శ్లోకము - 12
న త్యేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః |
న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరం ||
న = లేదు; తు - కాని, ఏవ - నిశ్చయముగా; అహం - నేను; జాతు - ఎప్పుడును; న ఆసం - లేకపోలేదు; న - లేదు; త్వం - నీవు; న - లేదు; ఇమే - ఈ అందరు; జనాధిపాః - రాజులు; న - ఏనాడు; చ - కూడ; ఏవ - నిక్కముగా; న భవిష్యామః - ఉండకపోము; సర్వే వయం - మనమందరము; అతః పరం – ఇక ముందు.
నేను గాని, నీవు గాని, ఈ రాజులందరు గాని నిలిచి ఉండని సమయమేదీ లేదు; భవిష్యత్తులో కూడ మనలో ఎవ్వరము ఉండకపోము.
భాష్యము : దేవదేవుడు అసంఖ్యాకమైన జీవులకు వారి వ్యక్తిగతకర్మ, కర్మఫలాల వివిధ స్థితులను బట్టి పోషకుడై ఉన్నాడని వేదాలలో, అంటే కఠోపనిషత్'లో ను, శ్వేతాశ్వతరోపనిషత్లోను చెప్పబడింది. అదే దేవదేవుడు తన ప్రధానాంశతో ప్రతీజీవుని హృదయంలో కూడ నిలిచి ఉంటాడు. అట్టి భగవంతుడిని లోపల, బయట చూడగలిగే సాధుపురుషులే నిజంగా పరిపూర్ణమైన, శాశ్వతమైన శాంతిని పొందగలుగుతారు.
నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం
ఏకో బహూనాం యో విదధాతి కామాన్ |
తమాత్మస్థం యేకనుపశ్యన్తి ధీరా
స్తేషాం శాన్తిః శాశ్వతీ నేతరేషాం ||
(కరోపనిషత్ 2.2.13)
అర్జునునికి తెలుపబడిన ఈ వేదసత్యమే నిజానికి జ్ఞానరహితులైనా తమను గొప్ప పండితులుగా చెప్పుకునే ప్రపంచంలోని వారందరికీ ఇవ్వబడింది. స్వయంగా తాను అర్జునుడు రణరంగంలో సమకూడిన రాజులందరు నిత్యులనీ మరియు బంధముక్త స్థితులు రెండింటిలోను వ్యక్తిగతజీవులకు తాను నిత్యపోషకుడనని భగవంతుడు ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు. దేవదేవుడు పరమపురుషుడు కాగా, ఆతని నిత్యసహచరుడైన అర్జునుడు, అక్కడ సమకూడిన రాజులందరు వ్యక్తిగత నిత్యపురుషులు. గతంలో వారు వ్యక్తిగతులుగా ఉండకపోలేదు, ఇకపై నిత్యపురుషులుగా ఉండకపోరు, వారి వ్యక్తితం గతంలో ఉంది, భవిష్యత్తులో కూడ ఎటువంటి అవరోధము లేకుండ కొనసాగుతుంది కనుక ఎవ్వరి కొరకు దుఃఖించడానికి కారణమే లేదు.
మాయావరణము, అంటే మోహము నుండి బయటపడి మోక్షాన్ని పొందిన తరువాత ఆత్మ నిరాకారబ్రహ్మములో లీసమై తన వ్యక్తిత్వాన్ని కోల్పోతుందనే మాయావాద సిద్ధాంతము పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణుని చే ఇక్కడ సమర్థించబడడం లేదు. వ్యక్తిత్వము గురించి మనము కేవలము బద్ధస్థితిలో ఆలోచిస్తామనే సిద్ధాంతము కూడ ఇక్కడ సమర్థించబడలేదు. ఉపనిషత్తులలో ధ్రువపరుపబడినట్లు తన వ్యక్తిత్వము ఇతరుల వ్యక్తిత్వము శాశ్వతంగా కొనసాగుతుందని శ్రీకృష్ణుడు ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు. శ్రీకృష్ణుడు మోహానికి గురికాడు. కనుక ఆతని మాట అత్యంత ప్రామాణికము అవుతుంది. వ్యక్తిత్వమనేది యథార్థమైన విషయం కాకపోతే శ్రీకృష్ణుడు భవిష్యత్తులోనైనా అంటూ దీనిని ఇంతగా నొక్కి చెప్పేవాడు కాదు, శ్రీకృష్ణుడు చెప్పిన వ్యక్తిత్వము భౌతికమైనదే గాని ఆధ్యాత్మికమైనది కాదని మాయావాది వాదించే అవకాశం
ఉన్నది.
