ముక్కనుము - Mukkanumu |
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ యొక్క నాల్గవ రోజు వస్తుంది.
ముక్కనుము :
సంక్రాంతి వెళ్లిన మరునాడు కనుమ పండుగ. ఇది పశువుల పండుగ. మనకు ఎంతో మేలు చేసే పశువులకు కృతజ్ఞతగా పశువుల కొమ్ములకు, బండ్లకు రంగులు వేస్తారు. పశువులను పూజిస్తారు.
మరుసటి రోజు ముక్కనుము. సంక్రాంతి పండుగ మూడు రోజులు వెళ్లిన అనంతరం మహిళలు చేసే వ్రతం సావిత్రి గౌరీ వ్రతం. దీనినే బొమ్మల నోము అని కూడా అంటారు.మకర సంక్రాంతికి సాదరంగా రథంపై వీడ్కోలు చెప్పినట్లుగా ఉండే రథం ముగ్గును కనుమ రోజున వేస్తారు. భోగిరోజు బలి చక్రవర్తి భూలోకంలోకి వస్తాడని, సంక్రాంతి రోజు రాజ్యం ఏలి, కనుమనాడు వెళ్లిపోతాడని ఓ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. పేడ నీళ్లతో గృహ ప్రాంగణాన్ని అలికి, శుభ్రం చేసి, గుల్ల సున్నపు పిండితో ముగ్గులు వేస్తారు. పేడ, ముగ్గులలోని కాల్షియం క్రిమి కీటకాల సంహారానికి తోడ్పడుతుంది. శరీరంలోని అనేక రోగాలను నిగ్రహించే శక్తిని దీని వాసన ప్రసాదిస్తుంది. ముగ్గులలోని కళాత్మకత, కళ్లకు సంబంధించిన నరాలను ప్రేరేపించి, సంతోష భావాన్ని మెదడుకు అందిస్తుంది. మొత్తానికి రంగవల్లులను దిద్దడం అనేది ఒక కళయే కాకుండా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదించే మహత్తర సాధనం.
సంక్రాంతి |
ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి:
- మకర సంక్రాంతిని పంజాబీ లు ‘లోహడీ’ అనీ
- బెంగాలీలు ‘తిలప్రా సంక్రాం తి’ అనీ
- మహారాష్టల్రో ‘తిల సంక్రాంతి ’ అనీ
- తమిళనాడులో ‘పొంగల్’ అనీ
- ఉత్తర ప్రదేశ్లో ‘బడీ ఈద్’ అనీ, మొక్కుల పండుగ అనీ పిలుస్తారు.
- ప్రాచీన సంప్రదాయకులైన గ్రీకులు ‘బౌకన్’ అనే దేవత స్మృత్యర్థం సంక్రాంతి పండుగను చేసుకుంటారు.
- ఈజిప్టు సిద్ధాంత వేత్తలు ఈ మకరరాశికి ‘నమ్’ జలాధి దేవతలకు సంబంధం ఏర్పరచి, సూర్యుని మకర రాశి ప్రవేశానికి- నైలు నది ఉప్పొంగడానికి సంబంధం కలిపారు.
ఇలా ప్రపంచ వ్యాప్తమైన ఈ సంక్రాంతి తెలుగు లోగిళ్ళకు ప్రకృతి మాత రూపంలో స్వాగతం పలుకుతుంది. తెలుగు పండుగల్లో అతి పెద్ద పండుగైన సంక్రాంతిని ఆబాల గోపాలం ఆనందంగా జరుపుకుంటారు. తెలుగు ప్రాంతం కళకళలాడే పండుగ సంక్రాంతి.