శ్లోకము - 14
మాత్రాస్పర్శాస్తు కౌన్తేయ శీతోష్ణసుఖదుఃఖదాః |
ఆగమాపాయినోకనిత్యాస్తాంస్తితిక్షస్వ భారత ||
మాత్రాస్పర్సాః - ఇంద్రియానుభూతి; తు - కేవలము; కౌన్తేయ - ఓకుంతీపుత్రా: శీత - చలికాలము; ఉష్ణ - ఎండాకాలము; సుఖ - నుఖమును; దుఃఖ - దుఃఖమును; దాః - కలిగించేవి; ఆగమ - రావడం; ఆపాయినః - పోవడం; అనిత్యాః - తాత్కాలికమైనవి; తాన్ - వాటిని; తితిక్షస్వ - ఓర్చుకోవాలి; భారత - భరతవంశీయుడా.
ఓ కౌంతేయా! సుఖదుఃఖాలు తాత్కాలికముగా కలగడము, కాలక్రమంలో అవి పోవడము చలికాలము, ఎండాకాలము వచ్చిపోవడము వంటిది. ఓ భరతవంశీయుడా అవి ఇంద్రియానుభూతి వలన కలుగుతాయి. కలత చెందకుండ వాటిని ఓర్చుకోవడము మనిషి తప్పక నేర్చుకోవాలి
భాష్యము : సక్రమమైన విధినిర్వహణలో తాత్కాలికంగా వస్తూపోతూ ఉండే సుఖదుఃఖాలను ఓర్చుకోవడం మనిషి నేర్చుకోవాలి. వేదనియమము ప్రకారం మనిషి మాఘమాసంలో (జనవరి ఫిబ్రవరి) కూడ తెల్లవారుఝామునే స్నానం చేయాలి. ఆ సమయంలో చాలా చలిగా ఉన్నప్పటికిని ధర్మాచరణకు కట్టుబడి ఉండేవాడు స్నానం చేయడానికి సంశయించడు. అదేవిధంగా ఎండాకాలంలో అత్యంత వేడి సమయమైన మే, జూన్ నెలలలో కూడ స్త్రీ వంటశాలలో వంట చేయడానికి వెనుకాడదు. వాతావరణ అసౌకర్యాలు ఉన్నప్పటికిని మనిషి తన విధి నిర్వహణ చేయాలి. అదేవిధంగా యుద్ధం చేయడం క్షత్రియుల ధర్మం. మిత్రునితో లేదా బంధువుతో యుద్ధం చేయవలసి వచ్చినా క్షత్రియుడు తన ధర్మం నుండి తప్పుకోకూడదు. జ్ఞానస్థాయికి ఎదగడం కొరకు మనిషి ధర్మానికి సంబంధించిన విధినియమాలను తప్పక పాటించాలి. ఎందుకంటే జ్ఞానము భక్తి ద్వారానే అతడు తనను మాయాబంధము నుండి ముక్తుని చేసికోగలుగుతాడు.
అర్జునుని రెండు పేర్లతో సంబోధించడం కూడ ముఖ్యమైనది. "కౌంతేయా" అని సంబోధించడము అతని తల్లి వైపు రక్తసంబంధాన్ని, “భారత" అని సంబోధించడము అతని తండ్రి వైపు నుండి వచ్చిన గొప్పదనాన్ని సూచిస్తున్నది. రెండు వైపుల నుండి అతడు గొప్ప వారసత్వం కలిగి ఉన్నాడు. గొప్ప వారసత్వము విధినిర్వహణ విషయంలో బాధ్యతను తెచ్చి పెడుతుంది. కనుక అతడు యుద్ధం మానకూడదు.