వ్యక్తిత్వము భౌతికమైనదనే వాదాన్ని అంగీకరించినా శ్రీకృష్ణుని వ్యక్తిత్వములో భేదమును ఎట్టా చూడగలము? గతంలో తన వ్యక్తిత్వాన్ని రూఢిపరచిన శ్రీకృష్ణుడు భవిష్యత్తులో కూడ దానిని ధ్రువపరుస్తున్నాడు. తన వ్యక్తిత్వాన్ని పలురీతులుగా ఆతడు ధ్రువపరిచాడు. నిరాకారబ్రహ్మము ఆతనికి ఆధీనమై ఉన్నదని ప్రకటించబడింది. శ్రీకృష్ణుడు తన ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని అన్నిచోట్ల నిర్పిస్తూనే వచ్చాడు. ఆతడిని వ్యక్తిగత చైతన్యంలో ఉన్నట్టి సాధారణ బద్ధజీవునిగా భావిస్తే భగవద్గీతకు ప్రామాణిక గ్రంథమనే విలువ ఉండదు. నాలుగు మానవ దోషాలతో కూడి ఉండే సాధారణ మనిషి వినదగినదేదీ బోధించలేడు. గీత అటువంటి గ్రంథానికి అతీతమైనది. ఏ లౌకికగ్రంథము భగవద్గీతకు సాటిరాదు. మనిషి శ్రీకృష్ణుని సాధారణవ్యక్తిగా భావించగానే గీత తన సమస్త ప్రాముఖ్యాన్ని కోల్పోతుంది. ఈ శ్లోకంలో చెప్పబడిన బహుత్వం వ్యవహారికమని, అది దేహానికే అన్వయిస్తుందని మాయావాది వాదిస్తాడు. కాని అటువంటి దేహభావన కడచిన శ్లోకంలో ఇదివరకే ఖండించబడింది.
జీవుల దేహభావనను ఖండించిన తరువాత దేహాన్ని గురించిన వ్యవహారిక భావననే శ్రీకృష్ణుడు తిరిగి ఎందుకు ప్రతిపాదిస్తాడు. కనుక వ్యక్తిత్వము ఆధ్యాత్మిక పరిధిలోనే చెప్పబడింది. దీనిని శ్రీరామానుజాచార్యుల వంటి గొప్ప ఆచార్యులు ధ్రువపరిచారు. ఈ ఆధ్యాత్మిక వ్యక్తిత్వము భగవద్భక్తులకే అర్థమౌతుందని గీతలో అనేకచోట్ల స్పష్టంగా పేర్కొనబడింది. భగవంతుడనే విషయంలో శ్రీకృష్ణుని పట్ల అసూయ చూపేవారికి ఈ మహాగ్రంథము ఎప్పటికీ అర్థం కాదు. అభక్తుడు గీతోపదేశాలను తెలిసికోగోరే పద్దతి తేనెటీగ తేనెసీసాను నాకడంతో పోలుతుంది సీసామూత తీయనిదే మనిషి తేనెను ఆస్వాదించలేడు. అదేవిధంగా భగవద్గీత మహిమను కేవలం భక్తులే అర్థం చేసికొంటారు, ఇతరులు దానిని ఆస్వాదించలేరు. ఈ విషయం ఈ గ్రంథంలోని నాలుగవ అధ్యాయంలో చెప్పబడింది. అలాగే భగవంతుని ఉనికి పట్టనే అసూయ గలవారు కూడ గీతను తాకలేరు. అందుకే గీతకు మాయావాద వివరణము పూర్ణసత్యానికి అత్యంత తప్పు వ్యాఖ్యానమే అవుతుంది. మాయావాదులు చేసిన వ్యాఖ్యానాలను చదవకూడదని శ్రీచైతన్యమహాప్రభువు నిషేధించారు. అటువంటి మాయావాదతత్త్వ అవగాహనను స్వీకరించేవాడు నిజమైన గీతారహస్యాన్ని అర్థం చేసికోవడానికి కావలసిన శక్తినంతా కోల్పోతాడని ఆయన హెచ్చరించారు. వ్యక్తిత్వమనేది భౌతికజగత్తుకు సంబంధించినదైతే భగవంతుని ఉపదేశం అవసరమే లేదు. వ్యక్తిగత ఆత్మ, భగవంతుడు అనే బహుత్వము నిత్యసత్యము. పైన పేర్కొనబడినట్లు ఇది వేదాలచే ధ్రువపరుపబడింది.
