: ధ్యానం :
ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభం
లంబోదరం విశాలాక్షం జ్వలత్పావకలోచనం
ఆఖుపృష్ఠ సమారూఢం చామరైః వీజితం గణైః
శేషయజ్ఞోపవీతం చ చింతయేత్తం గజాననం
ఏకవింశతి నామ పూజ :
ఓం సుముఖాయ నమః | మాలతీ పత్రం పూజయామి |
---|---|
ఓం గణాధిపాయ నమః | బృహతీ పత్రం పూజయామి |
ఓం ఉమాపుత్రాయ నమః | బిల్వ పత్రం పూజయామి |
ఓం గజాననాయ నమః | దూర్వాయుగ్మం పూజయామి |
ఓం హరసూనవే నమః | దత్తూర పత్రం పూజయామి |
ఓం లంబోదరాయ నమః | బదరీ పత్రం పూజయామి |
ఓం గుహాగ్రజాయ నమః | అపామార్గ పత్రం పూజయామి |
ఓం గజకర్ణాయ నమః | జంబూ పత్రం పూజయామి |
ఓం ఏకదంతాయ నమః | చూత పత్రం పూజయామి |
ఓం వికటాయ నమః | కరవీర పత్రం పూజయామి |
ఓం భిన్నదంతాయ నమః | విష్ణుక్రాంత పత్రం పూజయామి |
ఓం వటవే నమః | దాడిమీ పత్రం పూజయామి |
ఓం సర్వేశ్వరాయ నమః | దేవదారు పత్రం పూజయామి |
ఓం ఫాలచంద్రాయ నమః | మరువక పత్రం పూజయామి |
ఓం హేరంబాయ నమః | సింధువార పత్రం పూజయామి |
ఓం శూర్పకర్ణాయ నమః | జాజీ పత్రం పూజయామి |
ఓం సురాగ్రజాయ నమః | గణ్డకీ పత్రం పూజయామి |
ఓం ఇభవక్త్రాయ నమః | శమీ పత్రం పూజయామి |
ఓం వినాయకాయ నమః | అశ్వత్థ పత్రం పూజయామి |
ఓం సురసేవితాయ నమః | అర్జున పత్రం పూజయామి |
ఓం కపిలాయ నమః | అర్క పత్రం పూజయామి |
వినాయక చవితి నాటి పూజకీ సంకటహర గణపతి పూజకీ తేడా కేవలం రెండు విషయాలలోనే. తులసీ పత్రం బదులు జంబూ పత్రం (నేరేడాకు) వాడటము, నైవేద్యంగా కుడుములు, ఉండ్రాళ్ళకు తోడు నల్ల నువ్వులను సమర్పించడము.