శ్లోకము - 15
యం హి న వ్యథయన్త్యేతే పురుషం పురుషర్భభ |
సమదు:ఖసుఖం ధీరం సోకమృతత్వాయ కల్పతే ||
యం - ఎవనిని; హి - నిశ్చయంగా; న వ్యథయన్తి - బాధింపవో; ఏతే - ఇవన్నీ; పురుషం - మనిషిని; పురుష ఋషభా - ఓ మానవులలో శ్రేష్ఠుడా; సమ - మార్పు లేకుండ; దుఃఖ - దుఃఖంలో; సుఖం - సుఖంలో; ధీరం - ఓర్పు కలవాడు; సః - అతడు; ఆమృతత్వాయ - మోక్షానికి; కల్పతే - అర్జునిగా భావించబడతాడు.
మానవులలో శ్రేష్ఠుడా (అర్జునా)! సుఖదుఃఖాలచే కలతచెందక ఆ రెండింటిలోను స్థిరంగా ఉండేవాడు నిశ్చయంగా మోక్షానికి అర్హుడౌతాడు.
భాష్యము : ఉన్నతమైన ఆధ్యాత్మికానుభూతి స్థితి పట్ల స్థిరనిశ్చయుడై ఉండి సుఖదుఃఖాల తాకిడిని సమానంగా సహింపగలిగేవాడు మోక్షానికి అర్హుడు. వర్ణాశ్రమ విధానంలోని నాలుగవ ఆశ్రమస్థితి అంటే సన్న్యాసము చాలా కష్టమైన స్థితి. కాని జీవితాన్ని పరిపూర్ణం చేసికోవడం పట్ల శ్రద్ధ కలవాడు ఎన్ని కష్టాలు కలిగినప్పటికిని తప్పకుండ సన్న్యాసాశ్రమము స్వీకరిస్తాడు. కుటుంబ సంబంధాలను త్రెంచుకోవలసి ఉండడం, భార్యాపిల్లల సంబంధాన్ని విడిచిపెట్టవలసి ఉండడం వలననే సాధారణంగా అటువంటి కష్టాలు కలుగుతాయి. కాని ఎవడైనా అటువంటి కష్టాలను సహించగలిగితే అతని ఆధ్యాత్మికానుభూతి మార్గము తప్పకుండ పూర్ణమౌతుంది. అదేవిధంగా స్వీయ వంశీయులతో లేదా అటువంటి ప్రియమైనవారితో యుద్ధం చేయడం కష్టమేయైనా క్షత్రియునిగా విధినిర్వహణలో అర్జునుడు పట్టుదలతో ఉండాలని ఉపదేశించబడింది.
శ్రీవైతన్యమహాప్రభువు ఇరవైనాలుగేండ్ల వయస్సులో సన్న్యాసము తీసికొన్నారు. ఆయనపై ఆధారపడినట్టి భార్యకు, తల్లికి వేరే పోషకులే లేరు. అయినా ఉన్నతమైన ప్రయోజనం కొరకు ఆయన సన్న్యాసము తీసికొని ఉన్నతవిధి నిర్వహణలో స్థిరంగా నిలిచారు. భవబంధము నుండి మోక్షాన్ని పొందడానికి అదే మార్గము.
శ్లోకము - 16
నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః |
ఉభయోరపి దృష్టోకిస్తస్త్వనయోన్తస్త్వదర్శిభిః ||
అసతః - ఉనికి లేనిదానికి; న విద్యతే - లేదు; భావః - ఉండడము; అభావః - మార్పు స్వభావము; న విద్యతే - లేదు; సతః - నిత్యమైనదానికి; ఉభయోః - రెండింటి; అపి - చక్కగా; దృష్టః - దర్శించబడింది; అస్తః - నిర్ణయము; తు - నిజంగా; అనయోః - వాటి; తత్త్వః - సత్యమును; దర్శిభిః - చూడగలిగినవారిచే.
ఉనికి లేనిది (భౌతికదేహము) ఉండేది కాదని, నిత్యమైనది (ఆత్మ) మార్పు లేనిదని సత్యమును దర్శించినవారు నిర్ణయించారు. ఈ రెండింటి స్వభావమును అధ్యయనం చేసి వారు ఇది నిర్ణయించారు.