శ్లోకము - 13
దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా |
తథా దేహాన్తరప్రాప్తిర్దీరస్తత్ర న ముహ్యతి ||
దేహినః - దేహధారికి; అస్మిన్ - ఈ; యథా -- ఎట్లా; దేహీ - దేహంలో; కౌమారం - బాల్యము; యౌవనం - యౌవనము; జరా - ముసలితనము; తథా - అట్లే; దేహాన్తర - వేరొక దేహములోకి మార్పు; ప్రాప్తిః - పొందడము; ధీరః - ధీరుడు; తత్ర - అప్పుడు; నముహ్యతి - మోహము చెందడు.
దేహధారి ఈ దేహంలో బాల్యం నుండి యౌవనానికి, దాని నుండి ముసలితనానికి క్రమంగా వెళుతున్నట్లుగానే మరణము తరువాత వేరొక దేహంలోకి వెళతాడు ఇటువంటి మార్పుచే ధీరుడు మోహము చెందడు.
భాష్యము : ప్రతీ జీవుడు వ్యక్తిగత ఆత్మయ నందున ప్రతీక్షణం తన దేహాన్ని మారుస్తూ ఒకప్పుడు బాలునిగా, మరొకప్పుడు యౌవనవంతునిగా, ఇంకొకప్పుడు ముసలివానిగా కనబడుతూ ఉంటాడు. అయినా అదే ఆత్మ కొససాగుతూ ఎటువంటి మార్పు లేకుండ ఉంటుంది. మరణం తరువాత ఈ వ్యక్తిగతఆత్మ చివరకు దేహాన్ని విడిచి వేరొక దేహంలోకి వెళుతుంది. తరువాతి జన్మలో భౌతికమే గాని ఆధ్యాత్మికమే గాని వేరొక దేహాన్ని పొందడము నిశ్చయము కనుక ఎవరి పట్లనైతే తాను మిక్కిలి వ్యాకులపడుతున్నాడో అటువంటి భీష్ముని కొరకు గాని, ద్రోణుని కొరకు గాని మృత్యువు విషయంలో అర్జునుడు శోకించవలసిన కారణం లేదు. పైగా వారు తమ పాతశరీరాలను విడిచి క్రొత్త శరీరాలను పొందుతూ తిరిగి నూతన శక్తిని పొందబోతున్నందుకు అతడు ఆనందించాలి. జీవితంలో మనిషి చేసే కర్మను బట్టి నానారకాలైన సుఖదుఃఖాల కొరకు అటువంటి దేహమార్పులు కలుగుతాయి. భీష్మడు, ద్రోణుడు పవిత్రాత్ములైనందున తరువాతి జన్మలో నిశ్చయంగా ఆధ్యాత్మిక దేహాలను పొందబోతున్నారు లేదా కనీసము ఉన్నతమైన లౌకికభోగానికి దేవతా శరీరాలను పొందుతారు. కనుక ఇందులో ఏది జరిగినా చింతకు కారణమే లేదు.
