రెండవ అధ్యాయము - గీతాసారము
శ్లోకము - 1
సంజయ ఉవాచ
తం తథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణం |
విషీదన్తమిదం వాక్యమువాచ మధుసూదనః ||
సంజయః ఉవాచ - సంజయుడు పలికాడు; తం - అర్జునునితో; తథా - ఆ విధంగా; కృపయా - జాలితో; ఆవిష్టం - ఆవరింపబడినవాడు; అశ్రుపూర్ణాకుల - అశ్రుపులతో నిండిన; ఈక్షణం - కన్నులు; విషీదన్తం - శోకిస్తున్న వాడు; ఇదం - ఈ; వాక్యం - మాటలు; ఉవాచ - పలికాడు; మధుసూదనః - మధువును సంహరించినవాడు.
సంజయుడు పలికాడు: మనస్సు క్రుంగినవాడై కళ్ళలో అశ్రువులు నిండి కృపాపూర్ణుడైనట్టి అర్జునుని చూసి మధుసూదనుడు (శ్రీకృష్ణుడు) ఈ మాటలు పలికాడు.
భాష్యము : లౌకికమైన జాలి, శోకము, కన్నీరు అనేవన్నీ ఆత్మను గురించి తెలియకపోవడానికి చిహ్నాలు. నిత్యమైన ఆత్మ పట్ల చూపే జాలియే ఆత్మానుభవము. ఈ శ్లోకంలో “మధుసూదన” అనే పదము ముఖ్యమైనది. శ్రీకృష్ణభగవానుడు మధువనే దానవుని సంహరించాడు. కర్తవ్యనిర్వహణలో తనను ఆవరించినట్టి అపార్థమనే దానవుని ఇప్పుడు శ్రీకృష్ణుడు వధించాలని అర్జునుడు అనుకున్నాడు. జాలి ఎక్కడ చూపాలో ఎవ్వరికి తెలియదు. మునిగిపోతున్న వ్యక్తి వస్త్రాలపై జాలి చూపడం మూర్ఖత్వం. బాహ్యవస్త్రాన్ని , అంటే స్థూల శరీరాన్ని రక్షించడం ద్వారా అజ్ఞానసాగరంలో పడినవాడు రక్షింపబడడు. ఈ సంగతి తెలియక బాహ్యవస్తాల కొరకే శోకించేవాడు అనవసరంగా శోకించేవాడని పిలువబడతాడు. అర్జునుడు క్షత్రియుడు; ఈ నడత అతనికి తగినదిగా లేదు. అయినా శ్రీకృష్ణభగవానుడు ఆజ్ఞానియైనవాని దుఃఖాన్ని శమింపజేయగలడు. ఆ ఉద్దేశము కొరకే భగవద్గీత ఆతనిచే గానము చేయబడింది. పరమప్రామాణికుడైన శ్రీకృష్ణభగవానుడు వివరించినట్గుగా భౌతికదేహానికి, ఆత్మకు సంబంధించిన విశ్లేషణాత్మక అధ్యయనము ద్వారా ఆత్మసాక్షాత్కారాన్ని ఈ అధ్యాయము మనకు బోధిస్తుంది. మనిషి కర్మఫలాసక్తి లేకుండ పనిచేస్తూ నిజ ఆత్మభావసలో సుస్థిరునిగా నిలిచినప్పుడే ఈ అనుభూతి సాధ్యవడుతుంది.
శ్లోకము - 2
శ్రీభగవానువాచ
కుతస్త్వా కశ్మలమిదం విషమే సముపస్థితం |
అనార్యజుప్టమస్వర్గ్యమకీర్తికరమర్థున ||
శ్రీ భగవాన్ ఉవాచ - దేవదేవుడు పలికాడు; కుతః - ఎక్కడ నుండి; త్వా - నీకు; కశ్మలం - కల్మషము; ఇదం - ఈ దుఃఖము; విషమే - ఈ క్లిష్ట సమయంలో; సముపస్థితం - వచ్చింది; అనార్య - జీవిత విలువను తెలియని వ్యక్తులు; జుష్టం - ఆచరించేది; అస్వర్గ్యం - ఉన్నత లోకాలను కలుగజేయనిది; అకీరి - అపకీర్తికి; కరం - కారణమయ్యేది; అర్జున - ఓ అర్జునా
శ్రీభగవానుడు పలికాడు : అర్జునా! నీకు ఈ కల్మషాలు ఎక్కడ నుండి వచ్చాయి? జీవిత విలువను తెలిసినవానికి ఇవి ఏమాత్రము తగినవి కావు. అవి ఉన్నత లోకాలను కలుగజేయవు, పైగా అపకీర్తిని కలిగిస్తాయి.