భాష్యము : మార్పు చెందే దేహము ఉండేది కాదు. వివిధ కణాల చర్యప్రతిచర్యల వలన దేహము ప్రతీక్షణము మారుతోందని ఆధునిక వైద్యశాస్త్రము అంగీకరించింది. ఈ విధంగా దేహంలో పెరుగుదల, ముసలితనము రావడం జరుగుతోంది. కాని దేహంలో మనస్సులో ఎన్ని మార్పులు జరిగినప్పటికిని ఆత్మ అదేవిధంగా శాశ్వతంగా నిలిచి ఉంటుంది. భౌతికపదార్థానికి, ఆత్మకు తేడా ఇదే. స్వభావరీత్యా దేహము సదా మార్పు చెందేది, కాగా ఆత్మ నిత్యమైనది. అన్ని వర్గాల తలత్త్వదర్శులచే, అంటే నిరాకారవాదులు, సాకారవాదులు ఇరువురిచే ఈ అభిప్రాయము అంగీకరించబడింది. విష్ణువు, ఆతని ధామాలు స్వయంప్రకాశక ఆధ్యాత్మిక ఉనికిని కలిగియున్నట్లు (జ్యోతీంపషి విష్ణుర్భువనాని విష్ణు) విష్ణువురాణంలో (2.12.38) చెప్పబడింది. సత్, అసత్ అనే పదాలు వరుసగా కేవలము ఆత్మను, భౌతికపదార్థాన్ని సూచిస్తాయి. సత్యాన్ని దర్శించిన వారందరిదీ ఇదే అభిప్రాయము.
అజ్ఞాన ప్రభావముచే మోహితులయ్యే జీవులకు భగవంతుని ఉపదేశ మూలము ఇదే. అజ్ఞాన నశింపు కార్యంలో అర్చకుడు అర్చనీయుని మధ్య నిత్యసంబంధాన్ని తిరిగి నెలకొల్పడం, దాని ద్వారా అంశలైన జీవులకు, భగవంతునికి మధ్య ఉన్నట్టి భేదాన్ని అవగాహన చేసికోవడమనే అంశాలు ఇమిడి ఉంటాయి. తనకు, భగవంతునికి గల భేదము అంశము, పూర్ణము మధ్య ఉండే సంబంధ రూపంలో అర్థం చేసికొని తనను గురించిన సంపూర్ణ అధ్యయనం ద్వారా మనిషి భగవానుని స్వభావాన్ని అర్థం చేసికోగలడు. వేదాంతసూత్రాలలోను, శ్రీమద్భాగవతంలోను భగవంతుడే సకల సృష్థలకు మూలముగా అంగీకరించబడ్డాడు. అట్టి సృష్టులు పర, అపరాష్రకృతుల ద్వారా అనుభూతమౌతాయి. ఏడవ అధ్యాయంలో తెలుపబడనున్నట్లు జీవులు పరాప్రకృతికి చెందినవారు. శక్తికి, శక్తిమంతునికి భేదము లేనప్పటికిని శక్తిమంతుడు భగవంతుడని, శక్తి లేదా ప్రకృతి ఆధీనమైనదని అంగీకరించబడింది. అందుకే యజమాని, సేవకుని విషయంలో లాగా లేదా గురువు, శిష్యునిలాగా జీవులు సర్వదా భగవంతునికి ఆధీనులే అయియుంటారు. ఇంతటి స్పష్టమైన జ్ఞానం అజ్ఞానప్రభావంలో ఉన్నప్పుడు అర్థం కావడం అసాధ్యం. అటువంటి అజ్ఞానాన్ని తరిమివేయడానికే భగవంతుడు సర్వకాలాలలోని జీవుల జ్ఞానోపదేశానికి భగవద్గీతను బోధించాడు
'భగవద్గీత' యధాతథము - పుస్తకము కొరకు ఇక్కడ క్లిక్ చేయండి » |