వ్యక్తిగతఆత్మ, పరమాత్మ, భాతికఆధ్యాత్మిక ప్రకృతుల స్థితులకు సంబంధించిన పరిపూర్ణ జ్ఞానము కలిగియున్నట్టి వ్యక్తి ధీరుడని పిలువబడతాడు, అటువంటివాడు దేహమార్పుచే ఏనాడూ మోహము చెందడు.
ఆత్మ ముక్కలుగా ఖండించబడదనే విషయం ఆధారంగా ఆత్మ యొక్క అద్వయత్వానికి సంబంధించిన మాయావాద సిద్ధాంతాన్ని త్రోసిపుచ్చవచ్చును. ఆ రీతిగా వ్యక్తిగతఆత్మలుగా ఖండించబడడం భగవంతుడిని ఖండింపబడేవానిగా లేదా మార్పుచెందేవానిగా చేస్తుంది. భగవంతుడు మార్పురహితుడనే పిద్ధాంతానికి ఇది వ్యతిరేకమే అవుతుంది. గీతలో ధ్రువపరుపబడినట్లు భగవదంశలు నిత్యముగా నిలిచి ఉండి (సనాతనులు) క్షరులుగా పిలుపబడతారు; అంటే భౌతికప్రకృతికి పతనం చెందే స్వభావం వారికి ఉంటుంది. ఈ అంశలు శాశ్వతంగా అలాగే ఉన్నారు. ముక్తి తరువాత కూడ వ్యక్తిగతఆత్మ అంశగానే నిలిచి ఉంటుంది. కాని ముక్తిని పొందిన తరువాత అది భగవంతునితో ఆనందము, జ్ఞానముతో కూడిన నిత్యజీవితాన్ని గడుపుతుంది.
ప్రతీదేహంలోను నిలిచిఉండి పరమాత్మునిగా తెలియబడేవానికి ప్రతిబింబ సిద్దాంతాన్ని అన్వయించవచ్చును. ఆతడు వ్యక్తిగత జీవునికి భిన్నమైనవాడు. ఆకాశము నీటిలో ప్రతిబింబించినపుడు ప్రతిబింబములో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కూడ కనబడతాయి. నక్షత్రాలను జీవులతో పోలిస్తే సూర్యుని లేదా చంద్రుని భగవంతునితో పోల్చవచ్చును. అర్జునుడు జీవాత్మకు ప్రాతినిధ్యమయ్యాడు, కాగా దేవదేవుడైన శ్రీకృష్ణుడు పరమాత్ముడు. నాలుగవ అధ్యాయము మొదట్లో స్పష్టము కానున్నట్లు వారు ఒకే స్థాయిలో లేరు. అర్జునుడు శ్రీకృష్ణునితో సమానస్థాయిలో ఉన్నవాడైతే, శ్రీకృష్ణుడు అర్జునుని కంటే ఉన్నతుడు కాకపోతే వారిద్దరి మధ్య ఉన్నట్టి ఉపదేశకుడు, ఉపదేశితుడనే సంబంధము అర్థరహితమౌతుంది. వారిద్దరు కూడ మాయచే మోహితులైతే ఒకడు ఉపదేశకుడు, ఇంకొకడు ఉపదేశితుడు కావలసిన అవసరమే లేదు. మాయాబంధంలో ఉన్నప్పుడు ఎవ్వడూ ప్రామాణిక ఉపదేశకుడు కాలేడు కనుక అటువంటి ఉపదేశము వ్యర్థమౌతుంది. ఇట్టి పరిస్థితులలో మాయామోహితుడైన విస్కృత జీవుడగు అర్జునుని కంటే ఉన్నత స్థానంలో ఉన్నట్టి శ్రీకృష్ణుడు దేవాదిదేవునిగా అంగీకరించబడ్డాడు.
'భగవద్గీత' యధాతథము - పుస్తకము కొరకు ఇక్కడ క్లిక్ చేయండి » |