భాష్యము : శ్రీకృష్ణుడు, భగవానుడు అభిన్నులు. అందుకే గీత అంతటా శ్రీకృష్ణుడు భగవానునిగా చెప్పబడ్డాడు. భగవంతుడు పరతత్త్వములో చరమాంశము. పరతత్త్వము మూడు దశల అవగాహనతో, అంటే బ్రహ్మముగా (సర్వవ్యాపకమైన నిరాకారబ్రహ్మతత్త్వము) పరమాత్మగా (సకల జీవుల హృదయాలలో ఉండే పరమపురుషుని రూపము), భగవానునిగా (దేవదేవుడైన శ్రీకృష్ణుడు) అనుభూతమౌతుంది. శ్రీమద్భాగవతములో ( 1.2.11 ) ఈ పరతత్వ భావన ఈ విధంగా వివరించబడింది:
వదన్తి తత్తత్త్వ విదస్తత్త్వం యత్ జ్ఞానమద్వయం |
బ్రహ్మీతి పరమాత్మేతి భగవానితి శబ్ద్యతే ||
"పరతత్త్వము తత్త్వవిదులచే మూడు దశలలో అనుభూతమౌతుంది. అవన్నీ అభినృనములు, పరతత్త్వపు ఆ దశలే బ్రహ్మము, పరమాత్మ, భగవానుడని తెలుపబడ్డాయి"
ఈ మూడు దివ్యరూపాలను సూర్యుని ఉపమానంతో వివరించవచ్చును. సూర్యునికి కూడ సూర్యకాంతి, సూర్యబింబము, సూర్యమండలము అనే మూడు విభిన్న రూపాలు ఉన్నాయి, కేవలము సూర్యకాంతిని అధ్యయనము చేసేవాడు ప్రాథమిక విద్యార్థి. సూర్యబించాన్ని అర్థం చేసికొన్నవాడు మరింత ఉన్నతుడు. ఇక సూర్యమండలంలో ప్రవేశింపగలిగినవాడు అత్యున్నతుడు. కేవలము సూర్యకాంతి అవగాహనతో, అంటే దాని విశ్వవ్యాపకత్వాన్ని, తేజోమయమైన దాని నిరాకార స్వభావాన్ని తెలిసికోవడంతో సంతృప్తి చెందే విద్యార్థులను పరతత్త్వపు బ్రహ్మానుభూతిని పొందినవారితో పోల్చవచ్చును. మరింత పురోగమించిన విద్యార్థి సూర్యబింబాన్ని తెలిసికోగలుగుతాడు. అట్టి సూర్యబింబము పరతత్త్వపు పరమాత్మజ్ఞానంతో పోల్చబడింది. ఇక సూర్యలోకంలోకి ప్రవేశింపగలిగిన విద్యార్థి పరతత్త్వపు రూపలక్షణాలను అనుభూతము చేసికొన్నవారితో పోల్చబడతాడు. అందుకే పరతత్త్వ అధ్యయనంలో నెలకొనిన విద్యార్థులందరు ఒకే విషయ అధ్యయనంలో నెలకొనినప్పటికిని పరతత్త్వపు భగవానుడనే లక్షణాన్ని అనుభూతము చేసికొన్నట్టి భక్తులే మహోన్నత ఆధ్యాత్మికులు. సూర్యకాంతి, సూర్యబింబము, సూర్యలోకంలోని కర్మలు అభిన్నములైనా ఈ మూడు వివిధ దశల విద్యార్థులు
ఒకే తరగతికి చెందినవారు కారు.
"భగవానుడు" అనే సంస్కృత పదము గొప్ప ప్రామాణికుడు, వ్యాసదేవుని తండ్రియైన పరాశరమునిచే వివరించబడింది. సర్వసంపదలు, సర్వశక్తి, సర్వయశస్సు, సర్వసౌందర్యము, సర్వజ్ఞానము, సర్వవైరాగ్యము కలిగిన పరమపురుషుడే భగవంతుడని పిలువబడతాడు. చాలా ధనవంతులు, చాలా శక్తిమంతులు, చాలా అందమైనవారు చాలా యశస్సు కలిగినవారు, చాలా విద్యావంతులు, ఎంతో వైరాగ్యవంతులు చాలా మంది ఉంటారు. కాని సర్వసంపదలు, సర్వశక్తి మున్నగుసపన్నీ పూర్తిగా తమకు ఉన్నాయని ఎవ్వరూ చెప్పుకోలేరు. పరమపురుషుడైన కారణంగా కేవలము శ్రీకృష్ణుడు మాత్రమే అది చెప్పుకోగలడు. బ్రహ్మ, శివుడు, నారాయణునితో పాటుగా ఏ జీవుడు కృష్ణుని యంతగా పూర్ణ విభూతులను కలిగి ఉండడు. అందుకే శ్రీకృష్ణుడే దేవాదిదేవుడని స్వయంగా బ్రహ్మచే బ్రహ్మసంహితతలో నిర్ణయించబడింది. ఆతనికి సమానమైనవారు గాని, అధికులు గాని లేరు. ఆతడే ఆదిదేవుడు, గోవిందునిగా తెలియబడేవాడు, సర్వకారణాలకు పరమకారణుడు.
ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానందవిగ్రహః |
అనాదిరాదిర్గోవిందః సర్వకారణకారణం ||
"భగవంతుని లక్షణాలను కలిగిన పలువురు వ్యక్తులు ఉన్నారు. కాని తనను మించినవాడు వేరొక్కడు లేనందున శ్రీకృష్ణుడే పరమపురుషుడు, ఆతని దేహము నిత్యమైనది, జ్ఞానపూర్ణమైనది, ఆనందమయమైనది. ఆతడే ఆదిదేవుడైన గోవిందుడు, సర్వకారణకారణుడు" (బ్రహ్మసంహిత 5,1).
శ్రీమద్భాగవతములో కూడ భగవంతుని పలు అవతారాల పట్టిక ఇవ్వబడింది. కానీ శ్రీకృష్ణుడు మాత్రము స్వయం భగవానునిగా వర్ణింపబడ్డాడు. ఆతని నుండి పలు అవతారాలు, పురుషావతారాలు విస్తరిస్తాయి.
శ్లోకము - 3
ఏతే చాంశకలాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం |
ఇంద్రారి వ్యాకులం లోకం మృడయన్తి యుగే యుగే ||
"ఇక్కడ తెలుపబడిన భగవదవతారాలన్నీ పరమపురుషుని అంశావతారాలు లేదా కళావతారాలు అయియున్నాయి. కాని శ్రీకృష్ణుడు స్వయం భగవానుడు" (భాగవతము 1.3.28). కనుక శ్రీకృష్ణుడు ఆదిపురుషుడు. ఆతడే పరమాత్మకు, నిరాకారబ్రహ్మముకు మూలమైనట్టి పరతత్త్వము.
దేవదేవుని సన్నిధిలో అర్జునుడు తన బంధువుల కొరకు దుఃఖించడం నిక్కముగా అనుచితమే. అందుకే శ్రీకృష్ణుడు "కుతః” (ఎక్కడ నుండి) అనే పదముతో తన అశ్చర్యాన్ని వ్యక్తపరిచాడు. ఆర్యులుగా తెలియబడే నాగరికజనుల కోవకు చెందిన వ్యక్తి నుండి అటువంటి కల్మషాలు ఊహాతీతము. జీవిత విలువలు తెలిసియుండి ఆధ్యాత్మికానుభూతిపై ఆధారపడిన నాగరికతను కలిగిన జనులకే ఆర్యులనే పదము అన్వయిస్తుంది. భౌతికభావనతో జీవించేవారు పరతత్త్వపు (విష్ణువు లేదా భగవానుడు) అనుభూతియే జీవితలక్ష్యమని ఎరుగక భౌతికజగత్తు యొక్క బాహ్యలక్షణాలకే ఆకర్షితులౌతారు. అందువలన ముక్తి అంటే ఏమిటో వారికి తెలియదు. భవబంధవిముక్తి గురించిన జ్ఞానము లేనివారు అనార్యులని పిలువబడతారు. అర్జునుడు క్షత్రియుడేయైనా యుద్ధం చేయడానికి నిరాకరించి విధ్యుక్తధర్మాల నుండి తప్పుకుంటున్నాడు. ఇట్టి పిరికికార్యము అనార్యులకు తగినదిగా వర్ణించబడింది. అటువంటి ధర్మోల్లంఘన మనిషికి ఆధ్యాత్మికజీవన ప్రగతిలో తోడ్పడదు, ఈ ప్రపంచంలో యశోవంతుడు కావడానికి అవకాశము ఇవ్వదు, అందుకే బంధువుల పట్ల అర్జునుని నామమాత్ర జాలిని శ్రీకృష్ణభగవానుడు ఆమోదించలేదు.
'భగవద్గీత' యధాతథము - పుస్తకము కొరకు ఇక్కడ క్లిక్ చేయండి » |