |
వివరణ: అసుర గుణాలను కలిగియుండి శాస్త్రవిధులను పాటించకుండ చపలచిత్తముతో జీవించేవారు నీచజన్మలను పొంది భవబంధాన్ని మరింత పెంచుకుంటారు. కాని దివ్యగుణాలను కలిగి శాస్త్రప్రమాణానికి కట్టుబడి నియమిత జీవితాన్ని గడిపేవారు క్రమంగా ఆధ్యాత్మిక పూర్ణత్వాన్ని పొందుతారు. |
22. పదునేడవ అధ్యాయము: శ్రద్ధాత్రయ విభాగాలు |
వివరణ: భౌతికప్రకృతి త్రిగుణాలకు సంబంధించినవై, వాటి నుండి ఉద్భవించినట్టి మూడు రకాల శ్రద్ధలు ఉన్నాయి. రజోగుణంలో, తమోగుణంలో ఉన్నట్టి శ్రద్ధను కూడినవారిచే చేయబడే కర్మలు కేవలము తాత్కాలికమైన భౌతికఫలితాలనే ఇస్తాయి. కాగా శాస్త్రాదేశానుసారము సత్త్వగుణంలో చేయబడే కర్మలు హృదయాన్ని నిర్మలము చేసి, శ్రీకృష్ణభగవానుని యెడ విశుద్ధమైన విశ్వాసాన్ని, భక్తిని కలుగజేస్తాయి. |
23. పదునెనిమిదవ అధ్యాయము: ముగింపు - సన్న్యాసము యొక్క పూర్ణత్వము |
వివరణ: సన్న్యాసము యొక్క అర్థమును, మానవ చైతన్య కర్మలపై ప్రకృతి గుణ ప్రభావమును శ్రీకృష్ణుడు వివరిస్తాడు. బ్రహ్మానుభూతిని, భగవద్గీత మహిమలను, గీత యొక్క చరమ సారాంశమును అంటే తన యెడ పూర్ణమైన, నిబంధనారహితమైన ప్రేమయుత శరణాగతే మహోన్నతమైన ధర్మపథమని ఆతడు వివరిస్తాడు. ఆ శరణాగతి మనిషిని సర్వపాప విముక్తుని చేస్తుంది, పరిపూర్ణ జ్ఞానస్థితికి అతనిని తీసికొనివస్తుంది, శ్రీకృష్ణుని నిత్యమైన ధామానికి అతడు తిరిగి చేరుకునేటట్లు చేస్తుంది. |